7, ఆగస్టు 2024, బుధవారం

వింత లక్షణములు

  ,  

*వాట్సప్ సమూహ వినియోగదారుల వింత లక్షణములు*


1 *. #కుప్పరులు* 

వీరు రోజస్తమానం కుప్పలు తెప్పలుగా సమాచారమును సమూహములో గ్రుమ్మరించుచుందురు. 


2 *. #ఆకస్మికులు* 

వీరు అప్పుడప్పుడు తమ ఉనికిని తెల్పుటకు అసందర్భపు సమాచారమును సమూహములో ప్రచురించెదరు. 


 *3. #విధ్యుక్తులు* 

వీరు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లేదా రాత్రి వేళలో శుభోదయం, శుభరాత్రి లాంటి సమాచారములు మరియు లేదా పుట్టిన రోజు శుభాకాంక్షలు, వివాహ శుభాకాంక్షలు లాంటివి మాత్రమే సమూహములో ప్రచురించెదరు.


4 *. #గవాక్షులు.* 

వీరు సమూహములో ఏమి జరుగుతున్నదో చూచెదరుకాని ఎటువంటి సమాచారమునూ ప్రచురించరు. బహుశా వీరికి సాంకేతిక పరిజ్ఞానం కాని భాషా పరిజ్ఞానం కాని లోపించి ఉండవచ్చు. 


*5. #అవ్యవస్థితులు* . 

వీరు అనేక సమూహములలో సభ్యత్వం కలిగి ఉండుటచే ఏ సమాచారమును ఎక్కడ ముద్రించవలయునో అనే అయోమయావస్థితిలో ఉండి తను ప్రస్తుతం ఉన్న సమూహములోని సమాచారమును అదే సమూహములో ప్రచురించెదరు. 


 *6. #అనుక్రియాయులు.* 

వీరు సమూహములో ప్రచురించబడిన ప్రతి సమాచారమునకు, కార్యాలయంలో అధికారి ఎవరి ఉత్తరము వారికి తన వాఖ్యనము వ్రాసి ఏవిథంగా పంచునో ఆ విధంగా తన వాఖ్యనము తో విధిగా ప్రతిస్పందిస్తారు.


 7 *. #తంత్రజ్ఞులు.* 

వీరు తమ సమాచారములతో అందరూ ఏకభవించాలని ఆశిస్తారు. 


8 *. #పృథక్కులు.* 

సమూహములో వీరి ఉనికి మిగతా సభ్యులెవరికి తెలియదు. తామరాకు మీది నీటి బొట్టులాగా.


*9. #అసంబద్ధులు.* 

వీరు ప్రచురించే సమాచారమునకు సమయము సందర్భము ఉండదు. సాయంకాలమునకు  శుభోదయ మన్నన ఉదయమున శుభ రాత్రి మన్నన లాంటివి ప్రచురించెదరు. 


*10. #మేషియలు* 

వీరు తమ మేథస్సుననుసరించరు. తమకంటే ముందున్న సమాచారమును సరించి,  తథనుగుణంగా సమాచారమును తప్పు ఒప్పు విచారణ విస్మరించి ప్రచురించెదరు.


*11. #తస్కరులు.* 

వీరు ఇంతకు ముందే ప్రచురితమైన సమాచారమును కాపీ చేసి పేస్ట్ చేయుదురు. 


*12. #రవాణాగ్రేసరులు* 

వీరు వివిధ మార్గములలో తమకు సంక్రమించిన సమాచారమును కేవలం రవాణా చేయుదురు. అది ఎటువంటి సమాచారము, ఇతరులకు అది ఉపయోగకరమా అనేది కూడ పట్టించుకోరు.


*13. #దైవఙ్ఞులు* 

వీరు సోమవారం శివుడు, మంగళవారం హనుమాన్, బుధవారం వినాయకుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వేంకటేశ్వర స్వామి, 

ఆదివారం సకల దేవతలను మనకు దర్శింపచేస్తారు. 


*14 #వ్యాపార_దిగ్గజాలు* 

అర్థం పర్థం లేకుండా తమ సరుకుల, సేవల గురించి ప్రింటెడ్ ప్రకటనలు పెట్టేస్తుంటారు. మనం ఫలానా మితృడికీ యాక్సిడెంట్ అయిందని పెడితే, వీళ్ళు టక్కున 'అందమైన జుట్టుకు మా నూనెనే వాడండి' అని మోకాళ్ళ వరకు జుట్టున్న ఒక గిరికన్య ఫోటో పెడతారు. ఇట్లాంటివి ఎన్నో! 


 *15# సంజ్ఞా స్పందకులు* 

వీరు ఎటువంటి భావాలనైనా కేవలం సంజ్ఞల (emoji) ద్వారా మాత్రమే స్పందిస్తారు. ఎటువంటి పదాలు ముద్రించరు 😜


*ఇది ఎవరిని దృష్టి లో ఉంచుకొని వ్రాసినది కాదు. 

ఒకవేళ మీకలా అనిపిస్తే అది కేవలం కాకతాళీయం మాత్రమే. హాయిగా నవ్వుకోండి.

 *ఆనందో బ్రహ్మ** 

😂😂😂😂😂

కామెంట్‌లు లేవు: