☺️ ఆలోచనాలోచనాలు 😊 ప్రభో! అది ఎలాగో ప్రదర్శించు! ఇవాళ నేను ఏదైనా మేలుచేయగలిగితే, జీవితంలో ఎవరికైనా సేవ.చెయ్యగలిగితే, ఒరులకు ఉపయోగపడేలాగా ఒక మంచిమాట చెప్పగలిగితే, ప్రభో! అది ఎలాగో ప్రదర్శించు! నేను లోపాలను సరిదిద్దగలిగితే, ఎవరైనా బలపడటానికి నేను తోడ్పడగలిగితే, చిరునవ్వు తో ,లేదా ఒక మధురమైన పాటతో మరొకరిని ఉత్సాహపరచగలిగితే, ప్రభో! అది ఎలాగో ప్రదర్శించు! కష్టాలలో ఉన్న వ్యక్తిని ఆదుకోగలిగితే, ఎవరి భారాన్నైనా కొద్దిగానైనా తగ్గించగలిగితే, ఎవరి కన్నీటిని తుడిచి అతడికి లేదా ఆమెకు ధైర్యం చెప్పగలిగితే, ప్రభో! అది ఎలాగో ప్రదర్శించు! ----- గ్రెన్ విల్ క్లెయ్ సెర్. ----౦ తృప్తికరమైన జీవనం ౦---- ఆనందదాయకంగా పనిచేయడానికి తగిన ఆరోగ్యం. అవసరాలకు మద్దతు నిచ్చేలాగ సంపద. కష్టాలనుండి కడతేరడానికి పోరాడటానికి తగిన శక్తి దేవుడి విషయాలను యదార్థీకరించడానికి తగిన విశ్వాసం. భవిష్యత్తును గురించి భయాందోళనలను తొలగించేలా తగినంత ఆశ. ఇతర ప్రాణులను ఆత్మీయంగా చూడగలిగే ప్రేమ. దీనుల బాధలపట్ల కరగిపోయేంతగా కారుణ్యం. ఇవే నా తృప్తికరమైన జీవితానికి కనీస అవసరాలు. ---- గోథే. - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - Sharpen your mind! 1* Who spends the day at the window, goes to the table for meals and hides at night? 2* The answer I give is yes, but what I mean is no. What was the question? 3* First you eat me, then you get eaten. What amI? (For proper answers you have to wait 24 hrs only.). - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -. తెలుగు నుడికారం ( సామెతలు మరియు జాతీయాలు) 1* కంచెలేని చేను, తల్లి లేని బిడ్డా ఒకటే! 2* కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువే! 3* కాలు జారితే తీసుకోవచ్చు; నోరు జారితే తీసుకోలేం. 4* గోటితోపోయే పనికి గొడ్డలి ఎందుకు? 5* గుడ్డి కంటే మెల్ల మేలు. 6* కుక్క కాటుకు చెప్పుదెబ్బ. 7* ఏరు ఎన్ని వంకలు తిరిగినా చివరకు చేరేది సముద్రంలోనే; 8* ఏఱు దాటి తెప్ప తగలేసినట్లు. 9* గాలివానలో ఏనుగులే కొట్టుకపోయినయ్ అంటే మరి దోమలో అన్నాట్ట, ఒక బుద్ధిలేని పెద్దమనిషి. 10* తాటిచెట్టు ఎక్కించి నిచ్చెన లాగేసినట్లు. తేది 19--10--2023, గురువారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి