*యే వేళనైనా పున్నమే యీ కాంచీపురాన !*🙏
🌹☘️🌹☘️🌹
*ఆకాశంబున పున్నమి*
*సాకారమగు నెలకొక్క సారె కనులకున్!*
*మాకిట సతతము పున్నమె ,*
*శ్రీకామాక్షమ్మ సెలవి నిడు నగవులతో !*
🌹🙏🌹🙏🌹
✍️ *--వేణుగోపాల్ యెల్లేపెద్ది*
🌹🙏🌹🙏🌹
పున్నమి రేయిన మా అమ్మ *శ్రీ కామాక్షమ్మ ,* దయతలచి దర్శన భాగ్యమును అనుగ్రహించినది .🙏
ఆ నింగిలోని పున్నమి వెన్నలలో మరీ అంత గొప్పతనమేమున్నది ?
అది నెలకొకసారే కనిపిస్తుంది మన కనులకు .
కానీ మాకు ఈ భూమిపైననే గొప్ప అదృష్టమును అనుగ్రహించినది చల్లని తల్లియైన *శ్రీ కాంచీపుర కామాక్షమ్మ !*🙏
అఖిలాండమంతా నిండి పోయే పండువెన్నెలను ,
తన పెదవి అంచున చిరుదరహాసములతో ,
నిరంతరమూ , మనకు అందిస్తూనే ఉన్నది నిండైన పండు వెన్నెల ! 🙏
*ఇది కదా మాయలేని వెన్నెల ! అసలైన వెన్నెల !!*🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి