19, జులై 2024, శుక్రవారం

శంఖనిధి...పద్మనిధి

 *శంఖనిధి...పద్మనిధి...!!🙏🙏*


సిరి సంపదలను పలు రూపాలలో  ఆరాధించ  వచ్చును.

కొంతమంది  ఎనిమిది విధాలైన అష్టైశ్వర్యాలుగాను, తొమ్మిది విధాలైన  నవ నిధులుగాను , ఆరాధించి తరిస్తున్నారు. 


ఆదికాలంలో  సిరి సంపదలను , శంఖ నిధి, పద్మనిధి  అని  రెండు రకాలుగా  కీర్తించేరు, ఇవి శంఖ రూపంలోను, 

తామర పుష్ప రూపంలోను

వున్నట్టు  చెప్తారు. 


ఈ రెండు నిధులకు అధిపతి

కుబేరుడు, అప్పర్ స్వామి తేవారంలో శంఖనిధి, పద్మనిధులను

గురించి వివరించారు.


మహాలక్ష్మి నివాస ముఖద్వారం వద్ద  శంఖనిధి పద్మనిధి  వుంటారు అని అంటారు...


దీనికి నిదర్శనంగా మన దేవాలయాల  ద్వారాల వద్ద  ఇద్దరు యక్షులు శంఖాన్ని , పద్మాన్ని ధరించి నిలబడివుంటారు...


పెద్ద పెద్ద ఆలయాలు ,  భవంతులు, గృహాల  ప్రవేశ ద్వారం మీద మహాలక్ష్మీ ని,  మెట్ల వద్ద శంఖ నిధి , పద్మనిధిని ప్రతిష్టించే  ఆచారాలు ఏర్పడినవి, జైనుల ఆలయాలు అన్నిటిలో

ప్రవేశ ద్వారముల మీద

మహా లక్ష్మీని, మెట్ల కిరు ప్రక్కలా  యీ రెండు నిధులను అమరుస్తారు.


ఈ లోకంలోని అమూల్య సంపదలన్నీ జలగర్భంలో మరుగుపడి వున్నవని  , భగవంతుని అనుగ్రహం పొందిన అదృష్ట జాతకులకు, ఒక శుభ సమయాన ఆయా నిధులకు అధిపతులైన  దేవతల ద్వారా లభిస్తాయని భక్తుల ధృఢ విశ్వాసము, ఇంద్రుడు  పాలకడలిని  చిలికినప్పుడు లభించిన అమృతంతో పాటు సిరి సంపదలు కూడా తన ఆధీనంలోనే వుంచుకున్నాడు.


సాగర గర్భాన మకరలోకం అనే లోకం  వున్నదని ,ఆ లోకంలో అనంతంగా నిధి నిక్షేపాలు , సిరిసంపదలు

వున్నాయని చెప్తారు, జలాలలోని ఆ సంపదలకి చిహ్నం శంఖనిధి అని, 

ఖగోళంలోని విజ్ఞాన నిధి 

చిహ్నమే పద్మనిధియని పిలవ

బడుతున్నది. 


ఈ శంఖనిధి, పద్మనిధుల విశిష్టత గురించి పురాణాలు  ఉన్నతంగా వర్ణిస్తున్నాయి, తామరపుష్ప రూపంలో వున్న 

పీఠం మీద దక్షిణావర్త శంఖాన్ని అమర్చి , ఆ శంఖంలో ధాన్యాన్ని, నాణెములను వేసి  అదే శ్రీమహాలక్ష్మి గా భావించి పూజలు చేసి ఆరాధిస్తారు.


కాలక్రమేణా, ఆ తామర పుష్ప పీఠ ఆకారాన్ని కూర్మ రూప

ఆసనంగా మార్చడం జరిగింది.

కూర్మం  దీర్ఘకాలం వుండేది అయినందున కూర్మాసనాన్ని

పీఠంగా అమరుస్తున్నారు. 


ఇప్పుడు కూర్మ పీఠాలే ఈ విశేష పూజల సమయంలో  ఎక్కువగా దర్శనమిస్తున్నాయి...


స్వస్తి.🙏🌹🍎🍉🍑🍓🍓🤝🤝


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కామెంట్‌లు లేవు: