" "మీ పిల్లల పెంపకంలో మీరు వైఫల్యం చెందుతున్నారరా? మీ పిల్లలు మీ మాట వినడం లేదా? పేచీలు పెడుతున్నారు? అది మీకు పెద్ద సమస్యగా ఉన్నదా? "అయితే ఓపికగా పూర్తిగా ఈ విషయాలు చదవండి". (సేకరణ & సమర్పణ:- "మజుందార్,బెంగళూర్,Cell No: 87925- 86125". " నేడు ఈ సమాజంలో పిల్లలకు పూర్తి "స్వేచ్ఛ" ఇచ్చుచున్నారు. పిల్లలు వారి గోల్స్ మీకు చెబుతారు. మీ పిల్లల ఫెయిల్యూర్స్ కి బాధ్యత ఎవరి మీద కో త్రోసి వేయుచున్నారు. అవును కదా! అసలు మీ పిల్లలు ఎక్కువ సమయం ఎవరి వద్ద గడుపుతున్నారు? కొన్ని సంవత్సరాల కిందట ప్రభుత్వం జంతువులను సర్కస్ కంపెనీలో హింసకు గురి చేస్తున్నారని వాటిని సర్కసు యందు ఉపయోగించరాదని నిషేధం విధించినారు. అప్పుడు బెంగాల్ రాష్ట్రములో సర్కస్ కంపెనీ వారు తమ వద్ద ఉన్న పది (10)పులుల ను అచట అడివి యందు వదిలి వేసినారు. ఆ 10 చిరుతపులు లను వేట కుక్కలు తరిమి కొట్టి చంపి వేసినవి. వాటికి ముఖ్య కారణం"Life skills" నేర్పించలేదు. అలాగే మన పిల్లలకు గారాబంగా కష్టపడకుండా ఏసీ స్కూల్స్ రూములు, ఏసీ బస్సులు, అక్కడే భోజనం, వారు సుఖంగా ఉన్నారు అని ఊహించు కోను చున్నారు. వీరు చదువును కొను చున్నారు. కాని చదువుట లేదు. పేద వాళ్ళ స్థితిగతులు, గ్రామీణ వాతావరణం, ప్రకృతి సౌందర్య ఆరాధన, వారికి తెలియదు. న్యూట్రల్ ఫ్యామిలీస్ వల్ల , మానవ సంబంధాలు, సేవా దృక్పథం, మానవత్వం, ధైర్యం, పట్టుదల, వినయ విధేయతలు మొదలగు అనేక విషయాలపై అవగాహన, ఆలోచన, పరిశీలన, అవసరం కానీ లేక సామాజిక బాధ్యతలు, మానవత్వం లేకుండా వారి తల్లిదండ్రులు పిల్లల కొరకు పడే కష్టం, తపన, డబ్బు విలువ, సమయము విలువ, తెలియకుండా, ఒకరిపై ఆధారపడి జీవించే తత్వము పై జీవిస్తున్నారు. స్వతంత్ర భావాలు సన్నగిల్లుతున్నాయి. సరియైన నాయకత్వ లక్షణాలు ఏ కోశానా ఉండుట లేదు. ఈ పిల్లల వయస్సును చిన్నతనములో మూడు (3) భాగాలుగా విభజించవచ్చు. వాటిని గురించి ఈ విధముగా తెలుసుకుందాం. .1 Zoun :(0-- 5 Yrs. పిల్లలు) :- " వీరిని తల్లితండ్రులు దేవుడిలాగా, మల్లె పువ్వులా సుకుమారంగా చూడాలి! మీరు ఈ వయసులోనే పిల్లలను బెదిరించారా? ఇంతే సంగతులు ,వాళ్ళు అదేవిధంగా మారతారు. జాగ్రత్త సుమా! వారిని మీరు పూర్తిగా ఫ్రీగా వదిలిపెట్టండి. కలియతిరుగుతూ "అబ్జర్వ్" చేస్తాడు. ఆ వయసు వాడు ప్రేమ కోరుకుంటాడు. "ప్రేమనగర్" సినిమా లో ఆయాని( దాది) అమ్మా అని అంటాడు. చూశారు కదా! మీరు వారిని భయపెట్టే మాటలు ఏవి చెప్పకండి? ఈత కొట్టుట, గోడ ఎక్కుట, చెట్టు ఎక్కుట, సైకిల్ తొక్కుట, దూకుట, ఎగురుట, అల్లరి ఎంత చేస్తే, అంతా చెయ్యనివ్వండి? స్వేచ్ఛ ఇవ్వండి, జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోండి, ఆపదలు రాకుండా అది మాత్రమే మీ వంతు బాధ్యత ,కర్తవ్యం అని తలచండి, ఆటలు ,పాటలు, ఆ వయసులో వాడికి లోకం అదే ! వారిని ప్రోత్సహించండి? దీనికి హద్దులు పెట్టకండి, వాడు ఎంత విహరిస్తే అంత గొప్పవాడు అవుతాడు? (ఒక పిల్లల మనస్తత్వ శాస్త్రవేత్త అంచనావేసి చెప్పిన విషయము) 2 nd Jone (06 -- 12 Yrs, పిల్లలు) :-- " వీరి విషయములో చాలా అప్రమత్తంగా (careful) గా treatment చేయాలి? ఆ వయస్సు లోని పిల్లలను హేళన చేయుట, సిగ్గుపడే విధమైన మాటల తో చులకన చెయ్యకండి. ఇంటికి వచ్చిన బంధు మిత్రుల వద్ద వారిని తక్కువ చేసి మాట్లాడుట చేయకండి. ఇది వాళ్ళ జీవితానికి "టర్నింగ్ పాయింట్" అని గుర్తించండి. మీ పిల్లవాడి విషయం నీకు ఏమి తెలుసు, వారి భవిష్యత్తును మీరు ఎట్లా అంచనా వేస్తారు? Positive thinking తో తప్పా ఎప్పుడు "negative thoughts" తో మాట్లాడవద్దు. ఈ వయస్సు వారి జీవితానికి అత్యంత విలువైనది. దానిని మీరు బాగా చేసినా? చెరిపిన మీరే దానికి బాధ్యులు ,కారణం కనుక అత్యంత శ్రద్ధ తీసుకోండి దయచేసి,. ఈ దేశ బావి భవిష్యత్తు వారి మీదే ఆధారపడి ఉంది. అందుకే నేటి మన కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక శ్రద్ధతో "దేశభక్తి" ఉన్నత విలువలు గల సమర్థవంతమైన ఆలోచనతో నాయకత్వ లక్షణాలతో ఈ దేశం ముందు ఉండాలని ఎంతో ఉన్నత విలువలు గల పాఠ్య ప్రణాళిక , బోధన, సిబ్బందిని తగిన విధముగా శిక్షణ ఇచ్చుటకు "నూతన పంధా తో దేశమంతటా ఒకే పాఠ్యప్రణాళిక" రూపొందించుటకు గాను కంకణం కట్టుకుంది. ఈ వయస్సు పిల్లలను దండించ కూడదు. ఏటువంటి పరిస్థితిలో నైనా " మిలట్రీ ట్రీట్మెంట్" ఇవ్వాలి. అవమానించిన గెట్టిగా ఫీల్ అవుతాడు. మీ పిల్లలను వేరే పిల్లలతో పోల్చకండి. Instant చేయరాదు. పిల్లలను స్నేహితులుగా చూడాలి. వారిలో ఆత్మవిశ్వాసం కలగజేయాలి. వాడు ఏ పని చేసినా "Super" అని. "Good Job" అంటూ మెచ్చుకోలు మాటలే మాట్లాడండి. నీవు ఇంకా బాగా చదవగలవు? ఇంకా బాగా గుండ్రముగా రాయగలవు ?ఇప్పుడు రాసింది కూడా బాగుంది, ముందు మెచ్చుకోండి ?ఆ తరువాత సూచన చెప్పండి .తిరిగి మళ్లీ మెచ్చుకోండి? ఈ పద్ధతి వాడండి? స్ఫూర్తి , ఉత్సాహము, పోత్సాహము, ఆసక్తి కలుగజేయుట మీ విది. Weekend లో మంచి ప్రదేశాలు తిప్పండి, ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఇవ్వండి. పెన్ను ,పుస్తకము ఇచ్చి ఎలా ఉంది నీకు ఎలా అనిపించింది రాయమని కోరండి? అడగండి, మంచి పదాలు చెప్పి ప్రోత్సహించండి? చిన్నతనము నుండి "ఫీడ్బ్యాక్ "ఇచ్చుట అలవాటు చేయండి. ప్రేమించుట నేర్చుకో గలడు, అసూయ, ద్వేష భావం రాదు. మానసిక పరిపక్వత వస్తుంది. మీకు అనుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. మా నాన్న నాకు ఫ్రెండు అని ఊహించుకుని ఉంటాడు. మీరు న్యాయం గా ఉండాలి. కష్టం లేకుండా పెంచినా, మీరు పడే కష్టం ,డబ్బు విలువ తెలియజేయండి. పొదుపు చేయుట, స్వతహాగా సంపాదనకు మార్గాలు అన్వేషణ మార్గము సూచించి బోధ పరచండి. , ఈ క్రింది సూచనలు పాటించండి-- నడుచుకునే విధంగా చేయండి. ,1) TIME :-- "తగిన సమయం ఇవ్వండి. స్కూలు నందు ప్రతి పేరు ఏమి జరిగింది ఏ సబ్జెక్టు చెప్పారు. ఏ హోమ్ వర్క్ ఇచ్చినారు. మీ క్లాస్ టీచర్ ఏ పాఠం చెప్తారు. నీకు బాగా అర్థం అయ్యిందా? నేను ఏమైనా నీకు హెల్ప్ కావాలా? నన్ను అడుగు, నిద్రపోయే ముందు రామాయణ, భారత, భాగవత , నీతికథలు ,. స్వాతంత్ర సమరయోధుల గురించి, world map, India map, కొని ఇవ్వండి .వాటి మీద రోజు అవగాహన, సమీక్ష చేయండి. వారిని ఇన్స్పైర్ చేయండి. వారు మంచి కలలు కంటారు, దానికి తోడ్పాటు ఇవ్వండి? వారి Goles(లక్ష్యం) తెలుసుకోండి? Imagination కల్పించండి. Doctor lawyer ,Bank, ఐఏఎస్ అధికారి, వారికి "Goles "కు సంబంధించిన items కోని Bed వద్దా కనపడు లాగునా ఉంచండి. 2) "teach":-- (బోధన) " ఏ స్కూలు నందు చేర్చాలి. మేనేజ్మెంట్ వారు ఎవరు? వారి గురించి వారు అన్యువల్ డే సెలబ్రేషన్ చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలిచారు అనేది అంచనా వేయండి, అక్కడ పరిస్థితులు, సమీక్షించి, మీరు స్కూలుకు వెళ్ళినా మీ పిల్లవాడి టీచర్ వద్ద మీరు చాలా గౌరవం ,మర్యాద, భక్తిభావంతో ఉండండి. మీ పిల్లవాడు కూడా చూసి నేర్చుకుంటాడు. 3) Touch (ఆత్మీయ స్పర్శ) :-- భుజం మీద చెయ్యి వేసి ,నవ్వుతూ పలకరించి ఉండండి. 4)Trust(నమ్మకం):--మీ పిల్లవాడి చెప్పే మాటలు నమ్మండి, కుర్రవాడికి నమ్మకం కలిగించండి. తెలియకుండా నిఘా పెట్టండి. 5) Truth(నిజం):-- నిజమైన, వికాసైన అయిన మాటలు, చెప్పండి. "ప్రపంచ వింతలు". చెపుతూ ఆసక్తికర గా చేయండి. "మోటివేషనల్ స్టోరీస్," "కొటేషన్స్" చెప్పండి. 6)Talk(మాట్లాడుట) :-- మాటల ద్వారా మంచి విషయ పరిజ్ఞానం అందించండి . మానవ సంబంధాలకు ను తెలియపరచండి. మీ బంధుమిత్రులను వచ్చిన వారితో ఎలా మెలగాలో నేర్పండి, మీరు ఆచరించిన వారే నేర్చుకోగలరు. 3rd Zone (13 Yrs to 19 yrs):-- 1)ఈ వయసు పిల్లలు "టీనేజ్ "అని అందురు. ఈ వయస్సు పిల్లలను ఫ్రెండ్స్గా feel చేయుట పేరెంట్స్ యొక్క ముఖ్య కర్తవ్యం. Be Friend Ship -- Food Habits జాగ్రత్తలు అవసరం. 2) "section of friends :-- " మనం వారిని ఐడెంటిఫై చేయాలి . వారిని 4 రకాల ఫ్రెండ్స్ కల్చర్ గా చెప్పాలి ఇక్కడ, ఈ విషయాలను మీ పిల్లలకు సరైన అవగాహన కల్పించండి.1 I am winnar -- You are Winner. ఈ కోవలోని వారు అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. 2) I am winnar -- you are Looser. వీరు చాలా danger , మోసం దగా ఒత్తిడి చేసే వారై ఉంటారు. 3)" I am Looser -- You are Losser, కూసే గాడిద వచ్చి మేసే గాడిదని పాడు చేసింది అనే సామెత. దొందూ దొందే, ఇలాంటి స్నేహితుల వల్ల ఉపయోగం లేదు అపకారము లేదు. 4)" I am Looser -- you are Winner. (ఇలాంటి స్టేజీలో నేడు పేరెంట్స్ ఉంటారు. విడమర్చి చెప్పాలి. మొక్కై వంగనిది మానై వంగునా? ( టీచరు తల్లిదండ్రుల మాట పిల్లల వినకపోతే). అసలైన సిసలైన సరి అయిన పద్ధతి అయిన ముఖ్యమైన విశేషం నేటి సమాజంలో పిల్లలకు నీతులు చెప్పి, పెద్దలు ఆచరించరు? ఆలోచించండి ? మీరు ఒకసారి! 1) మీరు ప్రతి రోజూ రెండు సార్లు బ్రష్ చేసి, మీ పిల్లలకు చెప్పండి? 2)"మీరు ప్రతిరోజు సూర్యుడు ఉదయించే వేళ కు ముందే లేచి (06-00 ఉదయం) మీ పిల్లలకు లేవమని చెప్పండి? 3)" తల్లిదండ్రులు మీ పిల్లల ఎదుట వాదు లాకోవటం, గట్టిగా తర్కించుకొనుట, ఇలాంటివి చేయకండి తరువాత మీ పిల్లలకు చెప్పండి? 4) మీరు టీవీ ,మొబైల్, చూస్తూ-- మీ పిల్లలకు చూడొద్దని చెప్పండి? 5)" మీరు వాళ్ళ స్కూలు టీచరును, మేనేజ్మెంట్ ను గౌరవించిన, మీ వాడు కూడా విన గలడు.? 6)" మీ పిల్లవాడు అన్నం తినకుండా కోపం ప్రదర్శించుట మీరు ఒకటి రెండుసార్లు చెప్పండి ,అప్పుడు మీరు కూడా అన్నం తినుట మానివేయండి. అప్పుడు అమ్మ ప్రేమ వల్ల తింటాడు. దారికి వస్తాడు. 7) nature is the greatest test book అన్నారు. పకృతి సిద్ధమైన గార్డెన్స్, వాటర్ ఫాల్స్, కోటలు, జూ పార్క్ లకు పిల్లలతో సందర్శించండి. వారికి అవగాహన కలిగించుటకు పెన్ను పేపరు లేదా బుక్ ఇచ్చి రాయంచడి. 9) పిల్లి తన పిల్లలను 7 ఇల్లు తిప్పి తగు జాగ్రత్తలు తీసుకొని గొంతును పట్టుకొని మెత్తగా జాగ్రత్త తీసుకుని తిరుగు తుంది కదా! ప్రాక్టికల్ అవగాహన కలిగించుటకు మీ పిల్లలను పోస్టాఫీసు, రైల్వేస్టేషను, బ్యాంకు, ఫైర్ స్టేషన్ ,పోలీస్ స్టేషన్ ,కోర్టు, కలెక్టర్ ఆఫీస్, బస్టాండ్, ఎయిర్పోర్ట్, వెజిటబుల్ మార్కెట్ ,లకు తిప్పండి , అచ్చట జరుగు కార్యకలాపాలను , వివరంగా ఈ విశధం గా చెప్పి అర్థమయ్యే విధంగా బోధ పరిచి వారికి వచ్చిన అనుమానాలను తీర్చండి .వారు చూసిన దృశ్యం రూపకమైన వాటి మీద అవగాహన, తో పాటు హృదయములో " ముద్ర" పడును. 10) ఫ్యాషన్ (అభిరుచి) పాడుట,ఆడుట, డాన్స్, లాంటి విషయాలపై బేసిక్ నాలెడ్జి నేర్పండి. వారి అభిరుచికి తగినట్లు తగు శిక్షణ, నైపుణ్యం ,ఇచ్చుటకు తగు ఏర్పాట్లు చేయండి. నేడు సమాజంలో" చెడుకు" ఎక్కువ ప్రోత్సాహము ఎక్కువ, ఆకర్షణీయముగా కూడా ఉండును. మంచి విషయాలకు తోడు నీడ వచ్చే వారు చాలా తక్కువ, కావున మీ పిల్లలు వాటి గురించి ప్రశ్నించవచ్చు ? మీరు వారికి నిరాశ పడవద్దు నీ చుట్టూ వారి గురించి నీవు ఆలోచించవద్దు. నీలో ఉన్న విషయము సత్తా ముఖ్యము. నీవు నీ జీవితం నీ ఇష్టం అని చెప్పండి. దానిని సరైన పంథాలో నడిపించును. రేడియో ఊహా శక్తికి దోహదం చేసే సాధనం ఇది మంచిది. రోజూ పేపరు చదువుట అలవాటు చేయండి. పిల్లలకు శ్రమ పడుట లోని విలువలు నేర్పాలి. అత్యున్నతమైన విలువలు మారటానికి నిజాయితీ మంచిని ప్రోత్సహించండి. మెదడుకు మేత చే ఇండోర్ & అవుట్ డోర్ ఆటలు ఆడించండి. విలువలు కలిగిన జీవితానికి సోపానం వేయాలి. అంతర్గత రూపానికి విలువ ఇవ్వటం నేర్చుకోవాలి. పంచుకుని తినుట లోని ఆనందమును తెలియజేయండి. మనం మన సంపదను సమాజంలో నుంచి సృష్టించుకున్న సమాజానికి కొంత తిరిగి ఇవ్వడం మన బాధ్యత, కర్తవ్యం, అని తెలియ పరచండి. చట్టాలను గౌరవించుట, నైతిక విలువలను పాటించుట. ఆధ్యాత్మిక దృష్టికోణంలో, వారిని ఉన్నతమైన "భారతదేశపు" సంస్కృతి, సంప్రదాయాలను, ఆ పాడే వ్యక్తిగా తీర్చిదిద్ది ఈ సమాజానికి మీ వంతు బాధ్యత నెరవేర్చండి. Mobile మిమ్ములను శాసించి వాడుకుంటుంది మీ సమయాన్ని, కానీ మీరు ప్రపంచ జ్ఞానం, Mobile ను మనం ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోని, నేర్పండి. ఇది ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవలసిన నేర్చుకో దగ్గ విషయాలు, చాలామందికి తెలుసు కానీ గుర్తు చేయటం కొరకు మాత్రమే చెప్పడమైనది. ". ఈ విషయాలు ఉపయోగపడతాయని అనిపిస్తే "షేర్" చేయండి. ". ఇది కేవలము తల్లిదండ్రుల యొక్క హితము కోరి మాత్రమే రాయబడినది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి