26, మే 2023, శుక్రవారం

అమోఘమైన విజ్ఞానం

 




🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*స్త్రీ.. ఆమె శరీరం ఈ మహా విశ్వం, ఒకొక్క అవయవం ఒక్కో భీజాక్షరం*, గర్భం విశ్వం యొక్క ఉనికి, యోని స్థానం విశ్వానికి ద్వారం! అంటే ఈ లోకంలో ఎంతమంది స్త్రీలున్నారో అన్ని విశ్వపు  ద్వారాలున్నాయని అర్ధం. ఎటువంటి ప్రాణి అయినా ఆ ద్వ్రారాల ద్వారా "ప్రాణం"తో ఊపిరి తీసుకుంటున్నాయని, మనం కూడా ఒక రూపాన్ని పొంది ఉనికిలోకి ఒక ప్రయోజనం కోసం వస్తున్నామని, మన మొదటి ఇల్లు స్త్రీ గర్భమని అర్ధంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. తంత్ర యోగం ప్రకారం, యోని అనేది మనుగడకు, ప్రకృతి (విశ్వజనీన పదార్థం, Universal Substance) తో ముడిపడి ఉన్న శక్తి యొక్క చిహ్నం (విశ్వాన్ని కదిలించే సృజనాత్మక శక్తి) . అందుకే శక్తుల్లోకెల్లా మహాశక్తి అయిన అమ్మవారి యొక్క "యోని" స్థానాన్ని కామాఖ్య దేవి దేవాలయంలో భక్తులు పవిత్రంగా పూజిస్తారు.


యోని స్థానం విశ్వపు ద్వారం అయితే పురుషుడి లింగ స్థానం ఆ ద్వారానికి తాళంచెవి. అందుకే స్త్రీపురుషుల కలయిక ఒక యజ్ఞం వంటిదని వేద ఉపనిషత్తుల వాఖు. ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తు అయితే ఒక ఘట్టంలో స్త్రీపురుషుల కలయిక గురించి ఆశ్చర్యపోయే విశ్లేషణ ఇస్తుంది. అలానే సృష్టిలో అఖండ సత్యం అనేది కౌగిలిలో అల్లుకుపోయిన స్త్రీపురుషుల్లా అంత అందంగా, అద్భుతంగ, అమోఘంగా, మధురంగా, రమణీయంగా ఉంటుందని నవతంత్ర మాట! నవతంత్ర యొక్క చిహ్నం శివపార్వతులు. అందుకే సత్యాన్వేషణలో ఎందరో మహానుభావులు, మహాపురుషులు సత్యాన్ని గ్రహిస్తూ బ్రహ్మానందాన్ని పొందుతూ జీవించేవారు!


మీ గృహములో ఆడపిల్ల జన్మించిందంటే జీవితం యొక్క మూలం మరియు ఆత్మలు శరీరాన్ని పొందే విశ్వపు ద్వారం ఒకటి తెరుచుకుందని,  ఒక మహాక్షేత్రం వెలిసిందని, అనంతమైన శక్తిగల అమ్మవారు స్వయంగా ఒక ప్రత్యేకమైన రూపంలో దిగి మీ ఇంటికి వచ్చిందని అర్ధం.


భారతీయ వైదిక వ్యవస్ధ ఉన్న కాలంలో, దారిలో స్త్రీ కనిపిస్తే ఎదురొచ్చే పురుషులు నమస్కరించుని వెళ్ళేవారు. కౌల ఆచారం అనే ఒక తంత్ర ఆచారం ఉన్న సమయంలో అయితే స్త్రీకి ఒక ఉన్నత పీఠం ఉండేది. భార్యల నెలసరి సమయంలో భర్తలు మోకరిల్లి పార్వతీ దేవి రూపంగా కొలిచి పూజించేవారు.


 

కౌల ఆచారం, తంత్ర విజ్ఞానం, పుట్టిల్లయిన భారతదేశంకంటే బయట దేశాల్లో ప్రాముఖ్యతను పొందడం ఆశ్చర్యకరం! అంటే ఎటువంటి అమోఘమైన విజ్ఞానం మనం కోల్పోవడం ద్వారా ఎందుకు ఈరోజు మన సామజిక, వివాహ, కుటుంబ వ్యవస్ధ చిన్నాభిన్నం అయిపోతుందో, స్త్రీల జీవితాలు గృహ హింస ద్వారా, అత్యాచారాల ద్వారా ఎందుకు నలిగిపోతున్నాయో అర్ధంచేసుకోవచ్చు!


*సేకరణ:- శ్రీ జి.టి.ఎస్. ఆచార్యులు గారి వాట్సాప్ పోస్ట్.* 

🌹🌹🌹🙏🙏🙏

కామెంట్‌లు లేవు: