25, అక్టోబర్ 2020, ఆదివారం

సంపూర్ణ క్రియాశీలత్వం

 సృష్టి అవసరాలు తీర్చడం వల్లా.., సంపూర్ణ క్రియాశీలత్వం వల్ల ఈశ్వరున్ని సంపద అనెడి ఐశ్వర్యం సేవిస్తూ ఉంటుంది.


5) జ్ఞానంఈశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వం - సర్వశక్తిమత్వమే సర్వజ్ఞత్వానికి కారణమౌతుంది.తత్వశాస్త్ర దృష్ట్యా జ్ఞానం అనేది పొందబడేది ... కోల్పోయేది కాదు. అది ఎప్పుడూ ఉండేది. అది ఆత్మ స్వరూపంగా ఉంటుంది.దాన్ని మనకున్న ఏకాగ్రతను బట్టి కొంచెం కొంచెంగా అనుభవంలోకి తెచ్చుకుంటాము.ఒక వ్యక్తిలో ఉన్న ఏకాగ్రత శక్తిపైన అతని జ్ఞానం ఆధారపడి ఉంటుంది.ఏ విషయంలో ఏకాగ్రత చూపుతాడో ఆ విషయ సంబంధ జ్ఞానం లభిస్తుంది.ఏకాగ్రత సంపూర్ణ స్థాయికి చేరినపుడు సంపూర్ణ జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. అలాంటి వ్యక్తులను ఆత్మజ్ఞానులు అంటాము. వారి వ్యక్తిగత చైతన్యం విశ్వ స్థాయికి ఎదగడం వల్ల వారికి కూడా సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది.ఈ విశ్వంలోని సమస్త నియమాలను సృష్టించి ఒక నియతిని ఏర్పాటు చేయడం వల్ల ఈశ్వరునికి నియంత అనే మరో పేరుంది.ఆ నియమాలపై ఏకాగ్రత నిలిపి పరిశోధించడాన్నే మనం శాస్త్ర విజ్ఞానం అంటున్నాము.ఇలా సర్వవ్యాపకుడు - విశ్వరూపుడు - నియంత అయిన ఆ పరమాత్మను జ్ఞానం అనెడి ఐశ్వర్యం సదా సేవిస్తూనే ఉంటుంది.


6) వైరాగ్యంసంతృప్తితో కూడిన త్యాగమే వైరాగ్యం.ఈశ్వరునికి నిరంజనుడని పేరు.అంటే దేనికీ అంటకుండా కేవల సాక్షి మాత్రంగా ఉండే వైరాగ్య సంపన్నుడని అర్థం.వైరాగ్యం అనేది సమృద్ధిని దాటిన స్థితి.హిమాలయాల్లో "పరుసవేది " అనే మూలిక ఉంటుందట. ఆ వేరుతో ఏ లోహాన్ని ముట్టినా ఆ లోహం బంగారంగా మారుతుందట. అలాంటి పరుసవేది ని కలిగి ఉన్న వ్యక్తి గుట్టలు గుట్టలుగా బంగారాన్ని ప్రోగుచేస్తాడా?ఆ వేరును మాత్రం దగ్గరుంచుకుని అవసరమున్నంత వరకే వాడుకుంటాడు. అతనికి ధనాన్ని సంపాదించాలనే కోరిక - ఆశ వంటివి ఏమీ ఉండవు.అంటే ధన విషయంలో వైరాగ్యం లభించినదన్న మాట!అసంతృప్తితో - అశక్తతతో వచ్చేది వైరాగ్యం కాదు. అది లేమితనం - బలహీనత.ఒక నపుంసకుడు సన్యాసిగా మారితే అది వైరాగ్యం కాదు.ఒక నిజమైన పురుషుడు సన్యాసిగా మారితేనే అది నిజమైన వైరాగ్యం.మన దేశంలో చాలా మంది మిథ్యా వైరాగ్య సంపన్నులు ఉంటారు. నాకు ధనం మీద ఆశ లేదు అంటుంటారు. మళ్లి కష్టపడకుండా - తేరగా ధనం వస్తే సంతోషిస్తారు. ఒక కోటి రూపాయలు కష్టపడి సంపాదించి దానిపై బంధం లేకుండా సంతృప్తితో దానం చేయగలిగితే అది వైరాగ్యం అవుతుంది.వైరాగ్యం అనేది తేలికగా వచ్చే ఐశ్వర్యం కాదు. అది ఇంతకు ముందు చెప్పినట్లు సమృద్ధిని దాటిపోయిన స్థితి.ఎవరో కొందరు వివేకానందుడు లాంటి మహాత్ములు మాత్రమే నిజమైన వైరాగ్య సంపన్నులుగా ఉంటారు.


ఇక దేవునిది అన్ని విషయాల్లో సమృద్ధిని దాటిన స్థితి.కాబట్టి వైరాగ్యం అనెడి ఐశ్వర్యం అతడిని నిరంతరం సేవిస్తూ ఉంటుంది.ఇలా ఈ ఆరు ఐశ్వర్యాలను కలిపి 'భగ' అని పేరు. వీటిని కలిగి ఉండడం వల్ల భగవంతుడని పేరు.మనలో కూడా ఈ ఆరు ఐశ్వర్యాలు అంశ మాత్రంగా ఉంటాయి. మన ప్రవర్తనను బట్టి ఆయా ఐశ్వర్యాలు వృద్ధి పొందుతాయి.                    

 ************

కామెంట్‌లు లేవు: