#తెలుగులో_శ్రీ_హనుమాన్_చాలీసా
#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి
#సంభవామి_యుగే_యుగే
తెలుగులో శ్రీ హనుమాన్ చాలీసా
అనువాదం శ్రీ ఎం ఎస్ రామారావు గారు
ఆపదామ పహర్తారం
దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం
హనుమాన్ అంజనా సూనుః
వాయుపుత్రో మహా బలహః
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః
ఉధధిక్రమణ శ్చైవ సీతా శోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్!!
శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు ||
బుద్ధిహీనతను కలిగిన తనువులు
బుద్భుదములని తెలుపు సత్యములు ||శ్రీ||
1. జయ హనుమంత జ్ణానగుణవందిత
జయపండిత త్రిలోక పూజిత ||
2.రామదూత అతులిత బలధామ
అంజనీపుత్ర పవనసుతనామ ||
3. ఉదయభానుని మధురఫలమని
భావన లీల అమృతమును గ్రోలిన ||
4. కాంచనవర్ణ విరాజితవేశా
కుండలమండిత కుంచితకేశా ||శ్రీ||
5. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగ్రీవున నిలిపి ||
6. జానకీపతి ముద్రిక దోడ్కొని
జలధి లంఘించి లంక జేరుకొని ||
7. సూక్ష్మరూపమున సీతను చూచి
వికటరూపమున లంకను గాల్చి ||
8. భీమరూపమున అసురుల జంపిన
రామకార్యమును సఫలముజేసిన ||శ్రీ||
9. సీత జాడకని వచ్చిననిను కని
శ్రీరఘువీరుడు కౌగిట నినుగొని ||
10. సహస్రరీతుల నిను కొనియాడగ
కాగలకార్యం నీపై నిడగా ||
11. వానరసేనతో వారధిదాటి
లంకేశునితో తలపడి పోరి ||
12. హోరుహోరున పోరుసాగిన
అసురసేనల వరుసన గోల్చిన ||శ్రీ||
13. లక్ష్మణ మూర్చతో రాముడడలగ
సంజీవిదెచ్చిన ప్రాణప్రదాత ||
14. రామలక్ష్మణుల అస్త్రధాటికి
అసురవీరులు అస్తమించిరి ||
15. తిరుగులేని శ్రీరామ బాణము
జరిపించెను రావణ సంహారము ||
16. ఎదిరిలేని ఆ లంకాపురమున
ఏలికగా ఆ విభీషణు చేసిన ||శ్రీ||
17. సీతారాములు నగవులు గనిరి
ముల్లోకాల హారతులందిరి ||
18. అంతులేని ఆనందాశ్రువులే
అయోధ్యాపురి పొంగిపొరలే ||
19. సీతారాముల సుందర మందిరం
శ్రీకాంతుపదం నీ హృదయం ||
20. రామచరిత కర్ణామృతగానా
రామనామ రసామృతపాన ||శ్రీ||
21. దుర్గమమగు ఏ కార్యమైన
సుగమమేయగు నీ కృపజాలిన ||
22. కలుగు సుఖములు నిను శరణన్న
తొలగు భయములు నీ రక్షణయున్న ||
23. రామద్వారపు కాపరివైన నీ
కట్టడిమీర బ్రహ్మాదుల తరమా ||
24. భూతపిశాచ శాకినీ ఢాకినీ
భయపడి పారు నీ నామ జపమువిని ||శ్రీ||
25. ధ్వజావిరాజా వజ్రశరీరా
భుజబలతేజా గదాధరా ||
26. ఈశ్వరాంశ సంభూత పవిత్ర
కేసరీపుత్ర పావనగాత్ర ||
27. సనకాదులు బ్రహ్మాదిదేవతలు
శారద నారద ఆదిశేషులు ||
28. యమకుబేర దిక్పాలురు కవులు
పులకితులైరి నీ కీర్తిగానముల ||శ్రీ||
29. సోదర భరత సమానాయని
శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా ||
30. సాధులపాలిట ఇంద్రుడవన్నా
అసురలపాలిట కాలుడవన్నా ||
31. అష్టసిద్ధి నవనిధులకు దాతగా
జానకీమాత దీవించెనుగా ||
32. రామరసామృతపానము చేసిన
మృత్యుంజయదవై వెలసిన ||శ్రీ||
33. నీనామ భజన శ్రీరామ రంజన
జన్మ జన్మాంతర దుఃఖభంజన ||
34. ఎచ్చటుండినా రఘువరదాసు
చివరకు రాముని చేరుట తెలుసు ||
35. ఇతర చింతనలు మనసున మోతలు
స్థిరముగ మారుతి సేవలు సుఖములు ||
36. ఎందెందున శ్రీరామ కీర్తన
అందందున హనుమాను నర్తన ||శ్రీ||
37. శ్రద్ధగా దీనిని ఆలకింపుమా
శుభమగు ఫలములు గలుగుసుమా ||
38. భక్తిమీరగ గానముసేయగ
ముక్తి గలుగు గౌరీశులసాక్షిగ ||
39. తులసీదాస హనుమాను చాలీసా
తెలుగున సుళువుగ నలుగురు పాడగ ||
40. పలికిన సీతారాముని పలుకున
దోశములున్న మన్నింపుమన్నా ||శ్రీ||
మంగళ హారతి గొను హనుమంత - సీతారామ లక్ష్మణ సమేత |
నా అంతరాత్మ నిలుమో అనంత - నీవే అంతా శ్రీహనుమంత ||
సంపూర్ణము ఓం శాంతిః శాంతిః శాంతిః
#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి
#సంభవామి_యుగే_యుగే
అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం. https://www.facebook.com/sambhavami2498/
అందరం భక్తితో " జై శ్రీరామ్ జై హనుమాన్ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు
జై శ్రీరామ్
జై హనుమాన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి