Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 38 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
‘కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుదయాన్వితా’
మాటలో మర్యాద ఎలాఉంటుందో చూపిస్తు వశిన్యాది దేవతలు అమ్మా! నువ్వు మా తల్లివి నీ తొడల సౌందర్యము నీ భర్తయిన మహాకామేశ్వరునికి ఒక్కడికే తెలుసు అని ఆ నామమును ఎంతో అందముగా చెప్పారు. ఈ బ్రహ్మాండమే అమ్మ స్వరూపము అయినప్పుడు సృష్టిలోని ఏ శరీరము ఆమె సౌందర్యముతో తులతూగలేదు.
శంకరాచార్యులు అమ్మవారిని ‘విధిజ్ఞే’ అని పిలిచారు. విధిజ్ఞ అనగా చేయవలసిన విషయాలు బాగా తెలిసి ఉన్నపిల్ల. భార్య మొదటి లక్షణము భర్తను గౌరవించడము. ఒక ఆడపిల్లకు ఇంతకన్నా గొప్ప పేరు లోకములో ఉండదు. అమ్మవారు తన కర్తవ్యము బాగా ఎరిగి భర్తను గౌరవిస్తుంది. ఈ శ్లోకములో అమ్మవారు భర్తను ఎలా గౌరవిస్తుందో చెపుతున్నారు. దానికి ఆయన ఎంతో అందమైన ఉపమానములు చెపుతున్నారు. అమ్మా ! లోకములో అరటిచెట్లు ఉంటే వాటే వాటి బోదెలు ఎలా ఉంటాయో అటువంటి తొడలు కలిగినదానివి. ఐరావతము అనే ఏనుగు తొండము వంటి తొడలు కలిగినదానివని నేను అన్నాను కానీ అమ్మా బంగారు అరటిచెట్ల సౌందర్యము, ఐరావతము యొక్క తొండము సౌందర్యము నీ రెండు ఊరువుల సౌందర్యము తిరస్కరించ కలిగింది. నీ మోకాళ్ళు గుండ్రముగా ఉన్నాయి. నీ మోకాళ్ళు మాత్రం గరకుగా ఉన్నాయి. ఆ విషయములో నీ మోకాళ్ళు ఐరావతం కుంభస్థలం గరకుగా ఉంటుంది. తొండము కూడా ముట్టుకుంటే గరకుగా ఉంటుంది. అమ్మా! నీ మోకాళ్ళు ఎర్రగా గుండ్రముగా ఉన్నాయి. అవి నల్లబడి పెచ్చుకట్టి ముట్టుకుంటే ఇంత గరకుగా ఉన్నాయేమిటి? అనిపించేట్లు ఉన్నాయి. ఎందుకు అనగా నువ్వు కర్తవ్యము బాగా తెలిసినదానివి. స్త్రీ భూమి మీద సాష్టాంగనమస్కారం చేయకూడదు కనక నువ్వు ప్రతిరోజు పరమశివుడు కనపడగానే మోకాళ్లను నేలకు తాకించి వంగి నువ్వు పెట్టుకున్న బొట్టు శివుని పాదముల మీద ముద్రపడేట్లుగా నమస్కారము చేస్తూ ఉంటావు. అసలే సుకుమారమైన తల్లివి. అందువలన నీ మోకాళ్ళు గరకుగా అయిపోయాయి అన్నారు.
ఆ భావనతో నిలబడటము చేతనైననాడు వాళ్ళను అమ్మ పరవశించి ఒక బిడ్డలా తన వడిలో కూర్చోపెట్టుకుంటుంది. ఇంకొక జన్మ ఎత్తవలసిన అవసరము లేని స్థితిని, ఈ జన్మలో సమస్తమయిన సుఖములను అనుగ్రహిస్తుందని చెప్పడము శంకరుల ఉద్దేశ్యము. జగద్గురువులు, మహాపురుషులు, లోకానికి సందేశము అందించవలసిన బాధ్యత ఉన్నవారు కనక అంత గొప్ప శ్లోకాన్ని మనకి అందించారు.
https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి