17, సెప్టెంబర్ 2020, గురువారం

వార్షిక బ్రహ్మోత్సవాల సందర్బంగా నిర్వహించే

 ☝️తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్బంగా నిర్వహించే ధ్వజారోహణంకు దర్భ చాప, తాడు సిద్ధమయ్యాయి. ఈ క్రతువుల్లో దర్భచాప,తాడు అతిముఖ్యమైనవి.


బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ధ్వజస్తంభం మీదకు గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు.


అర్చకులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు.దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభం పై వరకు చుడతారు. 


వీటి తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. 


        ఇందుకోసం వడమాల పేట పరిసర ప్రాంతమైన చెల్లూరు పంటకాలువల మీద పెరిగే ఈ దర్భను టీటీడీ అటవీ సిబ్బంది సేకరిస్తారు. 


దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెడతారు. ఆ తరువాత దర్భను బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేస్తారు.


ధ్వజారోహణం కు 5.5 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు చాప, 175 అడుగుల తాడు అవసరం అవుతాయి.  


అయితే అటవీశాఖ ఈ సారి 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో చాప, 211 అడుగుల పొడవు తాడు సిద్ధం చేసింది.  


టీటీడీ డి ఎఫ్ ఓ చంద్ర‌శేఖ‌ర్‌ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకుని వచ్చి వీటిని ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ కు అందిచారు. 


ఈ నెల 19వ తేదీ జరిగే ధ్వజారోహణం లో వీటిని ఉపయోగిస్తారు.


🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: