17, సెప్టెంబర్ 2020, గురువారం

గారడీ జీవితం.

+91 99089 49429: నేటిపద్యం:అంశము:
గారడీ జీవితం.
తేది:17-9-2020:గురువారం.

కందం:
అవసరమిలనేర్పునుజూ
డవలయుసాధనముఁబొందుటసుఖమనగాన్
భవసాగరమీదగనహ
హవచ్చుగారడితనంతతానైనేర్వన్.

రచన:దేవరకొండ:రాజోలు.+
91 99089 49429: గారడీ జీవితం:పద్య భావము.

కావాలని యెవరూ నిప్పుల
ను తొక్కరు.కావాలని చేస్తే, అదే గారడీ విద్యఔతుంది నిజానికి జీవితమే ఒక
 పెద్ద గారడీెఅని చెప్పాలి.తమ నిక్యజీవన
అవసరాలు తీర్చుకోవడాని
కి వలసకూలీలు. పల్లీయు
లు చేసే పనులు మనకు
గారడీగ తోచును. పల్లెల్లో
పంటకాల్వలపై, బోదెలపై
యీ దరి నుండి ఆ దరికి దాటడానికి వేసే తాటిపట్టీ
లను దాటడం పెద్ద కష్టంగా
యితరులకు తోస్తే, పల్లె వాసులు మాత్రం దానిని
సులభంగా దాటేస్తారు.
అలాగే బిందె బిందెపెట్టు
కొని అలా పది పదిహేను
బిందెలను తలపై ఒకటొక
టిగా పేర్చుకొనుట మనకు
పెద్ద గారడీ. అదే నీరు
అత్యంతక్లిష్టంగా దొరికే
యెడారి వాసులు నీటి
చెలమలనుండి నీటిని
తెచ్చుకోవడానికి తప్పని-
సరిస్థితిలో ఈ పనిని అవలీలగా చేస్తారు. అనగా
అవసరమే మనకు అన్నీ
నేర్పుతుందని మనం గ్రహిం
చాలి.మనం దేనినైనా సరే
నేర్పడానికి కావలసిన ఓర్పును, నేర్పును కలిగి
యుండుట మిక్కిలి అవసరమని మనం గుర్తెర
గాలి. ఐనా, గారడీ ఒక
విద్యగా కూడా కొందరికి
జీవన భద్రతనీయడం
సంతోషించతగినదే. అట్టి
వారి కష్టనష్టములను
మనం గుర్తించి, వారికి
తోచినంత సాయం చేయ
సంకల్పించెదముగాక!

రచన:దేవరకొండ:రాజోలు.
-

కామెంట్‌లు లేవు: