17, సెప్టెంబర్ 2020, గురువారం

శ్రీనాథ కవి చెప్పిన ఒక చాటువు.

సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని నిలదీస్తూ శ్రీనాథ కవి చెప్పిన ఒక చాటువు కూడా చూదాం. గమనిక: ఇక్కడ అల్పత్వమూ లేదు. అభిశంసనా లేదు. చమత్కారంగా కవి పరమ శివుని ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అంటున్నాడు. అంతే.
గరళము మ్రింగితి ననుచున్
పురహర ! గర్వింప బోకు, పో,పో,పో ! నీ
బిరుదింక గాన వచ్చెడి
మెఱసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ !

ఆ నాడు దేవాసురులు సముద్ర మధనం చేసేటప్పుడు ఉద్భవించిన విషాన్ని పరమశివుడు స్వీకరించాడు. లోకోపద్రవం నివారించాడు. అందుకే నీలకంఠుడిగా నామాంతరం పొందాడు.

ఓ పురహరా ! విషాన్ని మ్రింగాను కదా అని గర్విస్తున్నావు. చాలు . చాల్లే ! రేనాటి జొన్న మెతుకులు తిని చూడు నీ గొప్పతనమేమిటో తెలిసి వస్తుంది ! అని దీని భావం. రేనాటి జొన్న కూడు నోట పెట్టరానిదిగా ఉంటుందని కవి చమత్కారం.

ఫుల్ల సరోజ నేత్ర ! యల పూతన చన్నుల చేదుద్రావి, నా
డల్ల, దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల ? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగ మ్రింగుము నీ పస కాననయ్యెడిన్ !


ఇది పలనాటి జొన్న కూడు గురించినది. కృష్ణా ! ఆనాడు రక్కసి పూతన విషపు చనుబ్రాలు త్రాగాననీ, అల్లప్పుడు విషాన్ని మ్రింగాననీ, గొప్పలు పోతున్నావు. చింతాకుతో కూడిన ఉడుకు బచ్చలి కూరను జొన్న కూటితో ఒక ముద్ద నోటిలో పెట్టుకో ! నీపస ఏమిటో తెలిసి పోతుంది.

[17/09, 9:30 am] +91 99089 49429: *హరి స్తుతి*
_____________________________________

 *సీ* . సుందర సుకుమార సుమ హాస భాసిని
               నవ మోహనాంగి యా నందయంతి

        నిను గోరి కానలన్ నిష్టతోడగ తాను
               తపము జేసిన గాని తగ్గలేదు

       దైత్యులన్ వంచించి ధర్మమున్ గాపాడ
                యవతారమెత్తిన యాది విష్ణు

        మోహినీ రూపాన మోహింప జేయగా
                 కామంబు నీకేల గలిగెనయ్య

 *గీ* . సత్యమును వీడి మిథ్య తో సంగమమ్ము
       నీకు మాత్రమే సాధ్యమో నీలకంఠ
       నీదు లీలల మహిమల నెరుగగాను
       ఏరి కైనను సాధ్యమే ఇందు మౌళి?
_____________________________________

 *రచన:- మల్లేపల్లి ప్రమోద్ కుమార్*
 *గానం:- శ్రీమతి దోర్బల బాల సుజాత
[17 +91 99089 49429: సూర్యోదయ వర్ణన. ( శ్రీనాధుడు )

సంస్కృత మహాకవి మయూరుని సూర్య శతకం లోని శ్లోకం :

" శాతశ్శ్యా మా లతాయాః పరశురివ
 తమోరణ్య వహ్నేరివార్చిః
ప్రాచ్యేవాగ్రే గ్రహీతుం గ్రహకుముదవనం
ప్రాగుదస్తోగ్రహస్తః "

ఈ శ్లోకానికి శ్రీనాధుని అద్భుతమైన తెనుగుసేత :

“చిఱుసానఁ బట్టించి చికిలి సేయించిన
     గండ్రగొడ్డలి నిశాగహనలతకు

గార్కొన్న నిబిడాంధకార ధారాచ్చటా
     సత్రవాటికి వీతిహోత్ర జిహ్వ

నక్షత్రకుముద కాననము గిల్లెడు బోటి
     ప్రాచినెత్తిన హస్తపల్ల వాగ్ర

మరసి మింటికి మంటికైక్య సందేహంబు
     బరిహరింపంగఁ బాల్పడ్డ యవధి


సృష్టి కట్టెఱ్ర తొలు సంజ చెలిమికాడు
కుంటు వినతా మహాదేవి కొడుకుఁ గుఱ్ర
సవితృ సారథి కట్టెఱ్ర చాయఁ దెలుప
నరుణుఁడుదయించెఁ బ్రాగ్దిశాభ్యంతరమున”



రాత్రి చీకట్లు అనే దట్టమైన లతకు చక్కని సాన పెట్టించి చేయించిన గండ్రగొడ్డలి వలె ,

దట్టంగా  అలుముకున్న అంధకారమనే అరణ్యము పాలిటి అగ్నిహోత్రుని నాలుకవలె , కార్చిచ్చు వలె ,

తెలతెలవారుతుండగా ఇంకా మినుకు మినుకు మంటున్న నక్షత్రములు అనే కుముదములను (కలువలను) గిల్లడానికి  తూర్పు దిక్కు అనే స్త్రీ చాచిన చేయి వలె ,

రాత్రి వేళలో అంధకారంలో భూమ్యాకాశాలు అన్నీ చీకట్లలో  ఏకమైపోయి - భూమికీ ఆకాశానికీ ఏ తేడా, ఏ విభజనా లేకుండా పోయి, రెండూ ఒకటేనేమో అని కలిగే సందేహాన్ని  నశింప జేయడానికి ఏర్పడిన సరిహద్దు వలె
ఉన్నాడట సూర్యుడు !

ఎందుకంటే సూర్యోదయంతో ఏది నింగి, ఏది నేల అనే తేడా కనిపిస్తుంది కనుక. సూర్యుని రథ సారధి, కుంటివాడైన  వినతా కుమారుడు అనూరుడు దారిని చూపిస్తూ  రధాన్ని నడుపుతుండగా తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించాడు.
సేకరణ.

కామెంట్‌లు లేవు: