తల్లిపాలలో కలుగు దోషాలు - శిశువుకి కలుగు ఉపద్రవాలు - 2 .
తల్లిపాల విశిష్టత గురించి అంతకు ముందు పోస్టు నందు వివరించాను. ఇప్పుడు మీకు తల్లిపాలు ఎందువలన దోషము పొందుతాయో మీకు వివరిస్తాను.
తల్లిపాలు దోషము పొందుటకు కారణాలు -
ముందు తిన్న ఆహారం జీర్ణం కాకమునుపే తల్లి మరలా భుజించడం , తేలికగా జీర్ణం అవ్వని పదార్ధాలు భుజించటం , విరుద్ద ఆహారాలు భుజించడం , ఉప్పు , పుల్లటి , చేదు , పదార్దాలు అతిగా సేవించటం , చెడిన ఆహార సేవనం , అతిగా దుఃఖం పొందుట , రాత్రి యందు నిద్రపోకపోవడం , తీవ్ర ఆలోచన కలిగి ఉండటం , మలమూత్ర వేగాలు నిరోధించుట , బెల్లముచే చేయబడు పరమాన్నం , పులగము , పెరుగు , చేపలు , మాంసపదార్ధాల సేవనం , పగలు నిద్రించుట , మద్యపానం , దెబ్బలు తగిలించుకొనుట , కోపము , ఇతర వ్యాధులు .
పైన చెప్పిన కారణాల వలన శరీరము నందు దోషము ప్రకోపించి స్తన్యము వాహకములు అగు సిరలు చెడి స్తన్యము ( తల్లిపాలు ) దోషము పొంది 8 రకముల దోషాలు శిశువుకు కలిగించును . వాతము వలన స్తన్యము దోషము పొందిన రుచి లేకుండా ఉండటం , నురుగుతో కూడి రూక్షముగా ఉండును. పిత్తము వలన దోషము పొందిన తల్లిపాల రంగు మారును . దుర్గన్ధమ్ కలిగి ఉండును. కఫము వలన దోషము పొందిన తల్లిపాలు జిడ్డుగా ఉండి చేదుగా ఉండు లక్షణాలు కలిగి ఉండును.
వాతపిత్తకఫాల వలన దోషములు పొందిన పాలు తాగడం వలన శిశువుకు అనేక రకాలైన జబ్బులు సంభవించును . శిశువుకు ఎటువంటి దోషాలు సంభవించునో తరవాతి పోస్టునందు సంపూర్ణముగా వివరిస్తాను .
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి