15, మే 2023, సోమవారం

పాము వెళ్ళిపోయింది కానీ. .

 పాము వెళ్ళిపోయింది కానీ. . .


అర్ధరాత్రిలో మఠం ఏనుగు భయంతో ఘీంకరిస్తొంది. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆ అరుపులకు కూడా ఎవవరికి మెలుకువ కలగలేదు. అంత పెద్ద ఏనుగులు ఎలుక, కప్ప, పిచుక వంటి చిన్న చిన్న జంతువులకు ఎక్కువ భయపడతాయి. ఈ రాత్రిలో ఏ కప్పో, ఎలకో ఆ ఏనుగు దగ్గరకు వెళ్ళుంటుందని పరమాచార్య స్వామివారే లేచి వెళ్ళారు.


ఏనుగుకు ఎదుగురుగా ఒక పెద్ద తాచుపాము పూర్తిగా పడగ విప్పి చూస్తోంది. వెంటనే స్వామివారు శిష్యులను నిద్రలేపారు. పామును కొట్టడానికి వాళ్ళు కర్రలు తోసుకుని వచ్చారు. “ఆ పామును కొట్టకండి. నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి. అదే వెళ్ళీపోతుంది” అని ఆదేశించారు.


స్వామివారు చెప్పినట్టుగా నువ్వులనూనె దీపం వెలిగించి అక్కడ పెట్టగానే, అప్పటి దాకా పడగ విప్పి నిలబడ్డ ఆ పాము మెల్లిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంత పెద్ద ఏనుగు ఘీంకారాన్ని అక్కడే దగ్గర్లో పడుకున్న శిష్యులు వినలేదు కాని, అప్పటికే చెవి సమస్య ఉన్న పరమాచార్య స్వామికి వినపడింది.


అవును గజేంద్రుడు ‘కుయ్యో మొర్రో’ అని మొత్తుకుంటే అది విన్నది విష్ణువొక్కడే కదా! ఆ ఏనుగుని మరో చోటికి మార్చమని చెప్పారు మహాస్వామివారు.


”కాని పాము వెళ్ళిపోయింది కదా!”


“అవును పాము వెళ్ళిపోయింది. కాని ఏనుగుకి ఆ భయం పోయుండదు కదా!” స్వామివారి ఆదేశానుసారం దాన్ని మరో చోట కట్టారు శిష్యులు. పరమాచార్య స్వామివారు నిద్రకు వెళ్ళిపోయారు.


--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 1


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust

కామెంట్‌లు లేవు: