7, జూన్ 2024, శుక్రవారం

ఆత్మ అంటే ఏమిటి

 ""ఆత్మ అంటే ఏమిటి?

"పరమ"ఆత్మ అనీ,"జీవ"ఆత్మ అనీ

"ప్రేత"ఆత్మ అనీ!అంతరాత్మ అనీ

ఆత్మ కి ఇన్ని తీరులా?ఇన్ని పేరులా?


ఇంతకు ,ఆత్మ అంటే ప్రాణమా?కాదు.మనస్సా?కానే కాదు.

బుద్ధా?అసలే కాదు.మరి దేనిని "ఆత్మ"అని పిలవాలి?

శరీరాన్ని కాదులే అని అందరికీ తెలిసిందే.


ఆత్మ స్థిరమన్నారు--సత్యమన్నారు.

అది తెగదన్నారు--తడవదన్నారు.

కాగదన్నారు--కాలదన్నారు.

అసలు దానికి--ఏమీ కాదన్నారు.

శరీరం వస్తే--అది వస్తుందన్నారు.

శరీరం చస్తే--అది చావదన్నారు.

శరీరం కర్మ--దానిని చేర దన్నారు.

కర్మ ఫలానికి--అది పూచీ కాదన్నారు.

జన్మ పరంపర కు--దానికి సంబంధం లేదన్నారు.

పూర్వ జన్మ స్థూల కర్మ ఫలంలో సూక్ష్మ శరీరం మళ్ళీ పుట్టి స్థూలమైతే,అందులో చేరుతుందన్నారు.అది చచ్చేదాక అందులోనే ఉంటుందని అన్నారు.

మళ్లీ మళ్ళీ---అదే తీరు!..

.

మానవజీవిత గమ్యం -వేమన పద్యం

తెలుగునాట పుట్టిన మహనీయుల్లో వేమన యోగి ఉత్తమ శ్రేణికి చెందినవాడు.ఆయనను చాలామంది ఒక సంఘసంస్కర్తగా భావిస్తున్నారు. ఇది పొరపాటు.ఆయనను ఒక కులానికి పరిమితం చెయ్యడమూ తప్పే.సాధారణ మానవ పరిమితులను దాటినవారే మహానీయులనబడతారు. వారు కులానికి మతానికి జాతికి అతీతులౌతారు. మానవత్వమూ దైవత్వమే వారి విధానాలు అవుతాయి.వేమన అటువంటి సద్గురువులలో ఒకడు.మానవాతీతులైనవారిని ఒకకులానికి మతానికి ప్రాంతానికి పరిమితం చెయ్యకూడదు.ఆదిత్యయోగీ..


ఆయన పద్యాలలో ఉత్తమమైన యోగసాధన రహస్యంగా చెప్పబడింది. వేదాంతమూ వైరాగ్యమూ యోగమూ ఆయన తన పద్యాలలో సరళంగా బోధించాడు.రసవాదం కూడా రహస్యంగా ఆయన పద్యాలలో చెప్పబడింది."తాళకంబెరుగరో తగరంబు నెరుగరో" అనే పద్యం రసవాద రహస్యమే.అలాంటి పద్యాలు ఇంకా ఉన్నాయి.క్షుద్రలోహాలను బంగారంగా మార్చే విధానాన్ని గుప్తంగా వాటిలో వేమన వివరించాడు.కాని వాటిని అర్ధంచేసుకున్నవారు తక్కువ.


రసవాదమూ మొదలైన ఇతర భావాలను అలా ఉంచితే,అసలు మానవజన్మకు ఏమి చేస్తే సార్ధకత వస్తుందో వేమన భావాలలో కొంచం పరిశీలిద్దాం.


పశు పక్ష్యాదులవలె ఆహారనిద్రాభయమైదునాలలో వృధాగా గడపడానికి ఉద్దేశించబడింది కాదు మానవజన్మ.మానవజన్మకు ఒక పరమార్ధం ఉన్నది. వృధాగా పుట్టి గిట్టుటకొరకు వచ్చినది కాదు మానవజన్మ. తిరిగి పుట్టనట్టి చదువును చదువుకోవటమే మనిషిజన్మకు పరమార్ధం. జననమరణచక్రం నుంచి విముక్తి పొందగలిగే మహత్తర అవకాశం మానవజన్మకు దైవంచేత ఇవ్వబడింది. కాని దానిని గ్రహించేవారెందరు? కొండొకచో కొందరు గ్రహించినా ఆ మార్గంలో నడిచేవారెందరు? నడిచినా గమ్యాన్ని చేరేవారెందరు? నిరంతరం ఆహార సముపార్జనకు, సుఖలాలసకు అంకితం అయిన మనిషి పరమార్ధాన్ని పొందేది ఎప్పుడు?

పగలు పొట్టకోరకు బహు ధనార్జనచింత

రాత్రి రమణి తోడ రతులచింత

మోక్షచింత ఇంక మూడాత్ముకెపుడురా

విశ్వదాభిరామ వినురవేమ

మోక్షచింత వైపు మనసు పోకుండా తిండి,సంపాదన,భోగలాలసలనే మాయతో మనిషిని కప్పింది జగన్మాత.ఈ మాయను గెలిచినవాడే పరమపదం వైపు అడుగులు వెయ్యగలడు.లేకుంటే ఆ ఊబిలో మునగక తప్పదు.అసువులు బాయక తప్పదు. నిరంతరం ఈషణాత్రయంలో ఈత కొట్టే వారికి ఒడ్డు దొరికేదేన్నడు? రాగద్వేషాలనే వలలో చిక్కినవానికి విముక్తి ఎట్లా దొరుకుతుంది?తమస్సుతో నిండిన మనస్సుకు మోక్షచింత ఎప్పుడు ఉద్భవిస్తుంది? ఎంతసేపూ తిండి,సుఖం వీటిగురించే ఆలోచించే మూర్ఖునికి మోక్షచింత ఎప్పుడు కలుగుతుంది?.ఆదిత్యయోగీ..


వినవలె దశవిధ నాదము

గనవలె నిర్భేద పదము గాంచిన పైపై

గనవలె సోహంభావము

మనవలె పరిపూర్ణమూని మదిలో వేమా

యోగాభ్యాసపరుడై లోలోన వినిపించే పదిరకాల నాదాలను వినాలి. దానిని మించినట్టి చెక్కుచెదరని గట్టిదైన భూమిని చూడాలి. దానినికూడా దాటి సోహం భావమున ప్రతిష్టితుడై పరిపూర్ణమైన బ్రహ్మపదమును సాధకుడు చేరుకోవాలి. అప్పుడే అతని జన్మకు పరిపూర్ణత.సాధనాపరుడై పరమపదాన్ని అందుకున్నపుడే మనిషి జన్మకు ధన్యత.అది లేకుంటే ఎన్నెన్ని వేషాలు వేసినా అన్నీ చివరకు వృధా అవక తప్పదు.

వ్యాపించి యున్న లోకము

ప్రాపించక గురుని వేడి బహుతంత్రముగా

దీపించి మనసు నిల్పుము

రూపంబగు బట్టబయలు రూఢము వేమా

చిత్ర విచిత్రమైన హంగులతో నిండిన ఈ లోకాన్ని లెక్కించక సద్గురువైనవాడిని  సమీపించి తంత్రోక్తమైన అతని ఉపదేశము పైన మనసు నిల్పితే అంతా తేటతెల్లముగా కనిపిస్తుంది. మనిషికి ప్రధమ కర్తవ్యం ఇదే. కాని మానవులు ఇదిమాత్రం వదిలిపెట్టి తక్కిన అన్నింటినీ చక్కగా ఆచరిస్తున్నారు.అందుకే సంసార సాగరంలో మునిగి మరణిస్తున్నారు గాని దరిచేరేవారు ఒక్కరూ లేరు. మాయామోహాలతో నిండిన ఈ లోకం మనిషిని ఎంతో ఆకర్షించి అతన్ని కాళ్ళూ చేతులూ కట్టి ఒక బానిసలా వాడుకుంటుంది. ఆ బానిసత్వమే ఆనందం అన్న భ్రమలో మనిషి గానుగెద్దులా జీవిస్తూ తన ఆయువు హరించుకు పోవడాన్ని గమనించడు. ఈ భ్రమ నుండి మనిషి బయటపడి సద్గురుప్రోక్తమైన  సాధనామార్గంలో నడక సాగించాలి. అప్పుడే అతనికి సత్యం సాక్షాత్కరిస్తుంది.

లోకము తను 'ఛీ' యనగా

లోకము తా 'ఛీ' యనంగ లోకములోనే

ఏ కర్మల నోనరింపక

లోకములెంచంగ ముక్తిలోకము వేమా

లోకవిధానాలను తాను ఏవగించుకోవాలి. అనగా తనకు లోకవాసనలపైన విరక్తి కలగాలి. లోకమూ తనను అసహ్యించుకోవాలి. అంటే సమాజపు కుళ్ళుపోకడలకు విరుద్ధమైన సత్యమార్గంలో తాను నడవాలి. లోకాన్ని తాను  ఛీకోడితే లోకమూ తనను 'ఛీ' అంటుంది.అంటే లోకరీతికి భిన్నమైన మార్గంలో సాధకుడు నడవాలి.అటువంటి స్తితిలో ఉంటూ,కర్మను క్షయింపచేసుకునే రహస్యయోగమార్గాన్ని అనుసరించి,తద్వారా లభించినట్టి  యోగసిద్ధితో, సమస్త లోకాలను సాక్షిగా తిలకించగలిగితే అదే ముక్తి.

రానిది కోరిన రాదది

రానున్నది కోరకున్న రానేవచ్చున్

తానెంత చింత చేసిన

కానున్నది కాకపోదు గదరా వేమా

తనకు యోగం లేకపోతే ఎంత కోరుకున్నా అది దక్కదు.అలాగే,తనకు రాసిపెట్టి ఉంటే ఎంత వద్దనుకున్నా అది అనుభవించక తప్పదు.కనుక తానెంత చింతించినా కానున్నది కాకమానదు.రానున్నది రాకమానదు. జరుగనున్నది జరుగక మానదు.ఇది అంతిమ సత్యం.దీనిని గ్రహించి ఆచరించగలిగినవాడు ధన్యుడు.అటువంటివాడు ఒక రమణమహర్షిగా రూపు దిద్దుకుంటాడు. జిల్లెళ్ళమూడి అమ్మ కూడా ఇదే భావాన్ని"అనుకున్నది జరగదు.తనకున్నది తప్పదు"అని చెప్పారు.మహనీయులు ఎవ్వరైనా ఇదే సత్యాన్ని ఎన్నో మార్లు చెప్పారు.కాని మూడత్వంతో నిండియున్నవానికి ఇది తలకేక్కుతుందా? ఎక్కదు.అందుకే లోకంలో జ్ఞానులు కొందరే ఉంటారు.మిగిలినవారు మిడుతల దండులే.పుట్టలోని చెదలే.ఆదిత్యయోగీ..

మాయల సంసారముకై

మాయలలో బొరలుచుండు మనుజుడు మరితా

మాయను మదిలో దలచిన

మాయలనే ముక్తి గలుగు మహిలో వేమా

ఈ మాయదారి సంసారమోహంతో నిండిన మానవుడు మాయ అనే బురదగుంటలో పడిన పందిలాగా దొర్లుతున్నాడు. మాయాస్వరూపాన్ని తన మనసులో చింతనచేత చక్కగా అర్ధం చేసుకుంటే, ఆ మాయలో నుంచే ముక్తి అనే మార్గం చక్కగా కనిపిస్తుంది. కాని మాయను ఆనందిస్తున్న మనుజునికి మాయపై మనసు విరిగేదేన్నడు?సాధనామార్గంపైన మనసు నిలిచేది ఎప్పుడు? అసలలా జరిగే అవకాశం ఉన్నదా?

జ్ఞాననిష్ఠ బూని మేను మరచువాడు

కామిగాడు మోక్షగామి గాని

నియమ నిష్ఠలుడిపి నిర్గుణమ్మందురా

విశ్వదాభిరామ వినురవేమ

జ్ఞానకాంక్షి యైనవాడు మొదటిలో నియమ నిష్టలను ఎన్నో ఏళ్ళు పాటించాలి. తర్వాత జ్ఞాననిష్టను బూని నియమనిష్టలకు అతీతుడై సర్వాతీతమైన నిర్గుణపదవిని అందుకోవాలి.ఇదే మనిషి యొక్క ప్రధమకర్తవ్యం.అంతే కాదు.ఇదే మానవ జీవితపు నిజమైన గమ్యం కూడా. దీనిని సాధించినవాడే నిజమైన మానవుడు. అతని జన్మ మాత్రమే సార్ధకమైన జన్మ...

.

 ప్ర : 'విశ్వామిత్ర' అనే మాటను 'విశ్వానికి అమిత్రుడు'(విశ్వ+  అమిత్రుడు) అనే అర్థం వస్తుందేమో ? ఈ నామానికి అసలైన అర్థం  ఏమిటి ?

 జ : ఈ సవర్ణదీర్ఘ సంధి ఇక్కడ వర్తించదు.

 "మిత్రే  చర్షౌ ఇతి విశ్వశబ్దస్య దీర్ఘః. తస్యాం విశ్వం మిత్రమాసీద్యదిదం కించ తస్మాద్విశ్వామిత్ర ఇత్యాచక్షతే” 

అని శాస్త్ర నిర్వచనం. ఎవనికి విశ్వం మిత్రమో(స్నేహభావంతో కూడినది), ఎవరు విశ్వానికి మిత్రుడో అతడు - విశ్వామిత్రుడు.

 విశ్వే దేవాశ్చ మే మిత్రం మిత్రమస్మి గవాం తథా| విశ్వామిత్ర ఇతి ఖ్యాతం యాతుధాన నిబోధమాన్ ll 

-"విశ్వేదేవతలు / సమస్తదేవతలు నాకు మిత్రులు. గోవు (వేదమంత్రములు, ఆవులు, ఇంద్రియములు)లకు నేను మిత్రుడను. అందువలన నన్ను 'విశ్వామిత్రుడు' అంటారు". - అని విశ్వామిత్రుడే స్వయంగా చెప్పిన నిర్వచనం (మహాభారతం)....

.


నీవు కనీసం ద్వితీయ శ్రేణి గురువులు కూడా పొందలేని పక్షంలో ఆత్మసాక్షాత్కారం పొందిన జగద్గురు ఆదిశంకరులు, దత్తాత్రేయ మరియు ఇతర మహాత్ములు రాసిన పుస్తకాలలో చెప్పిన బోధనలను అనుసరించవచ్చు. జీవన్ముక్తుడైన లేదా ఆత్మ సాక్షాత్కారం పొందిన అటువంటి గురువుల యొక్క చిత్తరువు/చిత్రపటం నీ లభ్యమైతే, నీ ముందు ఉంచుకొని దానిని భక్తివిశ్వాసాలతో పూజించు. క్రమంగా నీకు ప్రేరణ కలుగుతుంది, మరియు రైన సమయంలో గురువు స్వప్నంలో కనిపించి, దీక్ష ఇచ్చి,  ప్రేరణ కలజేస్తారు. నిజాయితీగల సాధకులకు సహాయం అనేది చాలా గుహ్యమైన రీతిలో వస్తుంది.


భగవంతుని నుంచి గుహ్యమైన సహాయము 


కొన్ని సందర్భాల్లో భక్తులకు భగవంతుడు ఏ విధంగా సహాయపడ్డాడో చూడు. ఏకనాథుడు ఆకాశవాణి విన్నాడు. అది ఏమన్నదంటే "దేవగిరిలో ఉన్న జనార్ధన పంత్‌ను దర్శించు. ఆయన నిన్ను సరైన మార్గంలో పెట్టి నడిపిస్తాడు". అతను ఆ విధంగా నడుచుకొని తన గురువును పొందాడు. తుకారాం 'రామకృష్ణ హరి' అనే మంత్రాన్ని స్వప్నంలో పొందాడు. ఆయన ఈ మంత్రాన్ని మననం చేసి కృష్ణ దర్శనం పొందాడు. శ్రీకృష్ణుడు నామదేవుడిని తన యొక్క దీక్ష కోసం మల్లికార్జున దగ్గరున్న సన్యాసిని దర్శించమని ఆదేశించాడు. రాణి చూడాలి 'కుంభ ముని' రూపాన్ని పొంది, తన భర్త అయిన సిఖద్వజుని ముందు అడవిలో కనిపించి, కైవల్యం యొక్క రహస్యాలను అతనికి ఉపదేశించింది. మధురకవి మూడు రోజులపాటు ఆకాశంలో కాంతిని చూసాడు. అది అతనికి మార్గదర్శనం చేసి, తిన్నేవెలిలో చింత చెట్టు కింద సమాధిలో కూర్చున్న తన గురువైన నమ్మాళ్వార్ వద్దకు తీసుకెళ్ళింది. బిల్వమంగళుడు నాట్యగత్తె, చితామణిని చూసి బాగా ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత ఆమయే అతనికి గురువయ్యింది. తులసీదాసు అగోచరమైన ఒక జీవి (బ్రహ్మరాక్షసుడు) ద్వారా సూచనలు పొంది హనుమంతుని దర్శనం పొందగలిగాడు. హనుమంతుని ద్వారా, అతనికి రాముని దర్శనం..*

.

కామెంట్‌లు లేవు: