18, నవంబర్ 2020, బుధవారం

*కార్తిక దీపారాధన

 🌺🌷🌸🌾🥀💐🌹

*కార్తిక దీపారాధన ప్రాశస్త్యం ఏమిటి*?


*దీపదో లభతే విద్యాం దీపదో లభతే శ్రుతం దీపదో లభతే చాయుః దీపదో లభతే దివమ్*


*దీపం వెలిగించినవారు విద్యావంతులు, జ్ఞానవంతులు, ఆయుష్మంతులవుతారు. మోక్షాన్ని పొందుతారు.*


*సాయంత్రం శివాలయంలో దీపం వెలిగిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది.*


*అప్రయత్నంగా అయినా, భక్తిభావన లేకపోయినా దీపం వెలిగించినందువల్ల అనంత పుణ్యఫలం వస్తుంది.*


*ఇదే ఫలితం విష్ణుభక్తులకు కూడా వస్తుంది. కార్తికమాసం నెల రోజులూ దీపాలు పెట్టటం సంప్రదాయం.. ఆచార విధి కూడా.*


 *ఏదైనా కారణం వల్ల 30 రోజులు దీపం పెట్టలేని వారు కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లో అయినా దీపం వెలిగిస్తే, వైకుంఠప్రాప్తి కలుగుతుంది.*


*కార్తిక మాసంలో శనిత్రయోదశి కన్నా సోమవారం ఎక్కువ ఫలితాన్నిస్తుంది.*


*శనిత్రయోదశి కన్నా కార్తిక పూర్ణిమ వందరెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుంది.*


*పూర్ణిమ కన్నా బహుళ ఏకాదశి కోటి రెట్లు పుణ్యఫలితాలు అనుగ్రహిస్తుంది.*


*బహుళ ఏకాదశి కన్నా క్షీరాబ్ది ద్వాదశి అతి విస్తారమైన, అనంతమైన ఫలితాన్నిస్తుందని భాగవతం చెబుతోంది.*


*ఈ రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి.*


                 *భక్తి*

                M.s.s.k

కామెంట్‌లు లేవు: