🕉 *మన గుడి : నెం 402*
⚜ *కర్నాటక : నంజనగూడు - మైసూరు*
⚜ *శ్రీ కంఠేశ్వర ఆలయం*
💠 కన్నడలో నంజు అంటే "విషం". నంజుండేశ్వర అనే పేరుకు"విషం తాగిన దేవుడు" అని అర్థం.
💠 కర్ణాటక రాష్ట్రంలో ఇది అతి పెద్ద దేవాలయం.ఈ దేవస్థానం ఈ పట్టణంలో ముఖ్యదేవాలయం. ఇక్కడి శివలింగాన్ని గౌతమ మహర్షి ప్రతిష్ఠించాడని అంటారు.
💠 ఈ దేవుడిని నంజుండేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ నంజుండేశ్వరుని పేరునుండే నంజనగూడు ఏర్పడింది.
నంజున్‌గూడును శివపురాణంలో శ్రీ గారాలపురిగా పేర్కొనబడింది .
💠 సాగరమథనంలో అమృతానికన్నా ముందుగా హాలాహలం ఉద్భవిస్తుంది.
ఆ కాలకూట విషం లోకమంతా విస్తరించకుండా ఈశ్వరుడు దానిని మ్రింగివేస్తాడు.
అయితే పార్వతీదేవి కోరికపై శివుడు ఆ హాలాహలాన్ని తన గొంతులోనే నిలుపుకుంటాడు. ఆ విషం శివుని కంఠంలోనే నిలిచిపోయి ఆ కంఠం నీలంగా మారిపోతుంది.
💠 అప్పటి నుండి ఈశ్వరుడు నీలకంఠుడుగ పిలువబడుతున్నాడు.
కన్నడ భాషలో నంజనగూడు అంటే నంజుడి యొక్క నివాసస్థానం అని అర్థం.
నంజుండ అంటే విషము మ్రింగినవాడు అని అర్ధం.
🔆 *త్రివేణీ సంగమం:*
💠 నంజనగూడు సమీపంలో కపిలానది, కౌండిన్యనది, చూర్ణవతి నదుల త్రివేణీ సంగమం ఉంది.
దీనికి పరశురామ క్షేత్రం అని పేరు. పరశురాముడు తన తల్లిని సంహరించిన తరువాత ఈ ప్రాంతానికి వచ్చి నదీస్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని అంటారు.
💠 ఈ స్థల పురాణం ప్రకారం ఆ సమయంలో అక్కడ ఆదికేశవుని దేవాలయం (ప్రస్తుతం ప్రధాన దేవాలయం ప్రక్కన ఉంది) మాత్రమే ఉండేది.
పరశురాముడు తన ఆయుధం గొడ్డలిని నదీ జలంలో శుభ్రం చేసుకొనే సందర్భంలో అతని గొడ్డలి నదిలోపలి శివలింగానికి తాకి శివుడి తల నుండి నెత్తురు ప్రవహిస్తుంది
అది చూసి పరశురాముడు భీతి చెంది శివుడిని క్షమించమని వేడుకుంటాడు.
💠 శివుడు ప్రత్యక్షమై పరశురాముడిని ఆశీర్వదించాడు మరియు శివలింగంపై తడి మట్టిని పూయమని చెప్పాడు (శ్రీ నంజన్‌గూడ్ మట్టికి అపారమైన వైద్యం చేసే శక్తి ఉంది). శివలింగానికి రక్తస్రావం ఆగింది.
💠 శివుడు పరశురాముడిని మంటపాన్ని నిర్మించి తపస్సు కొనసాగించమని సలహా ఇచ్చాడు ఇచ్చటి మృత్తిక ఔషధంతో సమానమంటారు. అనేక చర్మరోగాలకు
ఈ మృత్తికను ఉపయోగిస్తారు.
💠 శివుడు సంతోషించి తన దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు పరశురామ దేవాలయాన్ని సందర్శించాలని వరాన్ని ప్రసాదిస్తాడు. నంజనగూడు దేవస్థానాలకే కాక అక్కడ పండే ప్రత్యేక రకం అరటి పళ్లకు ప్రసిద్ధి.
ఈ రకం అరటి పళ్లను స్థానికులు నంజనగూడు రసబాళె అని పిలుస్తారు.
💠 ఒకసారి పార్వతీ దేవి ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించాలని కోరుకుంది, అందువలన అతను ఆమెను (గారాలపురి) నంజన్‌గూడ్‌కు తీసుకువచ్చాడు. ఆమె కబినీ నదికి వెళ్లి నీటిని తాకడానికి వంగి ఉన్నప్పుడు, ఆమె కిరీటం నుండి ఒక రత్నపు పూస ( మణి ) నీటిలో పడిపోయింది.
💠 శివుడు సంతోషించి, "దేవీ, ఇప్పటి వరకు, ఈ ప్రదేశం నా దివ్య ఆశీర్వాదం మరియు ఉనికిని కలిగి ఉంది; ఈ క్షణం నుండి, ఇది మీ ఉనికిని, దయ మరియు ఆశీర్వాదాలను కలిగి ఉంటుంది. దీనిని దక్షిణ మణికర్ణికా ఘాట్ అని కూడా పిలుస్తారు" అని ప్రకటించాడు.
💠 ప్రాకారం చుట్టూ శైవభక్తులు 63 నాయన్మారుల విగ్రహాలు ఉంటాయి.
💠 నంజన్ గూడి కి దగ్గరగా పరశురామ దేవాలయాన్ని దర్శిస్తేగానీ తీర్థయాత్ర పూర్తికాదు. ఈ పరశురామ దేవాలయం కౌండిన్య నది గట్టుపైన ఉంది.
💠 హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ లకు ఈ దేవస్థానంతో సన్నిహిత సంబంధాలున్నాయి. తన పట్టపుటేనుగు కంటిచూపును కోల్పోతే టిప్పు సుల్తాన్ ఇక్కడి నంజుండేశ్వరుని ప్రార్థించాడని, దానితో పట్టపుటేనుగుకు చూపు మరలా వచ్చిందని అప్పటి నుండి టిప్పు సుల్తాన్ ఈ దేవుడిని హకీమ్ నంజుండేశ్వర అని కొలిచేవాడని ఒక కథనం.
💠 రాఘవేంద్రస్వామి మఠం కూడా ఇక్కడే ఉంది. ఇది 15వ శతాబ్దం చివరిభాగంలో నిర్మింపబడిందని
అంటారు.
💠 ఈ ఆలయంలో నెలకొని ఉన్న శివుడు ముఖ్యంగా దృష్టి ప్రదాత, నేత్ర సంబంధమయిన వ్యాధులు కలవారు ఇక్కడికి వచ్చి స్వామినిపూజించి ఫలితం పొందారని జనవాక్యం.
💠 ఈ దేవాలయ ప్రహరీ గోడలపై వివిధ గణపతి రూపాలు ప్రతిష్టించబడ్డాయి.
ఈ క్షేత్రం గురించి మరొక ఆనంద కరమయిన విషయం ఏమిటంటే తురుష్కురుడైన హైదరాలీ బహుకరించిన పచ్చల నెక్లెస్ను స్వామి ధరించటం.
ఇక్కడి శివుని మహిమకు ముగ్ధుడై హైదరాలీ స్వామికి ఈ నజరానా యిచ్చాడట.
శ్రీ శ్రీకంఠేశ్వరుడిని ప్రతిరోజూ శైవాగమం ప్రకారం అభిషేకం మరియు పూజల ద్వారా పూజిస్తారు. సోమవారాలు, అమావాస్య రోజులు మరియు పౌర్ణమి రోజులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మిథున మాసంలో (జూలై) జరిగే గిరిజా కళ్యాణం గొప్ప వేడుక
💠 నంజనగూడు రథోత్సవంకి చాలా పేరు పొందింది. మూడురోజుల పాటు జరిగే బ్రహ్మాండమైన ఈ రథోత్సవానికి వేలకొలది భక్తులు దక్షిణదేశం అనేక మూలలనుండి వస్తారు.
పెద్దజాతర సందర్భంలో రథోత్సవం ఘనంగా జరుగుతుంది. శ్రీకంఠేశ్వరుడిని, పార్వతీదేవిని, గణపతిని, సుబ్రహ్మణ్యస్వామిని, చండికేశ్వరుడిని ఐదు ప్రత్యేక రథాలలో ఉంచి వేలాది భక్తులు ఈ రథాలను పురవీధులలో లాగి ఊరేగిస్తారు.
💠 ఇది మైసూరు నుండి 23 కి.మీ.ల దూరం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి