5, జులై 2021, సోమవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 5

ప్రశ్న పత్రం సంఖ్య: 5                             కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి ప్రతి పదం "తి " తో అంతమౌతాయి   

1) మొదటి పూజలు పొందే దేముడు 

2) సౌందర్యం కల స్త్రీ 

3) ఒక ప్రసిద్ధ వైష్ణవ పుణ్య క్షేత్రం 

4) భర్త 

5) ఆమోదం తెలియ చేయటం 

6) ప్రసిద్ధ సినిమా నటి, నిర్మాత, గాయని, రచయిత, దర్శకురాలు, మదాసులో ఒక సినిమా స్టూడియో అధిపతి 

7) రూపవంతురాలైన స్త్రీ 

8) ఒక వంశం రాజు ఏనుగులకు అధిపతి అనికూడా అర్ధం 

9) భార్య 

10) దేవాలయాల నిర్మాణాలు నిర్దేశించే ప్రాచీన ఇంజినీరు 

11) దరిద్రుడికి ఇదే పరిస్థితి 

12) చనిపోయిన వారు ఈ స్థితి పొందాలనుకుంటారు 

13) రెండక్షరాలలో ఎక్కువ 

14)రెండక్షరాలలో తక్కువ

15) పేరు ప్రఖ్యాతులు కలిగి వుండటం 

16) ఏడుకొండల వానిని ఇలాకూడా పిలుస్తారు 

17) మంచి అంగన  మూడక్షరాలలో 

18) ప్రతి వారికి వుండాలిసింది ఇడిపోయిందా పిచోడే 

19) ఒక నక్షత్ర నామము 

20) విన్నపము 

21) ప్రీతి వారు పేరుతొ పాటు ఇది కూడా ఉండాలనుకుంటారు 

22) ఈశ్వరుని ఇలా కూడా పిలుస్తారు 

23) ఇది లేకపోతె మనం ప్రపంచాన్ని చూడలేము 

24) భ్రమ 

25) అందరు మనస్సుకు ఇది ఉండాలనుకుంటారు 

26) పడని పదార్ధాలు తింటే ఇది అవుతుంది. 

27) మనుసులు ఈ జంతువునుంచి పుట్టారంటారు 

28) ఈ రోజుల్లో ఇది వున్న మనుషులు అరుదుగా కనపడతారు 

29) ఎమితినాలన్న దీనితోటె 

30) షుగరు రోగులకు అన్నం తో పాటు ఇది కూడా తినమంటారు 

31) ఇది ఒక అలంకరణ పుష్పము 

32) క్రికెట్ ఆడటానికి,  ఇది ఉండాలి 

33) ఇది దేవతలకే కాదు ఒక తెలుగు రాజధాని కూడా 

34) బాహు బాలి సినిమాలోని సామ్రాజ్యం 

35) ఉత్తర రామచరిత్ర వ్రాసిన సంస్కృత కవి 

36) మనవాళ్ళు పూర్వం నీరు ఇక్కడినుండి తోడుకునేవారు 

37) పెండ్లిలో భర్త మూడు ధర్మములు నీతో కలిసి పంచుకుంటానని భార్యకు చేసే ప్రమాణం మొదటి రెండక్షరాలు 

38) ప్రపంచం 

39) ఆకారము 


కామెంట్‌లు లేవు: