🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 84*
*****
*శ్లో:- తస్కరస్య వధో దండ: ౹*
*దాసీ దండ స్తు ముండనం ౹*
*భార్యా దండ: పృథక్ శయ్యా ౹*
*మిత్ర దండ మభాషణమ్ ౹౹*
*****
*భా:- దండము అంటే కఱ్ఱ, నమస్కారం అనే అర్థాలు తెలిసినవే. "శిక్ష" అనే అర్థంలో నాలుగు సందర్భాలు తారసపడడం పరిపాటి. 1."దొంగ":- అమాయక ప్రజల ఆస్తులు,వస్తువాహనాలు కొల్లగొట్టి, ధనాన్ని, మనాన్ని, మానాన్ని,ప్రాణాన్ని హరించి, అంతమొందించే ఆకతాయిలకు, ఆతతాయిలకు "ఉరికంబమే" సరియైన శిక్ష. 2. "దాసి" :- నమ్మకంగా మనతో తిరుగుతూనే మన మర్మాలను, నర్మాలను, నిధులను, విధులను పసిగట్టి, స్వార్థంతో దుర్మార్గానికి, దురాగతానికి పాల్పడే సేవక గణానికి "తిరు క్షవరమే" తగిన శిక్ష.3. "భార్య":- సంసారములో భార్యాభర్తలు అన్యోన్యప్రేమ, పరస్పరగౌరవం, విశ్వాసము, అవినాభావసాహచర్యంతో కాపురం చేస్తున్నా అరుదైన కొన్ని సందర్భాలలో పట్టుదలకు పోయి, బిగుసుకు పోయినప్పుడు" వేరు వేరు శయ్యలపై శయనించడమే" భార్యామణికి విధించదగిన శిక్ష. 4."మిత్రుడు":- ఒకే కంచం. ఒకే మంచం. ఒకే మాట, ఒకే బాట గా బాల్యం నుండి విడదీయరాని మైత్రీబంధంతో ,భావసారూప్యంతో పెనవేసుకుపోయిన అనుబంధం గల మిత్రుడైనప్పటికిని, ఒక పట్టున ఆతని భావన, చేతన మనకు నచ్చని , మెచ్చని సమయంలో వివాదం పెట్టుకోకుండా, కొంతకాలం "మౌనం పాటించడమే" అతనికి తగిన శిక్ష. ఈ నలుగురిలో మొదటిది మినహాయించి, మిగిలిన ముగ్గురి విషయంలో నిరంతర అప్రమత్తత, సహనము, సంయమనము అవసరమని సారాంశము*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి