రామాయణమ్ .168
...
సీతమ్మ ఇంకా హెచ్చరిస్తున్నది రావణాసురుడిని.
.
అధముడా !
ధర్మమునందే స్థిరమైన రాముని పత్నిని
నీవిక తాకనుకూడా తాకలేవు!
.
ఓరీ రాక్షసాధమా ఈ శరీరాన్ని బంధిస్తే బంధించావు ,చంపివేయదలచుకుంటే చంపివేయి
నా శరీరాన్నికానీ ప్రాణాన్ని కానీ రక్షించుకోవాలన్న కోరిక, ఆసక్తి నాకు ఏమాత్రమూ లేదు .
.
భూలోకములో అపకీర్తి కలిగేపని మాత్రము చేయనుగాక చేయను.
.
సీతామాత చాలా కోపంగా పరుషంగా మాట్లాడి కాసేపు ఊరకున్నది.
.
ఆవిడను భయపెట్టి అయినా సరే లొంగదీసుకోవాలనుకున్నాడు రావణుడు ,ఆవిడతో ఇలా అన్నాడు.
.
ఓ సీతా ! విను ,నీకు పన్నెండు మాసాలు మాత్రమే గడువిస్తున్నాను ఈ లోపు నా దారికి వచ్చి
నా దరిచేరినావా సరే!
లేని పక్షమున ఉదయపు అల్పాహారములో నీ మాంసము వండించుకొని తినగలను.
.
అని తీవ్రముగా బెదిరించి ,అక్కడ ఉన్న రాక్షస స్త్రీల తో ఏ విధముగానైనా సరే దీని గర్వాన్నిపోగొట్టండి ,సామ,దాన,దండోపాయాలు ప్రయోగించండి ,అని పలికాడు .
.
వాడు అలా అనటమే ఆలస్యం భయంకరాకారముగల స్త్రీలు సీతను చుట్టుముట్టి నిలిచారు.
.
సీతను అశోకవనమునకు తరలించి రహస్యప్రదేశములో ఉంచమని ఆజ్ఞ ఇచ్చాడు రావణుడు.
.
జనకునికొమరిత,
దశరధుని కోడలు ,
రామపత్ని ,
అతిలోకవీరుడైన లక్ష్మణుని వొదినగారు అలా నిస్సహాయంగా సుఖమును కోల్పోయి దుఃఖిస్తూ స్పృహకోల్పోయి అశోకవనమందు పడియున్నది.
.
అక్కడ రాముడు .....
.
NB.
.ప్రాణముపోతే పోయింది వెధవప్రాణము ,
కానీ విలువలు ఎంత గొప్పవి !
ఇదీ సీతమ్మ అంటే!
ఇదీ భారతీయ సంస్కృతి!
.
Height of a Woman' imagination in this country is SITHA AND SAVITHRI ..
.అని అంటారు స్వామి వివేకానంద !
.
వ్యక్తి సౌఖ్యమా? సమాజ హితమా? ఏది ముందు?
.
అంటే సమాజ హితానికే ప్రాముఖ్యత భారతీయ ధర్మశాస్త్రాలలో !
No room for INDIVIDUAL COMFORT .
SOCIETY IS ABOVE INDIVIDUAL.
.
ఇదీ భారతీయమ్!
.
రామాయణమ్ 169
...
మారీచుడిని సంహరించి వడివడిగా అడుగులు వేస్తూ గుండెల్లో ఏదో గుబులురేగుతుండగా పరుగెడుతూ వస్తన్నాడు రామచంద్రుడు. ఇంతలో ఎడమవైపునుండి భయంకరముగా నక్క ఊళవేసింది ! ఆ శబ్దము కర్ణకఠోరంగా ఉండి మనసులో శంకలు రేపింది !
.
సీత క్షేమమేనా?
.
ఆ ఆలోచన వచ్చినదే తడవు ఆయన నడకలో వేగం హెచ్చింది ! లోలోపల తర్కించుకుటున్నాడు ! ఆ మారీచుడు అలా అరచినందువలన సీత భయపడి తప్పకుండా లక్ష్మణుని నా వద్దకు పంపుతుంది .
ఒంటరి దానిని సీతను రాక్షసులు భక్షించి ఉండలేదు కదా !
.
మరల సీతను చూడగలనా ?.
.
ఈ ఆలోచన ఆయన మనస్సులో అంతులేని ఆందోళనకు కారణమయ్యింది .ఇంతలో మృగపక్షిసంఘాలన్నీ దీనంగా తనవైపే చూస్తూ కనపడ్డాయి !
.
సీత క్షేమమేనా?
.
అల్లంత దూరంలో తమ్ముడు లక్ష్మణుడు తనకెదురుగా వస్తూ కనపడ్డాడు.
.
సీత క్షేమమేనా ? ప్రశ్నించసాగింది రామయ్య మనస్సు!
.
లక్ష్మణుడు తనను సమీపించగనే ఆయన కుడిచేయి తనచేతిలోకి తీసుకొని,సీతను విడిచి వచ్చినావు నీవు ,ఎంత చెడ్డ పని చేసినావని పలికి ,అంతా సవ్యముగానే ఉంటుందికదా ? అని అనుమానం వ్యక్తంచేశాడు.
.
లేదు ,నాకు అశుభశకునాలు కనపడుతున్నాయి సీతక్షేమముగా ఉండి ఉండదు ,నశించిపోయి ఉంటుంది, నాకేమీ సందేహములేదు !
.
రాక్షసులు పన్నిన పన్నాగమిది .
.
సీత మరణించిఅయినా ఉండవలే
అపహరింపబడిఅయినా ఉండవలె!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి