13, అక్టోబర్ 2020, మంగళవారం

ప్రత్యక్ష జ్ఞనం

 ప్రత్యక్ష జ్ఞనం 

ముందుగా మనం జ్ఞానం  అంటే ఏమిటో తెలుసుకుందాము  జ్ఞానం అంటే నీకు తెలియని విషయం తెలుసుకోటం. అంటే నీకు నీవు చూసే ప్రతిదీ నీకు తెలియదు కానీ దానిని గూర్చి ఎవరైనా చెపితే అప్పుడు నీకు దానిని గూర్చిన జ్ఞానం  కలుగుతుంది.  ఎప్పుడైతే నీవు ఆ వస్తువు యెక్క విషయాన్ని తెలుసుకుంటావో అప్పుడు నీవు ఆ వస్తువుకు సంబందించిన జ్ఞానివి అవుతావు. ఇక్కడ మూడు విషయాలు తెలుసుకోవాలి ముందుగా నీకు ఒక వస్తువు యొక్క జ్ఞానం లేదు అంటే నీవు ఆ వస్తువుకు సంబందించిన జ్ఞానం లేనివాడివి అంటే ఆ విషయపు అజ్ఞానం నీలో వున్నది. కానీ నీకు విషయం జ్ఞానం కలిగినప్పుడు నీవు ఆ విషయపు జ్ఞానివి అయ్యావు అంటే ఆ విషయం అజ్ఞానం నీనుండి తొలగి పోయింది. అదే విధంగా నీవు ఈ జగత్తులోని ప్రతి విషయాన్నీ తెలుసుకొని దానికి సంబందించిన జ్ఞానాన్ని పొందుతున్నావు. 

 ప్రత్యక్షం అంటే ఏమిటి: 

మనం దేనినయితే చూస్తామో దానిని ప్రత్యక్షం అంటామని మనం అనుకుంటాము. కానీ నిజానికి ప్రత్యక్షం అనే పదానికి అర్ధం మనం మన ఇంద్రియముల ద్వారా దేని ఉనికిని తెలుసుకోగలమో ఆ జ్ఞానం అని అర్ధం. ప్రత్యక్ష జ్ఞానం అంటే మనం చూసే వస్తు వస్తు అంటే నిర్జీవి అని కాదు ఏమైనా కావచ్చు. 

వస్తువు, జ్ఞానం, గురువు: 

నీ ముందర నీవు కాకుండా మూడు విషయాలు వున్నాయి అవి వస్తువు అంటే నీవు దేని గూర్చి అయితే తెలుసుకోవాలని అనుకుంటున్నావో ఆ వస్తువు. దానికి సంబందించిన జ్ఞానం మరియు ఆ జ్ఞానాన్ని నీకు బోధించే వ్యక్తి ఆయనే నీ గురువు. గురువు అంటే నీకు తెలియని విషయాన్నీ నీకు తెలిపే వాడు. 

జ్ఞానం లో స్థాయిలు: 

ఒక విషయానికి సంబందించిన జ్ఞానం నలుగురికి వున్నా ఒక్కక్కరికి ఒక్కొక్క స్థాయిలో విషయం జ్ఞానం ఉంటుంది. దీనిని పరిశీలిద్దాం. 

నీ ఇంటి ముందుకు ఒక కారు వచ్చి ఆగింది దానిని నీవు చూసావు. నీవు చూడటం వల్ల నీకు ఆ కారు అక్కడ వున్న జ్ఞానం కలిగింది అది దానిని చూడటం వల్ల కలిగిన జ్ఞానం. అప్పుడు దానిలోంచి ఒక వ్యక్తి దిగాడు అతనికి ఆ కారు నడిపే జ్ఞానం వుంది అందుకే వానిని డ్రైవరు అన్నారు. నీకు కారుకి సంబందించిన జ్ఞానం కన్నా వానికి కొంచం ఎక్కువ జ్ఞానం వుంది అందుకే దానిని నడప గలుగుతున్నాడు. మరి ఆ కారు చెడిపోతే ఒక మెకానికుని పిలుస్తారు అతనికి ఆ కారు నడిపే వానికన్నా మరింత ఎక్కువ జ్ఞానం వుంది అందుకే దానిని బాగుచేయగలడు. అలా ఒక విషయానికి సంబందించిన జ్ఞానం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్థాయిలో వున్నది. నిజం ఏమిటంటే ఇందులో ఏవొక్కరు కూడా సంపూర్ణ జ్ఞాన వంతులు కారు. సంపూర్ణ జ్ఞాన వంతుడు ఆ కారు తయారు చేసిన వాడు అని అనుకుందామా అంటే వాడు కూడా కాదు ఎందుకంటె కారు కొంతమంది కలసి తయారు చేశారు అందులోకూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విభాగానికి సంబందించిన జ్ఞానం మాత్రమే వుంది. 

దీనిని బట్టి మనకు తెలిసింది ఏమిటంటే మనం బౌతికంగా చూసే విషయాలలోనే పరిపూర్ణ జ్ఞానం ఎవరికి లేదు కదా మరి భగవంతుడి విషయంలో అది ఎలా సాధ్యం అవుతుంది. 


కామెంట్‌లు లేవు: