నాద బ్రహ్మ ఉపాసన. అతి దగ్గరగా దేహములో వాయు రూపంలో గల నాదం దేనివలన తెలియును అనగా మననం తెలియును మౌనముగా మంత్రం మంత్ర మనగా అక్షర శబ్ద వ్యాప్తి వ్యాప్తి కలది కావున శక్తి గలది. శక్తి లేనిది చలన సహితము అగ్నియే అక్షర వ్యాప్తి తత్వం. పదే పదే అక్షర శబ్దాన్ని మనస్సుతో మననం. యిలా ఎందుకు. మనలో వాయు రూపంలో అగ్ని లక్షణమును గుర్తించుట. దానివలన దేహంలో మార్పులను అతి దగ్గరగా గ్రహించ వచ్చును. మానవ దేహ మార్పు ఎవరికి వారికి రోజు రోజూ కనిపించదు. ఎదుట వారికి కనిపించును. మానసిక మార్పులకు సాధన శబ్ద మనమే మూలం. దానిని ప్రకృతి రూపంలో పంచభూతముల ద్వారా మాత్రమే తెలియును. బ్రబ్మును దర్శించుట యే మననం. దీనినే అహం బ్రహ్మాస్మి. నేను అనే లేని వాయు తత్వం రూపం బ్రహ్మ మునై కలిగియున్నది. యిది సత్యమే. దేహంగల జీవుడు సత్యం. మిగిలినది అసత్యం. జీవం గల దేహం నీడ సత్యం. జీవి లేని దేహం నీడ అసత్యం నీడ దేహ రూపంలో చలనము గలదు. దానికి వెలుగు కారణము వెలుగులో మాత్రమే నీడ తెలియును చీకటిలో నీడ తెలియదు. చీకటి బ్రాంతి. దేహమునకు అనేక రకముల గుణములు కలవు. గుణములు వాసన వలన తెలియును. వాసన అనుభవం కర్మ కర్మ అనుభవమే జీవ లక్షణము. కర్మానుభవమే సత్యం. సత్యం అనుభవమే ఋక్కు. దీనికి నాద బ్రహ్మ ఉపాసన యే శరణ్యం యిక వేరు మార్గం లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి