*పురుషసూక్తమ్*
*(21) ప్రజాపతిశ్చరతి గర్భే అంతః*
*అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిమ్*
*మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః*
తా" భగవంతుడు ప్రపంచంలో క్రియాశీలుడై మరలుతున్నాడు. జన్మలేనివాడుగా ఉంటూనే ఆయన అనేక రూపాలతో ఉద్భవిస్తున్నాడు. ఆయన నిజస్వరూపాన్ని మహాత్ములు చక్కగా ఎరుగుదురు. బ్రహ్మవంటి వారు సైతం మరీచి మొదలైన మహాత్ముల పదవిని ఆకాంక్షిస్తున్నారు.
(భగవదనుభూతి విశిష్టత ఇక్కడ ప్రస్తావించబడింది. మానవుడు పొందదగిన పదవులలో అత్యున్నతమైనది బ్రహ్మపదం. కోట్లాది సం"లుగా కొనసాగే మహాప్రళయ సమయంలో, అంటే ఈ సృష్టి అంతానికి వచ్చినప్పుడు ఆయన పదవీకాలం కూడ సమాప్తమవుతుంది. కాని భగవదనుభూతి పొందిన, ముక్తుడైన మహాత్ముల స్థితి అటువంటిది కాదు. *బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి* భగవంతుణ్ణి తెలుసుకొన్నవాడు భగవంతుడే అవుతాడు. అతడికి మరణం లేదు, వినాశం లేదు. అందుచేతనే బ్రహ్మవంటి దేవతలు సైతం భూలోకంలో ఋషులై ఉండ అభిలషిస్తారు. అందుచేత మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తీ భగవంతుణ్ణి అన్వేషించాలి. ఇదే ప్రశంసనీయమైన కార్యం.)
******************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి