శరీర భాగాలు -- వాటి సరదా ఉపయోగాలు గురించి చెప్పుకుందాం...
(సరదాకు మాత్రమే😊)
తల - తాకట్టు పెట్టుకోవడానికి
గడ్డం - పట్టుకుని బతిమలాడటానికి
ముక్కు - పిండి వసూలు చేయడానికి
వీపు - విమానం మోత మోగించడానికి
కాలు - కదపకుండా పనులు చేయించడానికి
కాళ్ళు - బలపం కట్టుకుని తిరగడానికి
చేతులు-ఖాళీ లేవనటానికి
అరికాలు - మంట తలకెక్కించుకోవడానికి
పళ్లు-రాల కొట్టటానికి
కళ్ళు - నిప్పులు పోసుకోవడానికి
భుజాలు - గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవడానికి
చెంప - ఛెళ్ళుమనిపించడానికి
వేలు - ఇతరుల వ్యవహారాలలో పెట్టడానికి
అరచేయి - వైకుంఠం చూపించడానికి
గొంతు- మీద కాలేసి తొక్కటానికి
పొట్ట - తిప్పల కోసం
నడుము - వంచి పనిచేయడానికి
నొసలు - చిట్లించడానికి
నోరు- పారేసుకోడానికి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి