భారతీయ పూజలలో భాగమైన పసుపు, కుంకుమలు ఎంత గొప్ప పాత్ర పోషిస్తాయో అదే విధంగా హారతి ఇవ్వడం కూడా అందే విధంగా ప్రధాన పాత్ర పోషిస్తుంది మన పూజా విధానంలో. అసలు దేవునికి హారతిని ఎందుకు ఎప్పుడు ఇస్తారు. కర్పూరానికి రెండు సుగుణాలు ఉన్నాయి. ఒకటి ఎలాంటి అవశేషమూ మిగలకుండా దహించుకుపోవడం. రెండోది సుగంధాన్ని, ప్రకాశాన్ని వెదజల్లడం. బహుశా మనిషి జీవితం కూడా ఇలాగే సాగాలన్నది దీనివెనుకున్న ఆంతర్యం. భక్తుడు ఎలాంటి కర్మ ఫలమూ మిగలకుండా, మోక్షం వైపుగా సాగిపోవాలనీ.. జీవిత పరమార్థాన్ని దీని ద్వారా తెలియజేసారు మన పెద్దలు. ఈ విషయంగా ఎప్పడన్నా ఆలోచించారా? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాల గురించి తెలుసుకోవాలంటే..
పూజ చేయడం అనేది భగవంతుని యందు మనసు లగ్నం చేయడానికి చేసే ప్రక్రియను పూజ అంటారు. దీనికి గాను పసుపు కుంకుమలు ఎంత తోడ్పడతాయో హారతి ఇవ్వడం కూడా దేవుని ఆరాధనకు అంతగానే ఉపయోగ పడుతుంది. మనస్సులో పూజ ముగిసిందనే ఆలోచన రాగానే గంట మోగిస్తూ దేవుని ఆహ్వానించి హారతిని వెలిగిస్తాము. సవినంగా భగవంతునికి మ్రొక్కుతూ మనస్సును ఆయన అందు లగ్నం చేసి హారతిని ఇస్తూ ప్రార్థిస్తాము. అక్కడితో పూజా విధానం సంపూర్ణం అయినట్టుగా భావిస్తాం ఇదంతా జరిగాక మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఒకప్పుడు ఆలయాల్లో ఎలాంటి వీద్యుత్తు దీపాల సౌకర్యం ఉండేది కాదు. పైగా గాలి కూడా చొరబడని రాతితో ఆ నిర్మాణాలు ఉండేవి. అలాంటి ప్రదేశాలలో తేమ అధికంగా ఉండటం సహజం. దీంతో దుర్వాసన, సూక్ష్మక్రిములు దరిచేరక తప్పదు. కర్పూరానికి సూక్ష్మక్రిములను సంహరించే శక్తి, అంటువ్యాధులను నివారించే గుణం ఉన్నందువల్ల కర్పూరంతో హారతిని ఇవ్వడం, దేవాలయం ప్రాంగణంలో కర్పూరాన్ని వాడటం వంటివి చేస్తున్నారు. అయితే కర్పూరాన్ని చెట్ల నుంచి సేకరిస్తారు. చాలా రకాలుగా ఫలపుష్పార్చనకూ, ధూపదీపాలకూ పూర్తిగా వృక్షాల మీదే ఆధారపడేవారు. పూజ విధానం అంతా ప్రకృతి సిద్ధంగానే సాగేది.
శక్తి, స్పర్శా,,
భగవంతుడికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకోవడం సహజం. ఈ ప్రక్రియతో కళ్లకి చలువ చేసే మాట అటుంచి, భగవంతుని మూలవిరాట్టుని నేరుగా తాకలేము కాబట్టి, ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది. హారతితో పాటుగా ఘంటానాదాన్ని చేయడం సహజం. కళ్లు మూసుకుని హారతిని అద్దుకోవడం ద్వారా మనసు, చెవులు, ఆఘ్రానించే శక్తీ, స్పర్శా...ఇన్ని ఇంద్రియాలు భగవంతుని ధ్యానంలో లగ్నమవుతాయి.దీనికోసమే ముఖ్యంగా పూజా విధానంలో హారతి ముఖ్యమైన భాగం అయింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి