19, జులై 2024, శుక్రవారం

గురు పౌర్ణమి

 జై శ్రీ రామ్ 


జై గురుదత్త 

ఈరోజు మనము గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి గురించి తెలుసుకుందాము.గురుపౌర్ణమి గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా మనము వ్యాస మహర్షి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.వ్యాస మహర్షులవారు పరాశర మహర్షి మరియు సత్యవతి కి జన్మించాడు.ఈయన పుట్టిన వెంటనే తపస్సుకి వెళ్ళిపోయాడు.ఈయన పూర్వ నామం కృష్ణ ద్వైపాయనుడు.వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు.వేదాలతో పాటు మహాభారతం, మహా భాగవతం మరియు అష్టాదశ పురాణాలు రచించాడు.ఈయన సప్త చిరంజీవులలో ఒకరు. వేదాలను సంకలనం చేసి ఆధ్యాత్మికతను మానవాళికి అందించాడు.అందుకని ఈయన పుట్టిన రోజు అనగా ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అంటున్నారు.ఈ పౌర్ణమి నాడు గురువులను,వ్యాస మహర్షిని పూజించుకునే రోజు. 

ఇక్కడ మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను ప్రస్తుతం గురువు యొక్క ప్రాధాన్యత చాలా తగ్గిస్తున్నారు.అది ఎలా అనగా ఆధ్యాత్మికతను మొత్తం యూట్యూబ్,వాట్సప్, ఫేస్బుక్ లాంటివి అనుసరించి తెలుసుకుంటున్నారు. తెలుసుకోవడం తప్పు అని అనడం లేదు కాని గురువు లేకుండా ఎటువంటి ఆధ్యాత్మిక సాధనలు గాని పూజలు గాని చేస్తే ఆ పూజలో ఉన్న జ్ఞానం కానీ ఆ పూజ యొక్క వృత్తాంతం,దేవి దేవతల స్థితిగతులు తెలిసే అవకాశం లేదు.కనుక  ఆధ్యాత్మిక మార్గాలలో వెళ్లాలి అంటే తప్పనిసరిగా గురువు అనే వ్యక్తి ప్రత్యక్షంగా ఉండాలి. సాధారణంగా గురువులు సరైన వాళ్ళు లేరు అనే మాట కూడా వినపడుతోంది కానీ ఎంత సరైన వాడు లేకపోయినా మనసుపెట్టి వెతికితే కచ్చితంగా దొరుకుతారు.ఇప్పటికీ మహిమాన్వితమైన గురువులు,యోగులు,సిద్ధ పురుషులు మన మధ్య ఉన్నారు కానీ వారిని గుర్తించలేక మనం ఆ నిందని గురువు మీద తోసేస్తున్నాం.కాని ఇది సరైన పద్ధతి కాదు దయచేసి గురువును వెతకండి దొరుకుతారు. మరియొక విషయం ఎవరైనా ఒక గురువు దగ్గర మంత్రం తీసుకొని ఉంటే కచ్చితంగా ఆ గురువుని కలవవలసి ఉంటుంది.భగవంతుడు సైతం సహాయం చేయనప్పుడు మనకి మార్గదర్శకం చేసే వ్యక్తి ఒక గురువు మాత్రమే.అంతటి గురువు యొక్క ఆశీర్వాదం గురు పౌర్ణమి నాడు లభిస్తుంది.ఆరోజు అనగా జూలై 21 2024 మనమందరం వ్యాస మహర్షి,మన గురువులను పూజించి మంచి సాధన మార్గంలో ప్రయాణం చేద్దాం.

శ్రీ మాత్రే నమః

జై శ్రీ రామ్ 

కంచర్ల వెంకట రమణ

కామెంట్‌లు లేవు: