5, జులై 2021, సోమవారం

ఆదర్శ మూర్తి

 ఆదర్శ మూర్తి గా!....


సామాన్య కుటుంబంలో జనియించి

సాధారణ విద్యను అభ్యాసం గావించి

నిరాడంబర జీవితాన్ని అనుసరించి

సరళ మైన రీతిలో

మానవ భావోద్వేగా లే కవిత కైనా

కథ  కైన,నవల కైన ఆలంబన గా

ఎంచుకుని

పేద ప్రజల జీవితాల్ని జీర్ణిం చుకుని

వాటిని తన రచనల్లో సదా ప్రతి బింబింప చేసుకుని

కాయ కష్టాన్ని అలవరచు కని

శ్రామికుడు గా దీనుల జీవితాల్ని

అనుభవించి

పత్రికా రంగాన, ఆకాశ వాణి లో

తన విశేష సేవలు అందించి

తన ఆపత్కాలంలో,క్షుద్బాధాసమయం లో ఆపత్ బాంధ వులుగా నిలిచిన

వారి పై విశ్వాసానికి ప్రత్తీకగా

తన సంతతికి వారి పేర్లు పేట్టి

తన గృహసీమ కు కూడా 

సహధర్మచారిణి పేరును పెట్టి

తన సాహితీ పిపాసకు,తన సాహితీ తృష్ణ కు  తార్కాణంగా కళా ప్రపూర్ణ, కళా రత్న, జ్ఞాన పీఠ్ వంటి

ఎన్నో పురస్కారాలను  ఎన్నో అందుకుని

బడుగు జీవితం నుంచి ఎన్నో అడుగుల ఎత్తైన కీర్తి శిఖరాలను

అధిరోహించి

కృషీ తో నాస్తి దుర్భిక్షం అన్న పదానికి ఆదర్శంగా

ఈ జగతికి మార్గ దర్శి గా నిలిచిన

అక్షర బ్రహ్మ,ఆదర్శ పుషుడు

భరత మాత నే కాక జాతిని సైతం

పునీతం చేసిన మహనీయుడు

మన రావూరి భరద్వాజ గారికి

ఈ అక్షర నీరాజనం!


దోస పాటి.సత్యనారాయణ మూర్తి.

9866631877

కామెంట్‌లు లేవు: