🎻🌹🙏తిరుమలేశునికి పవళింపు సేవ....
(Tirumala Pavalimpu Seva)
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸తిరుమలలో శ్రీ వేంకటేశ్వరునికి జరిగే సేవల్లో చివరి సేవ పవళింపు సేవ. ప్రతిరోజూ అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో ఆలయాన్ని మూసే ముందు స్వామివారికి పవళింపు సేవ నిర్వహిస్తారు.
🌿ఈ పవళింపు సేవనే ఏకాంత సేవ అంటారు. రాత్రి రెండు గంటల వేళ తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని మూస్తారు.
🌸ముఖ మంటపంలో వెండి గొలుసు లతోఏర్పాటుచేసినబంగారుఊయలలో భోగ శ్రీనివాస మూర్తిని శయనిం పచేసి పాలు, పళ్ళు, బాదంపప్పు లను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
🌿మూలవిరాట్టు పాదపద్మాలకు ఉన్న కవచాన్ని తొలగించి, చందనం రాస్తారు.
🌸తిరుమలలో ప్రతిరోజూ రాత్రివేళల్లో బ్రహ్మదేవుడు వచ్చి వేంకటేశ్వరుని అర్చిస్తాడని పూరాణ కథనాలు ఉన్నాయి. అందుకే, వేంకటేశ్వర స్వామి వారిని దర్శించేందుకు విచ్చేసే బ్రహ్మదేవుని
🌿కోసం వెండి పాత్రల్లో నీటిని సిద్ధంగా ఉంచుతారు. పవళింపు సేవలో తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలతో వేంకటేశ్వరుని నిద్రపుచ్చుతారు.
🌸సంవత్సరంలో పదకొండు నెలల పాటు ఏకాంతసేవ భోగశ్రీనివాసునికి జరుపుతారు. ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణునికి చేస్తారు.
🌿రాత్రి రెండు గంటల వేళ స్వామివారికి పవళింపు సేవ ముగిసిన తర్వాత ముందుగా మూడో ద్వారాన్ని మూస్తారు. ఆ తర్వాత బంగారు వాకిలి మూసి లోపలి గడియలు వేస్తారు.
🌸ఆలయ అధికారులు బయటి వైపు తాళాలు వేసి వాటిమీద సీలు వేస్తారు. తిరుమల ఆలయం మూసి ఉంచే సమయం చాలా తక్కువ. మరి కొద్దిసేపటికే ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి.
🌿అయినప్పటికీ తాళం వేయడం, దానికి సీలు కూడా వేయడం అనే సంప్రదాయం సనాతన ఆచారంగా ఇప్పటికీ కొనసాగుతోంది..🚩🌞🙏🌹🎻
🌹🙏ఓం నమో వెంకటేశాయ🙏🌹
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి