🌷🌷
*_దైవార్పితము చేయకుండా, ఇతరులకు పెట్టకుండా కేవలం తన కోసమే ఆహారమును తయారు చేసుకొని తినేవాడు పాపమును తింటున్నట్టే లెక్క. మనం చేసే కర్మ మన శరీరాన్నే కాకుండా మన మనస్సును, బుద్ధిని కూడా పవిత్రం చేయగలిగేలా ఉండాలి. దానికి నిర్దేశింపబడినవే పూజలు, వ్రతాలు, సేవలు మొదలైన పవిత్ర కర్మలు. పరమాత్మకు మనం వండుకున్నది నివేదించి దానిని ప్రసాదంగా భుజించడం వలన మన బుద్ధి, అంతరంగము పరిశుద్ధము అవుతాయి. భగవంతుని ఆరాధించి, దేవతలకు కృతజ్ఞతలు చెప్పి, తాను వండుకున్న ఆహారమును భగవంతునికి నివేదించి, సాటి మానవులకు, భూతములకు కొంచెం పెట్టి మిగిలింది తాను తినాలి. ఇట్టివాడు సకలపాపముల నుండి విముక్తుడు అవుతాడు. ఇటువంటి వాడు అసలు పాపాలే చెయ్యడు. ఇంక విముక్తి ప్రసక్తే లేదు అని అనుకోవాలి._*
🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి