13, అక్టోబర్ 2020, మంగళవారం

ఉచ్చిష్ట మంటే



ఉచ్చిష్ట మంటే" దూడ త్రాగి ఎంగిలి చేసిన ఆవుపాలు అని అర్థము. 2) " శివ నిర్మాల్యం" అంటే శివుని జటాజూటం నుండి దిగివచ్చిన గంగ,.3) "న మనం" అంటే తేనెటీగలు పువ్వు నుండి నింపుకొని తెట్టులో వాంతి చేసిన " తేనె". 4)"మృత కర్పటం" అంటే పట్టుపురుగు తన చుట్టూ దారంతో గూడు అల్లుకుంటే ఆ గూళ్ళను నీటిలో మరగబెట్టి దారం తీసి చేసిన "పట్టు వస్త్రం.". 5)"కాక విస్టా సముద్ర భూత అంటే కాకి రెట్ట వేస్తే దానిలో ఉండే అశ్వత్థపు గింజలు మొలచి చెట్టయినా అశ్వద్ధ వృక్షం. అందుకే కాబోలు ఆవుపాలు గంగా తేనె దేవుని అభిషేకానికి పవిత్ర వస్తువులు అయితే పట్టు వస్త్రములు విష్ణుమూర్తికి పీతాంబర మైనది. ఇక అశ్వద్ధమంటూ త్రిమూర్తుల సన్నిధి గల పవిత్ర వృక్షం. "మజుందార్, బెంగుళూర్.

ఈ విషయాలు మీకు తెలుసా!? .1) తత్వజ్ఞానం లో, విష్ణుభక్తి లో, ధైర్యం లో, స్త్యేర్యం లో, పరాక్రమము లో, వేగంలో, లాఘవం లో, వ్యర్ధ ప్రసంగ రా హిత్యం లో,. పాండిత్యంలో, పటుత్వం లో, శూరత్వం లొ, బలము లో, ఉభయ సైన్యము లందును "భీమసేనునికి" సముడు లేడు.

 2)"భీమసేనుని గురించి "యుధిష్ఠిరుడు వారు మాట్లాడిన మాటలు:- "సకల లోక సంబంధమైన ధర్మము, అర్థము, కామము, మోక్షము, యశస్సు, అన్ని నిజముగా నీ వశము నందు ఉన్నవి. 3) విరాట పర్వము లో దుర్యోధనుని మాటలు:-" వీరులలో, శస్త్ర వైదుష్యం కలవారిలో, నైపుణ్య వంతుల లో, తత్వ నిర్ణయము చేయుటలో, శక్తి యందు, బాహుబలము నందు, ధైర్యము నందు, చేష్ట వైశిష్ఠ్యము నందు, శారీరకమైన విశేషము లందు ప్రస్తుతము మనుష్యులు లోకమున దైత్య నర రాక్షసుల ఆదిగా గల ప్రాణులలో నలుగురే బల పౌరుష ములు కలవారు ఉన్నారు. వారు భీమసేనుడు, బలరాముడు, మద్ర రాజు మరి నాల్గవ వాడు కీచకుడు. ఇక ఐదవ వానిని మేము వినలేదు. వీరిలో క్రమముగా బలాది క్య ము లో భీముడు మొదలు ,బలరాముడు రెండవవాడు. అతని తరువాత మద్రా రా జు అయిన శల్యుడు, మూడవ వాడు. అతని తరువాత కీచకుడు, నాలుగవ వాడు .అని కీర్తింప బడుతున్నారు. ఐదవ వానిని మేము వినలేదు. 4) ఉద్యోగ పర్వము లో శ్రీ కృష్ణుని మాటలు:- "భీమసేన! నీవు నీలో ఏ కొంచెం కల్యాణ గుణములను భావించుకుంటూ నావో వానికి వెయ్యి రెట్లు ఆ గుణములు నీలో ఉన్నవని నేను భావించుచున్నాను. భీమసేన! నీవు సమస్త రాజుల చేత పూజింపబడే కులమున, దానికి తగిన వాడాయి జన్మించి ఆ కులమునకు యోగ్యమైన కర్మలను ఆచరించే వాడవు అయినావు. భీమసేన! ఈ యుద్ధము నందు భారత మంతయు నీయందే నిలుపబడినది. అర్జునుడు దురంధరుడు అయితే నీవు సకల "సైన్య రక్షకుడవు" అంటే అర్జునుడు సారధి వంటివాడు. నీవు రక్షకుడైన రథి వంటివాడవు. ఇట్లు భారతమున వాయు అవతారాలైన భీమసేను ల మహిమ వర్ణింపబడినది. "సేకరణ : మహాభారత తాత్పర్య నిర్ణయము. సమర్పణ:-" మజుందార్, బెంగుళూర్"

కామెంట్‌లు లేవు: