22, జులై 2024, సోమవారం

దత్తపది

 దత్తపది 


ఇక్కడ 

అక్కడ 

ఎక్కడ 

తక్కెడ


అనె పదాలతొ కూరగాయల మార్కెటును ఇచ్హాచంధస్సులొ వర్ణించగలరు.


దత్తపది పూరణ -- నా ప్రయత్నము 


*ఇక్కడకే రండయ్యా*

*యక్కడ నాసిరకము, వెలయది యెక్కువయే!*

*యెక్కడకుఁ బోవలదయా,*

*తక్కెడ కెక్కువనె తూచి ధరపెంచనయా !*


🙏 *--వేంఉగోపాల్ యెల్లేపెద్ది*





కందము తెలిసిన కాయగూరల వ్యాపారి అందముగా ఆకర్షిస్తున్నాడు తన అంగడికే రమ్మంటూ అందరినీ 🤣


తక్కెట్లో కాసిని కూరలు అధికంగానే ఇస్తాను కానీ , ధరను పెంచి మాత్రము అమ్మను అని ..


(ఇక్కడ) దొండకాయ లవి యింపుగ నున్నవి లేతలేతగా

(నక్కడ) దోస లద్భుతపు టానపకాయలు గానుపించె నిం

(కెక్కడ) నోయి వంగ విను మీయవి నీవిక నాలసింపకే

(తక్కెడ) దూచి యిమ్మనుచు తా నొక డాడెడు నాపణంబునన్.


ఎక్కడ జూచినన్ కననదేమి విచిత్రమొ కూరలంగడిన్

అక్కడ గొట్టుకాయల నయమ్ముగనమ్మగజూతురయ్యవే

తక్కెడనున్నకూరలనిదానముగాకొనజూచుచున్న నే

నిక్కడ నిల్చి యుంటి నికనేమగునోగమనింపగావలెన్


కం॥

ఎక్కడదొరకనికూరలు  

ఇక్కడనే దొరకుమీకుహితమునుగూర్చున్ 

అక్కడనిలబడనేలా?తక్కెడమోసంబులేదు,ధరలునుచౌకే! 

 గుడ్లూరివేంకటెశ్వరరావు,కందుకూరు.


ఎక్కడపంటపండినవొ?యిక్కడకన్పడెదోస,యల్లముల్ 

ఇక్కడజూడు"వంగ"మదికింపునుగూర్చెడి"బెండ" "చిక్కుడుల్ 

అక్కడజూడగుమ్మడియునద్భుతతింత్రిణిపల్లవంబులన్ 

తక్కెడజూచి యిత్తుమయధర్మముతప్పమురండి!విల్వుడీ! 

           గుడ్లూరివేంకటేశ్వరరావు,కందుకూరు.


ఇక్కడ దొరికెడి కంద మ 

రెక్కడ మనకు దొరకదని యిల్లాలనగా 

అక్కడ నే గల పెనిమిటి 

తక్కెడ సరిరీతి తూచి తానది తెచ్చెన్ 


శనగల చంద్రశేఖర్




కామెంట్‌లు లేవు: