🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 51*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా*
*సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ |*
*హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ*
*సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిస్సకరుణా ‖*
మనకు శాస్త్రములో నవ రసాలు అంటే తొమ్మిది అనుభూతులు చెప్పారు.
ఇవి
శృంగారము,హాస్యము, భీభత్సము,భయానకము, వీరము,రౌద్రము,కరుణ, అద్భుతము,శాంతము. ఎవరైనా ఈ అనుభూతుల భావ ప్రకటన చేసేది నేత్రముల ద్వారా. ఈ శ్లోకంలో ఈ అనుభూతులను అమ్మవారి పరంగా చెప్తున్నారు.
శివే శృంగారార్ద్రా = శివుని చూసినప్పుడు శృంగార భావనతో ఆమె ఆర్ద్రమౌతుందట.
తదితర జనే కుత్సనపరా = శివుని కాకుండా ఇంకెవరిని చూసినా జుగుప్స కలుగుతుందట (శృంగారపరంగా)
సరోషా గంగాయాం = శివుని జటాజూటంలో తిష్ఠ వేసుకొని వున్న గంగను చూస్తే రోషం (రౌద్రం), సవతి భావనతో. నిజానికి ఇద్దరూ ఒకటే. ఈ భావ ప్రకటన కేవలం లీలా విశేషం.
గిరిశచరితే విస్మయవతీ = శివుని చరితము, ఆయన లీలలు.
హాలాహల భక్షణ, మన్మధ దహనం, గజాసుర వధ, త్రిపురాసుర సంహారం, గంగావతరణం మొ...
ఎవరైనా చెప్తుంటే విస్మయం (అద్భుత రసం)
హరాహిభ్యో భీతా = శివుని శరీరంపై తిరుగాడే పాములను చూసి భయం! అందరికీ అభయమిచ్చే తల్లికి భయమేమిటి? ఆవిడ అభయాంబిక. ఇది కూడా లీలా విలాసమే.
సరసిరుహ సౌభాగ్యజయినీ = ఆమె నేత్రములు పద్మముల సౌందర్యమును, సౌభాగ్యమును జయించినప్పటి వీర రసము. మహిషాసుర వధ, భండాసుర వధ, మొదలైనవన్నీ అమ్మవారి వీర రసమునకు ఉదాహరణలు.
సఖీషు స్మేరా తే = చెలికత్తెలతో మాట్లాడేటప్పుడు హాస్య రసము
మయి జనని దృష్టిస్సకరుణా = భక్తులపట్ల ఆమెకు కల కరుణ
ఇప్పటికి ఎనిమిది చెప్పారు నవ రసములలో. మరి శాంత రసము? శాంతము ఈ ఎనిమిదింటికీ అతీతమైనది. అది లోకాతీతమైన అనుభూతి. అన్ని భావనలు అణగిపోయినప్పుడు కలిగేది శాంతము. ఆ అనుభూతి మాటలలో చెప్పలేనిది. దక్షిణామూర్తి స్తోత్రములో *మౌనవ్యాఖ్య* వలె. శాంతము అనేది రసమా? (రసమంటే అనుభూతి) భావమా? ఒక స్థితియా? అది వ్యక్తపరచలేనిది. అందుకే, భావప్రకటనకు అనుకూలమైన నాట్యశాస్త్రములో కూడా భరత ముని ఈ ఎనిమిది రసములు గురించే చెప్పారు.
ఇక యోగపరంగా చూస్తే, శ్రీచక్రములో ఎనిమిది ఆవరణలు దాటి బిందువును చేరినప్పుడు శాంతము,శాంతి. బిందువు శాంతమునకు స్థానము. అది సచ్చిదానంద స్వరూపము. అమ్మవారు ఇన్ని రసాలను తన నేత్రముల ద్వారా ప్రకటిస్తున్నా, ఆమె స్వభావము, తత్త్వము శాంతము. అమ్మ కరుణతో చూస్తే కానీ మనకు ఆ శాంతి లభించదు. లలితా సహస్ర నామాల్లో చెప్పినట్లు *ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః* అమ్మ కనురెప్ప తెరిస్తే ప్రపంచము, కనురెప్ప మూస్తే లయము. సృష్టి, స్థితి, లయాలు ఆమె కన్నుల కదలికలోనే వున్నాయి. ఆమె కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి.
ఓం శాంతిః శాంతిః శాంతిః 🙏🏻
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి