ఈ శ్వేత పత్రంపై!....
పౌష్య మాసాన!
మకర రాశిలో!
భానుడి ప్రవేశకాలాన!
సంరంభంతో!
ఆరంభంగా!
విచ్చేసిందీ!
ఉత్తరాయణ పుణ్య కాలం!
పితృ దేవతలను స్మరించు కాలమై!
దేవతలకు అత్యంత ప్రీతి పాత్రమై!
విప్రులకు సైతం!
విరివిగా కూష్మాండముల దానమిడు కాలమై!
ముష్కురులంతా కుక్కుటముల కదనరంగములకంపు కాలమై!
గోవుల, వృషభములకు!
పూజ లిడు కాలమై!
పతంగుల ఎగరేసే కాలమై!
ముదితలు ముంగిట
ముగ్గులిడి గొబ్బెమ్మల పెట్టు వేళ!
పుడమి లోని చెడు నంతా!
భోగి మంటల రూపంలో!
చలి కాచు కొను వేళ!
బసవడు గంగిరెద్దై!
మంచిని ఆహ్వానిస్తూ!
పండుగ పరమార్థాన్ని చాటుతూ!
ప్రతీ ముంగిటా నర్తించే వేళ!
దాసు హరి నామ కీర్తనలతో!
జగతిని రంజింప చేయు వేళ!
ఇల్లిల్లూ మామిడి తోరణాలతో!
ముస్తాబైన వేళ!
రైతన్న ఇంటికీ సస్య లక్ష్మి!
వేంచేసిన వేళ!
కొత్త బెల్లం,కొత్త బియ్యం, ముర్రు పాలతో!
కాసింత మురిపాలనూ రంగరించి పొంగలిని సేయు వేళ!
రాజన్న,రైతన్న, కార్మికులకే కాక!
దేశ ప్రజలందరికీ!
మూర్తి త్రయ సంకేతమై!
భోగి,సంక్రాంతి,కనుమల రూపంలో!
ఇమ్మహి సుభిక్షం చేయగ!
ముదమ్ కూరుస్తూ!
అంబరాన్నంటేలా!
ఈ సంబరాన్ని జరుపు కోండంటూ!
నా మది ముంగిట నిలిచి!
రస హృదయులైన!
మిమ్మందరి నీ!
మురిపించాలని!
ఈ శ్వేత పత్రంపై కవితై!
విచ్చే సిందీ! పౌష్య హేమంత!
మకర సంక్రాంతి లక్ష్మి!
ఎస్.ఎన్.మూర్తి. దోసపాటి.
సామర్లకోట.
9866631877
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి