1991 April 5న ‘స్వాతి’ వీక్లీ వాళ్ళు ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. అందులో ఒక ప్రశ్నకు అద్భుతమైన సమాధానం చెప్పారావిడ. గొప్ప ఫిలాసఫీ కనిపించింది ఆ జవాబులో 👏👏🙏🙏 🙏
👉 ఎంతో జీవితాన్ని చూసిన మీరు, రచయిత్రిగా, ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా, తోటివారికి మీ అనుభవం నుంచి ఇచ్చే సలహా ఏమిటి?
యద్దనపూడి :
————————
ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి! మనిషికి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం ఈ జీవితం! వంద సంవత్సరాల వెనక మనం లేం! వంద సంవత్సరాల ముందు వుండం. యోగ నిద్రలో క్షణంలో వెయ్యో వంతు, కళ్ళు తెరిచి ఈ అద్భుతమైన సృష్టిని చూడటానికి మనకి దక్కిన ఈ అపురూపమై న అవకాశాన్ని, ఈర్ష్యాసూయలతో, వ్యర్థ పంతాలతో చేయి జార్చుకోవద్దు!
ప్రతిరోజూ ప్రతి నిముషం, ప్రతి సెకనూ, మన చేతిలోంచి జారిపోయి ఇక తిరిగిరాదు. మనది అనుకున్న మన ఈ శరీరం కూడా మనది కాదు!
మన తాత ముత్తాతల రక్తంతో మనకి ఈ శరీరం వచ్చింది. ఈ జీవనధారని మన పిల్లలకి అందించి మనం వెళ్లిపోవాల్సినవాళ్ళం. మనకెందుకు ఈ కొట్లాటలు! మనకెందుకు ఈ పరస్పర ద్వేషాలు!
వాటిని వదిలేసి, మనం సుఖంగా బ్రతకటానికి ప్రయత్నంచేసి, ఎదుటివారిని సుఖంగా బ్రతకనిద్దాం. మనం మళ్ళీ పొందలేని ఈ జీవితాన్ని మనకి మనం “జీవిస్తున్నాం” అనే స్పృహతో, ఆనందంగా బ్రతుకుదాం!
మనమంతా రైల్వే వెయిటింగ్ రూమ్ లో కూర్చున్న ప్రయాణీకులం. ఎవరి రైలు వస్తే వారు వెళ్ళిపోతాం. ఈ కుర్చీలు, బెంచీలు, కర్టెన్లు మనవి కావు అని తెలుసుకుంటే నిజంగా ఆనందంగా బ్రతకగలుగుతాం! ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాల్సినవాళ్లకి, ఈ ప్రపంచంతో ఎందుకు గొడవ!
మనశ్శాంతిగా, వున్నంతలో బ్రతకటమే ధ్యేయం చేసుకుంటే మీకు, మీ ఇంట్లోవారికి, మీ పక్కింటి వారికీ, మీ సాటి సంఘంలో అందరికీ సుఖశాంతులు, సంతోషం లభిస్తాయి.
YaddanapudiSulochana Rani
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి