22, జులై 2024, సోమవారం

*ఆ పూలజడ అద్వీతీయము కాక ఏమిటి ?

 *ఆ పూలజడ అద్వీతీయము కాక ఏమిటి ?*


🌹🙏🌹🙏🌹


*సుమముల !  సకలసురలు  దిగి*

*యమరిరి ఘనకేశపాశ మందె త్వరితముగా !*

*సమయము మీరిగ నీయక* 

*జమళి సిరియుభువియాయె జడగంటలుగా !!*


🌹🙏🌹🙏🌹


✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది* 



🌺☘️🌺☘️🌺


అమ్మ రథము అలా ముందుకు సాగుతూ వెళుతుంటే   పరవశాన అలాగే ఉండిపోయాను .🙏


అయ్యో ముందుకు నేను కూడా ఎందుకు వెళ్లలేదు అని బాధపడుతున్న తరుణములో , 


అమ్మ అందమైన పూలజడ దర్శన భాగ్యము కల్పించి నది .🙏


ఇందుకేనేమో అమ్మ ముందుగా వెళ్లిపోయింది .


ఆ పూలజడను ఏమని వర్ణించగలము ! 🙏


ఆ జడకు ఉన్నవి పువ్వులా ?  కానే కాదు సకలదేవతలు , త్వరత్వరపడి , దివినుంచీ క్రిందకు దిగివచ్చి అమరిపోయారు , పువ్వులుగా ఆ పూలజడలో . 🙏


సమయము మించిపోతే తమకు అదృష్టము దక్కునో లేదో అని , భూదేవీ శ్రీదేవి కాస్త తమ సింగారములను ఆపి ఉదుటన , వచ్చి ఆ జడను మిక్కిలి ప్రకాశవంతము చేసారు జడగంటలుగా ఒదిగి ! 🙏


అట్టి దివ్యాలంకారముతో ప్రకాశించే మా *కామాక్షీ అమ్మకు* సదా మంగళములు పాడెదను !🙏

కామెంట్‌లు లేవు: