తను గోల చేస్తుంది
తను సొద పెడుతుంది
తను రొద జేస్తుంది
తనువులో కల్వమని
ఎర వేసి వల విసిరింది
తనను తలంచు కోమంది
మాయ చేసి మురిపించి
మాలలు కట్టి
'పదము'లతో
శృంగార కేళి.
తనువంతా తడిపివేసి
ముగ్ధముగా తన్మయం
ఆనంద లాహిరి.
తన దరి చేరమంది.
నా మదిలో గోల పెట్టి
'ఛందస్సు'తో మనస్సున
మధనం చేయమంది.
తన దరి చేరగానే
ఆకలిదప్పులు ఏమాయేను.
నాలో కవనం మొదలయ్యేను.
మల్లెలతో 'చంపక మాల'కట్టి
మనోసౌందర్యముగా ముద్దు లాడమంది.
ఉత్తేజంతో 'ఉత్పల మాల' తీసివేయంగా
'శార్ధు లం'బుగా మాట గ్రుచ్చెను
'మత్తేభం'నైన నా మనస్సుకు.
కమ్మని కల కూర్పులు
పులకరింతలు పలకరింతలు
ఆపై పాదముల కలయికలు.
తన అందాన్ని చూరగొని
'సంధి' చేయమంటూ
'సమాసాలు' లెఖ్ఖలతో
'వ్యాకరణ విశేషం' లతో
'పద్యము'ను వారసత్వంగా
అందజేయమంది నా "కవిత".
కవితా దినోత్సవ శుభాకాంక్షలు.
అశోక్ చక్రవర్తి.నీలకంఠం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి