🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
*శ్రీవేదవ్యాస*
*అష్టోత్తరశతనామవాళి*
*🌸1. ఓం శ్రీ వేదవ్యాసాయనమః🌸*
వ్యాసం అంటే విస్తరించటం. *వేదాలను* విభజించి మరియు వ్యాప్తి గావించారు. కనుకనే కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసులుగా పిలవబడుతున్నారు.
రాశులుగా పోసి ఉన్న వేదజ్ఞానాన్ని ఆపోసన పట్టి 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అధర్వవేదము అని నాలుగుగా విభజించి మనకు అందించారు.
మన మహర్షులు సత్యమేదో, ఆ భగవంతుని స్వరూపాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేయగా, పరమాత్మ వారికి శబ్దరూపంలో వినిపించారు. ఆ దివ్య శబ్దాలే *వేదాలు*. అందుకే వేదాలను అపౌరుషేయాలు అని అంటారు. అంటే మానవులచే కూర్చబడినవి కావు అని అర్థం.
ఒక మహర్షి విన్నది ఇంకొకరు వినలేదు. కానీ అన్నీ ఆ భగవంతునికే తెలుసు. ఆయన స్వరూపం తెలియచేయాలి అంటే ఆ భగవంతునికే సాధ్యం. అందుకే భగవంతుడే స్వయంగా వ్యాసులదేవులవారిగా అవతరించారు. మనపై అపారమైన కరుణతో మనలను సన్మార్గంలో నడిపించడం కోసం వేద, ఇతిహాస, పురాణ, వ్రత, పుజాది సర్వసంప్రదాయాలు, ధర్మనిర్ణయాలు అందించిన మన తండ్రికి కృతజ్ఞతలు తెలియచేస్తూ
*ఓం శ్రీ వేదవ్యాసాయ నమః* అని స్మరించుకుందాం🙏
🙏జై గురుదేవ్🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి