*ఓం నమో భగవతే వాసుదేవాయ*
సందేహం;- జ్ఞానయోగం చేసేవాడు, కర్మలను చేయడం మానవచ్చుకదా?
సమాధానం;- ఆత్మప్రాప్తి కలగడమే జ్ఞానయోగ లక్ష్యం. అది కలిగిన తర్వాత ఇక కర్మయోగం అవసరం లేనట్లే. అయితే జ్ఞానయోగి కర్మలను మానివేయకూడదని గీతాచార్యుడు చెప్పాడు. సంగం లేకుండా కర్మలను చెయ్యాలి. ఈ ధర్మ సూక్ష్మాన్నే కృష్ణుడిలా వివరించాడు.
*యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః*
*స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే*
(భగవద్గీత, 3-21)
ప్రసిద్ధుడైనవాడు ఏ కర్మలను చేస్తాడో ఇతరులు కూడ అదే కర్మలను చేస్తారు. పైగా, శ్రేష్ఠుడైన వాడు ఆ కర్మను ఎలా చేస్తాడో, ఇతరులు కూడా అలాగే అనుసరిస్తారు.
జ్ఞానయోగార్హత సంపాదించినవాడు లోకంలో కొంత ప్రసిద్ధిని పొందుతాడు. లోకులంతా అతణ్ణి వేయి కళ్ళతో చూస్తుంటారు. అప్పుడతడు కర్మలను మానివేస్తే, "ఇంత ప్రసిద్ధుడే ఫలానా కర్మల్ని చేయడం లేదు. ఇక మనం చెయ్యకపోతే ఏం?" అనుకొని తాము కూడ కర్మలను చేయడం మానివేస్తారు. అందువల్ల సంఘం పురోభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది.
కాబట్టి జ్ఞానయోగం చేస్తున్నప్పటికీ కర్మలను విడిచిపెట్టకూడదు. శాస్త్ర విహిత కర్మలు చేయవలసిందే. అయితే అవి సంగం (అటాచ్ మెంట్) లేకుండా చెయ్యాలంటున్నడు భగవానుడు.
*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి