7, ఆగస్టు 2024, బుధవారం

విధివశాత్తు ప్రాప్తించిన దానితోనే

 *విధివశాత్తు ప్రాప్తించిన దానితోనే సంతృప్తి చెందండి*


కోరికలు బాధల ఫలమని గ్రహిస్తే విచక్షణ ఒక్కటే మార్గం.   అందుచేత, నిరుపేదలు కూడా  వస్తువులను, భోగాలను కోరుకోకూడదు.  వారు తనకు లభించిన దానితో,లేదా ఉన్నదానితో సంతృప్తి చెందాలి అంటారు భగవత్పాదులు.  

 *విధివశాత్ ప్రాప్తేన సంతుష్ట్యo*  

(విదివశాత్తు నుండి పొందిన

 దానితో సంతృప్తి చెందండి) 

 అని ఆయన చెప్పారు.  విధి కనుక ఉంటే, ఏది కావాలంటే అది మనకు లభిస్తుంది.   విధి యొక్క శక్తి అలాంటిది. మనం నిర్జన ప్రదేశంలో ఉన్నా కూడా అదే జరుగుతుంది. 

 *ద్వీపాదన్యస్మాధాభి మధ్యాదభి జలనిధర్తిసోప్యన్త I* 

 *అనేయా జడితి కడయతి విదిరభిమదమపిముమకీభూత:   II* 

 "కోరుకున్న రెండు కోరికలు ఒకేసారి నెర వేరాలని అనుకుంటే, అవి వేర్వేరు ద్వీపాల నుండి, సముద్రం యొక్క కడుపులో లేదా చాలా దూరంలో ఉన్నప్పటికీ, విధి వాటిని ఒకచోట చేర్చుతుంది." 

కాబట్టి మనం కోరికలకు ఆస్కారం ఇవ్వకుండా భగవత్ స్తోత్రాల పవిత్ర బోధనలను అనుసరించి జీవిత లక్ష్యాన్ని సాధించాలి. అప్పుడే విధి ని అధిగమించి భగవంతుని కృప కలుగుతుంది.అదే గొప్ప తృప్తిని, సంతృప్తిని ఇస్తుంది.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ  భారతీతీర్ధ మహాస్వామి వారు*

కామెంట్‌లు లేవు: