🍁🍁🍁🍁🍁🍁🍁🍁
సంబంధాలు అభివృద్ధి చెందాలంటే.......
ఇంట్లో నైనా సరే, ఆఫీసులోనైనా సరే మానవ సంబంధాలలో సమస్యలు రాకుండానూ ఒకటి అర సమస్యలు వచ్చినా అవి గోరంతలు కొండంతలు కాకుండా చూసుకోవాలంటే:
👌అన్నింటికీ నేనే పెద్ద వాడినని కాని, నేనే గొప్పవాడినని కాని అహంభావం ప్రదర్శించకండి.
♦️అర్థం పర్ధం లేకుండా పర్యవసనాలు ఏమిటో గ్రహించ కుండా అనవసరంగా ఏదేదో మాట్లాడటం మానండి.
♦️ఏ వ్యవహారం లోనైనా తగాదాలలోనైనా నేర్పుగా, ఓర్పు గా వ్యవహరించండి.
♦️మీరు చెప్పింది సరైనది అని, వాదులాడకండి. సంకుచిత మనస్తత్వాన్ని విడిచి పెట్టండి.
♦️ఏదీ నిజమో, ఏది అబద్ధమో సరిగ్గా తెలుసుకోకుండా ఇక్కడ విన్నది అక్కడ, అక్కడ విన్నది ఇక్కడ మాట్లాడటం మానండి.
♦️మిగిలిన వారి కన్నా మీరే గొప్ప వాళ్ళమనుకుంటూ, మీ గురించి మీరు ఉన్నతంగా ఊహించుకుంటూ గర్వించకండి.
♦️మితిమీరి అవసరాలకు మించి ఆశపడకండి.
♦️అవతల వాళ్ళ కు సంబంధము ఉన్న లేకపోయినా మీ పాటికి మీరు ప్రతి ఒక్కరి దగ్గర అన్ని విషయాలు చెప్పడమనే అలవాటు మానుకోండి.
♦️మీ చెవిని పడ్డంత మాత్రాన ప్రతి విషయాన్ని నమ్మకండి.
♦️చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసుకోకండి.
♦️మీరు చెప్పిందే సరైనదంటూ మంకుపట్టు పట్టకండి. కాస్తంత పట్టూవిడుపూ చూపండి.
♦️ఇతరుల మాటలను చేతులను జరుగుతున్న విషయాలను తప్పు గా అర్థం చేసుకోకండి.
♦️ఇతరుల తో మర్యాదగా వ్యవహరించడం, మర్యాదతో సహ్రుద్బావపూర్వకంగా మాట్లాడటం విస్మరించకండి.
♦️చిరునవ్వు తో పలకరించడం, మాట్లాడటం, లాంటివి కూడా తీరికలేనట్లుగా ప్రవర్తించకండి.
♦️మాటల్లో కానీ చేతల్లో కానీ మర్యాదలేని పదాలు వాడకండి. అనవసరమైన దర్పం చూపకండి. అణకువ చూపుతూ మంచిగా మర్యాదగా వ్యవహరించండి.
♦️ఏదైనా తగాదా వచ్చినప్పుడు అవతలివాళ్ళే ముందుగా దిగిరావాలని ఎదురు చూడకండి. మీరే మాట్లాడడానికి ముందుకు రండి.
సేకరణ
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి