25, అక్టోబర్ 2020, ఆదివారం

తెలుగు మధువు

 మన తెలుగు మధువు లొలుకు

***************************

సీసం.


చిరు నవ్వు రూపుల జెలగు చుండెడి బాస

        బహు సూర్య కాంతుల బరగు బాస

పూర్ణ చంద్రుని బోలు ముద్దు వ్రాలుల నుడి

     బంగారు సింగార సిరుల ఒడి

సంగీత సౌలభ్య సాహిత్య సంపద

     లలరారు సెలయేటి లయల బాస

శ్రేష్టమై స్రష్టల కిష్టమై పుష్టున్న

      యతిశయంబగు భాష అమల భాష


గీతి.

దేశ దే శాలు మురిసే టి తీపి బాస

అన్ని దిక్కుల మ్రోగిన వన్నె బాస

వ్రాసినద దియె పలికెడి భవ్య భాష

అదియె మాతెల్గు మాపల్కు మధువు లొలుకు

........ రాఘవ మాస్టారు (కే దారి వీర రాఘవ)

కామెంట్‌లు లేవు: