రామాయణమ్ 352
...
మా భరతుడు నాకు జ్ఞాతి , రాజ్యము అతను కోరకుండగనె తల్లి అతనికి సంపాదించి పెట్టినది ,రాజ్యార్హత అతనిదే ! ,
.
మా తండ్రిగారు అందుకు సమ్మతించినారు కూడా .అనాయాసముగా తల్లి అడిగిన వరము ద్వారా సంక్రమించిన రాజ్యలక్ష్మిని అన్న నైన నాకొసము తృణ ప్రాయముగా వదులుకొనుటకు సిధ్ధపడినాడు.
.
మా భరతుని మంచితనము చూడుము .నన్ను అనుసరించి నన్ను వెదుకుతూ అడవికి వచ్చి అన్నా !రాజ్యము నీదే నాది కాదు అందుకు అర్హుడవు నీవె అని ప్రాధేయ పడినాడు.
ఇట్టి సొదరుడు ఎచట వుండును ?
.
ఇక లొకములొని కొడుకులలొ నా అంత భాగ్యశాలి అయిన వాడు ఎవడూ ఉండడు .తండ్రి ప్రెమను సంపూర్ణముగా చూరగొన్నవాడె అదృష్టవంతుడు .నా తండ్రికి నా మీద గల ప్రేమ ఇంత అంత అని చెప్ప తరమా ?
.
నన్ను వదలిన వెంటనె స్వర్గస్తుడైనాడు ,అందుచెత పుత్రులలొ నెను గొప్పవాడను .
.
ఇక మిత్రులలొ నీ వంటి వాడు ఎవ్వడూ కానరాడు ,పరుషముగా దూషించిన మిత్రుని భరించి ,ఆతని కార్యమునకు తన సకల శక్తులూ వినియోగించువాడు గొప్పవాడు కాదా ?
.
నాలుగు నెలలు వర్షాకాలము కిష్కింధలొ ఉండమని నేనె చెప్పితిని .
.
వర్షము వెనుకబడగానె నీవు నాకు ఏమీ చెయ్యలేదని నిన్ను దూషించినా భరించి నన్ను అనునయించి నా కార్య సాఫల్యమునకు సర్వ శక్తులూ ధారవోయు నీ వంటి మిత్రుడెచట లభించునోయి !
కావున మిత్రులలొ నీవు శ్రేష్ఠుడవు .
.
అనుచూ శ్రీరామచంద్రుడు కొనసాగించెను.
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి