ఆడవారు తులసి చెట్టు వంటివారు.😍
మగవారు దురదగుంట చెట్టు వంటివారు.😏
సీన్ కట్ చేస్తే ..!
"బీర్బల్ ... దర్బారుకు ఆలస్యంగా ఎందుకు వచ్చావు?"
"ఆలంపనా... జహాపనా.... ఈ రోజు మా తులసీ మాత పూజ ప్రభూ....!! అమ్మకి పూజచేయడంలో ఆలస్యం అయిపోయింది."
అక్బర్ కి నవ్వొచ్చింది.
"తులసి... మాత.... హ హ హ హ ... ఈ చిన్న మొక్క మీకు తల్లా?" అంటూ వికటాట్టహాసం చేశాడు.
"ఎవరక్కడ... ఒక తులసి చెట్టును తెప్పించండి"
పాదుషా తలచుకుంటే మొక్కలకు కొదవా?
సభలో అందరి ముందే తులసి మొక్కను చింపి పోగులు పోశాడు అక్బర్.
"చూశావా... నీ మాతను ఏం చేశానో..."
బీర్బల్ ఏమీ అనలేదు. "చిత్తం జహాపనా" అన్నాడు.
మరుసటి రోజూ బీర్బల్ ఆలస్యంగా వచ్చాడు.
"ఈ రోజేమిటి బీర్బల్... మళ్లీ ఎందుకాలస్యం?"
"ప్రభూ నిన్న మా తల్లిగారి పూజ అయింది. ఇవాళ్ల తండ్రిగారి పూజ ప్రభూ..."
"మీ తండ్రి కూడా ఒక మొక్కేనా..."
"అవును ప్రభూ...."
"ఆ మొక్కని తీసుకురండి"
ఆ మొక్కని దర్బారులో పెట్టారు.
అక్బర్ "మీ అమ్మ పని పట్టాను. ఇక మీ అబ్బ పని పడ్తాను చూసుకో..." అంటూ ఆ మొక్కను చింపి పోగులు పోశాడు.
కాసేపటికి అక్బర్ కి దురద మొదలైంది. ముందు మర్యాదగా కనీ కనిపించనట్టు గోక్కున్నాడు.
తరువాత బరబరా గోక్కున్నాడు. బట్టలువిప్పి మరీ నేలపై పొర్లుతూ గోక్కోవడం మొదలుపెట్టాడు.
"అమ్మోయ్... బాబోయ్... నాకేమైంది బీర్బల్ ...." అంటూ గావుకేకలు పెట్టాడు.
బీర్బల్ నెమ్మదిగా, తెచ్చిపెట్టుకున్న వినయంతో "జహాపనా... మా తల్లి శాంత స్వభావురాలు, ఏమీచేయదు. కానీ మా తండ్రి అలాంటివాడు కాదు. ఆయనకు ముక్కుమీదే ఉంటుంది కోపం."
"ఎవరయ్యా ఈ తండ్రి... బాధ భరించలేకపోతున్నాను."
"ప్రభూ... తులసి మాకు తల్లి. దూలగొండి మాకు తండ్రి. దూలగొండిని కెలుక్కున్నారు మరి...." అన్నాడు బీర్బల్.
"ఏం చేయాలయ్యా... ఎలా తగ్గుతుందయ్యా ఈ దురద....?" అక్బర్ గారు నేలమీద పడి దొర్లుతున్నాడు.
"ప్రభూ దీనికి ఒకటే మార్గం. మా తండ్రి గారి కోపాన్ని మా తల్లి మాత్రమే శాంతింపచేయగలదు. కాబట్టి ఆమెకు మొక్కండి. తులసి ఆకుల రసాన్ని పూసుకొండి. దురద తగ్గుతుంది." అన్నాడు బీర్బల్.
అక్బర్ ఓ చేత్తో గోక్కుంటూనే రెండో చేత్తో తులసమ్మకు దణ్ణం పెట్టాడు.
ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు ఇలాగే బుద్ధి చెప్పాలి.
🙏🙏🙏🙏🙏🙏
షేర్ చేయడం మరువకండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి