25, అక్టోబర్ 2020, ఆదివారం

శ్రీ ప్రహ్లాద భక్తి

 *\!/ ఓం నమో వెంకటేశాయః.\!/* 

 **_అందరికీ  శుభోదయం...**_ 

         *నారసింహ విజయము* 

+++++++++++++++++++++

                 శ్రీ ప్రహ్లాద భక్తి    

************************

187  శ్లోకము   కొనసాగింపు  

**************************

"శోణిత పంకాంకిత కేసరుండును నై ప్రేవులు కంఠమాలికలుగ ధరించి కుంభికుంభ విదళనంబు చేసి చనుదెంచు పంచాననంబునుం బోలె, దనుజకుంజర హృదయకమల విదళనంబు చేసి, తదీయ రక్తసిక్తంబు లైన నఖంబులు సంధ్యారాగ రక్తచంద్రరేఖల చెలువు వహింప సహింపక, లేచి తన కట్టెదుర నాయుధంబు లెత్తుకొని తత్తఱంబున రణంబునకు నురవడించు రక్కసులం బెక్కుసహస్రంబులం జక్రాధిక నిర్వక్రసాధనంబుల నొక్కనిఁ జిక్కకుండం జక్కడిచె; ని వ్విధంబున."


 *భావము* : “ నెత్తురుతో తడసి ఎఱ్ఱబారిన మెడజూలుతో; భయంకరంగా ఆ దానవ రాజు ప్రేగులు కంఠమాలికలులా వేసుకున్న మెడతో ఆ ఉగ్ర నరసింహుడు దర్శనమిచ్చాడు. ఆ దేవుడు ఆ దానవుడి హృదయకమలం చీల్చి వేసి, మదగజేంద్రుడి కుంభస్థలం చీల్చి చెండాడిన సింహరాజులాగా విరాజిల్లుతున్నాడు; రక్తంలో తడసిన ఆయన గోర్లు సంధ్యారాగ రంజిత చంద్రరేఖల వలె ప్రకాశిస్తున్నాయి; ఆ రూపం చూసిన రాక్షస వీరులు కోపాలు పట్టలేక వివిధ ఆయుధాలతో ఆ రాక్షసాంతకుని మీదకి దండెత్తి వచ్చారు; అలా వచ్చిన పెక్కువేల రక్కసులను వచ్చిన వారిని వచ్చినట్లే చక్రాది ఆయుధాలతో ఒక్కడిని కూడా వదలకుండా వధించాడు ఆ ఉగ్ర నరకేసరి.”


+++++++++++++++++++++

 *విష్ణుసహస్రం* .... అర్థం, పరమార్థం.

+++++++++++++++++++++

591) గోహిత: - భూమికి హితము చేయువాడు.

+++++++++++++++++++++

 *ఈ ఉదయం శ్రీహరి కీర్తన* 

+++++++++++++++++++++

" శేష శైల గరుడాచల   "

+++++++++++++++++++++

కామెంట్‌లు లేవు: