26, మార్చి 2023, ఆదివారం

ఉగాది

:

 ఉగాది

         కవిత శీర్షిక

రచన రవికుమార్ దేవర శెట్టి

సందర్భం శోభకృత్ వత్సరం

తేదీ 24/03/2023


నాలో నేను

నా వైపు అడుగులు

ప్రభాత సూర్యుడు

ఆకాశమంత మోదుగు పువ్వుల క్రాంతి..

కాంతిలో ఉగాది కొత్త సృష్టి ఆరంభమైతే..

నీలో నిన్ను దాచే

చీకటి ముసుగులోనే ఉన్నావా..

రంగులు మార్చే.. ఊసరవెల్లిలా నిన్ను నువ్వు చుట్టుకుంటూ ఉన్నావా..

 

ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం కదా..

ప్రేమ ,స్నేహం ,త్యాగం ,శ్రమ, నిజాయితీ ,శాంతిపోరాటం స్ఫురించటం లేదా?

నలుగురికి జీవిత సాఫల్యం అందించే విశ్వతత్వం నీలో ప్రతిపలించటం లేదా?

అంతా రిక్తమే.. సిక్తమే

అందమైన నటనే .‌.అలంకరణే డాంబికమే..


ఉగాది ఉషస్సులతో

విచ్చుకున్న వేప పువ్వులా హృదయ ద్వారాలు తెరుచుకున్నావా?

తీయమాను మామిడి పిందెలా మదిలో చెడును చెరిపి- తీపినిఎంచుకున్నావా? మిరియపుకారముల అహంకారాన్ని తుంచుకున్నావా?

నల్ల ఉప్పు కాసారంలో స్వార్థాన్ని

దహించుకున్నావా?

తీపి బెల్లముల -పులుపు చింతల నిన్ను నువ్వు సమర్పించుకున్నావా! మంచినే ఎంచుకున్నావా!!

నీలో నిన్ను వెతకలేనప్పుడు

ఉగాది పరమార్ధం తెలుసుకోలేనప్పుడు..

యుగాల ఆది ఉగాది నీకెందుకు!


నీటి కోసం తపించే చెకోర పక్షుల ..

వసంతం కోసం ఎదురుచూసే కోకిలమ్మ లా..

శోభ కృత వసంత శోభనంతా ..

కాంతి కణమై ..

విశ్వ చైతన్యమై..

మళ్లీ కూ..కూ.. రాగాలు ఆలపించి..

దశదిశలా చిద్వి లాఫమై.. చిదాత్మమై ..

చిగురులు తొడుగుకుంటూనే ఉంటుంది..

నీలో నిన్ను పునర్ సృష్టించువరకు

ఆశగా దీక్షతో..

నిరీక్షిస్తూనే ఉంటుంది..

నీవే ఉగాదిగా మారేంతవరకు ‌‌..

: స్పందించండి మిత్రమా

కామెంట్‌లు లేవు: