💐💐💐💐💐💐💐💐💐
*విజయదశమి
💐💐💐💐💐💐💐💐💐
*ఆ దుర్గాదేవీ 9 రోజులపాటు రాక్షసులను వెంటాడి సంహరించిన రోజులివి. అందుకే మనం దీన్ని దేవీ నవరాత్రులుగా తొమ్మిది రోజులపాటు వేడుకలు జరుపుకుంటున్నాం. పదో రోజున రాక్షసులపై విజయం సాధించినందుకు విజయదశమి పండుగ నిర్వహిస్తున్నాం.*
*దశ రాత్రుల పండుగనే దశరా లేదా దసరా అని పిలుస్తున్నారు. పది తలల రావణాసురుడిపై రాముడు విజయం సాధించిన రోజు ఇదేనని, అందుకే ఈ రోజును ‘దస్ హరా’ అని జరుపుతున్నారని కూడా అంటారు. తొమ్మిది రోజుల నవరాత్రి పూజతో పునీతుడై జీవుడు దశమి తిథి పూజతో విద్యాశక్తి అనుగ్రహాన్ని పొందుతాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అదే విజయదశమి పూజ.*
*విజయాలకు కారకమైన దశమి విజయదశమి. విజయుడు (అర్జునుడు) విరాటరాజు కొలువులో ఉండి కౌరవ సేనలను ఓడించి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన రోజు కాబట్టి విజయ దశమి అయ్యిందని కూడా అంటారు. ఏది ఏమైనా చెడుపై మంచి విజయం సాధించిన రోజు.*
*మనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలోని దుర్గుణాలను తొలగించమని వేడుకోవడమే దుర్గా నవరాత్రుల పూజలోని అంతరార్థం.*
*అసత్యంపై సత్యం సాధించిన విజయం..*
*అధర్మంపై ధర్మ సాధించిన విజయం...*
*అధైర్యంపై ధైర్యం సాధించిన విజయం..*
*అందుకే మనకు ఇది ముఖ్యమైన రోజు...*
*విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుధిష్ఠిరః*
*అస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్*
*యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియాం*
*నందగోపకులేజాతాం మంగళాం కులవర్ధనీమ్*
*కంస విద్రావణకరీం అసురాణాం క్షయంకరీం*
*శిలాతట వినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామినీమ్*
*ఆశ్వనశ్యసితే పక్షే దశమ్యాంతరకోదాయే*
*సకాలో విజయోనామ సర్వకామార్ధ సాధకః*
*దశమ్యాంతునరైస్సమ్యక్పుజానీయపరాజితా*
*క్షేమార్ధం విజయార్ధంచకాలే విజయనామకే’*
*అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి..*
*ఆకలికొన్నవారి కడుపు నింపే అన్నపూర్ణ..*
*లాలించి పాలించే భ్రమరాంబ..*
*తప్పుచేస్తే దండించే దుర్గ..*
*మహిషాసురులని మర్ధించే మహంకాళి..*
*అమ్మలగన్న యమ్మ.. మేటి పెద్దమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ..*
*మనలందరినీ తన ఒడిలో పెట్టుకు కాపాడాలని..*
*మనకన్నిటా విజయాలన్నీ ప్రసాదించాలని కోరుతూ..*
*భయేభ్య స్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే..*
*దుర్గామత ఆశీస్సులతో..*
*అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ..*
*మీకు మీ కుటుంబ సభ్యులకు నవరాత్రుల మరియు విజయదశమి శుభాకాంక్షలు*
💐💐💐💐💐💐💐💐💐
*సమస్తసన్మంగళాని భవన్తు*
*ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు*
*శుభపరంపర ప్రాప్తిరస్తు*
*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు*
*లలితాపరమేశ్వరి అనుగ్రహ ప్రాప్తిరస్తు*
*లోకాసమస్తాః సుఖినో భవంతు*
*సర్వేజనాః సుఖినో భవంతు*
*మీ*
*దేవేంద్ర శర్మ*
💐💐💐💐💐💐💐💐💐
*విజయదశమి శుభాకాంక్షలు*
💐💐💐💐💐💐💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి