🌸🌺🌷🥀💐🌾🌹
*నాగుల చవితి విషయంలో పాలు పోయుట చేయవచ్చునా చేయరాదా ?*
*కార్తీకశుక్ల చతుర్థి - నాగచతుర్థీ*
*అథకార్తీకశుక్ల చతుర్ధీ నాగచతుర్థీత్యుచ్ఛతే | సా పంచమీ యుతాకార్యేతి పూర్వ మేవోక్తం| తథాచశాతాతపః - ఊర్జే శుక్ల చతుర్థీ యాసైవోపోష్యోత్తరేదినే | ఫణినః పూజయేత్తత్ర ప్రసీదంతి ఫణీశ్వరా ఇతి. అత్ర సైనోపోష్యోత్తరే దిన ఇత్యనేనైన పంచమీవిద్దాగ్రా హ్యేత్యుక్తం భవతి | ఉక్తంచ భవిష్యోత్తరే | పంచమ్యా సంయుతా కార్యా చతుర్థీ కార్తి కేసితా | మధ్యాహ్నే పూజయే త్సర్పాన్గంధపుష్పాక్షతాదిభి రితి అత్ర మధ్యాహ్న వ్యాప్తే షోడా విభాగః పూర్వోక్త ఏవే హోమసంధేయః | ఇతి కార్తీకశుక్ల చతుర్థి.
మధ్యాహ్నవ్యాప్యభావే ప్రాతఃకాలవ్యాపిన్యాం వా నాగచతుర్థీవ్రతం కార్యమ్ ఉపవాసవ్రతత్వాదితి కేచిదాహు: విశేషస్తు నాగచతుర్థీ వినాయకాచతుర్ధీవత్
మధ్యాహ్నవ్యాపినీ గ్రాహ్యా | తదాహ దేవల: -
యుగం మధ్యందినే యత్ర తత్రోపోష్య ఫణీశ్వరాన్
క్షీరేణాప్యాయష్టమ్యాం పారయేత్ ప్రయతో నరః ॥ ఇతి
యుగం చతుర్థీ / అస్యాః షోడా భేదో వతారణీయః ఏతన్నిర్ణయస్తు గణచతుర్థీ.
- నిర్ణయే 2 భిహితః
*తా|| కార్తీకశుద్ధ చవితి నాడు నాగుల చవితి ఆచరింపవలెను.*
*పంచమి విద్దయగు చవితినాడు మధ్యాహ్న కాలమున నాగపూజ చేయవలయును.*
*కార్తీక శుద్ధ చవితి పంచమీ విద్దగానుండగా ఆ మధ్యాహ్నము నాగులను గంధ, పుష్ప అక్షతలతో పూజింపవలెను.*
*మధ్యాహ్నమునకు తిధి వ్యాపించనిచో ప్రాతః కాలమునందైనను నాగ చతుర్దీ వ్రతమును చేయవలయును.*
* నాగ చతుర్ధీ నిర్ణయమును వినాయక చతుర్దీ నిర్ణయమువలెనేమధ్యాహ్న
కాల వ్యాపిత్వమును గ్రహించవలెను.*
*చవితి మధ్యాహ్న సమయమునకు ఉన్న దినముననుపవసించి, నాగులను క్షీరముచే తృప్తిపరచి పంచమి యందు పారణ చేయవలయును.*
*గణేశచతుర్థి నిర్ణయము వలెనే ఆరు విధములుగా విచారణ చేసి నిర్ణయించవలెను.*
*పురాణములలో ఈవిషయములనే చెప్పారు.*
*విశాఖకార్తెలోపాలు పోయరాదనే విషయం ఎచ్చటనూప్రధాన మైన వ్రతనిర్ణయకల్పవల్లి, కాల నిర్ణయచంద్రిక ఈ గ్రంధములలోచెప్పలేదు.*
*కనుకకార్తెఏదైననూ నాగులచవితిరోజు తప్పకుండా సర్పాలను ఆరాధించవలెను*
M.s.s.k
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి