22, ఏప్రిల్ 2023, శనివారం

ఆశ

 


                         *ఆశ*

                   ➖➖➖✍️


*ఆశయా బద్ధ్యతే జంతుః*

*కర్మణా బహుచింతయా*

*ఆయుః క్షీణం న జానాతి*

*తస్మాత్ జాగ్రత జాగ్రత*


*జీవులన్నియు ఆశకు లోబడిపోయేవే! ఆశకులోబడి చాలా పనులు చేస్తుంటాయి! కాని ఆయువు తరిగిపోతోందని మాత్రం గుర్తించవు. కనుక జాగ్రత్త సుమా..!*


*లోకంలో వారందరూ ఆశకు కట్టుబడిపోయేవారే!*


*ఆశ నాలుగు రకాలు:* 


*ఆశ, పేరాశ, దురాశ, నిరాశ.* 


*ధర్మబద్ధమైన ఆశతో జీవిస్తే ఇబ్బందులుండవు. కాని పేరాశ కుదురుగా ఉండనివ్వదు.* 


*ఆ తరవాతది దురాశ! ఇది అసలు చేరకూడదు.*


*తన అర్హతకు తగినది కావాలనుకునేది ఆశ.*


*తన అర్హతకు కానిదానిని కోరుకోవడం పేరాశ.*


*అర్హత, ధర్మంతో నిమిత్తం లేక సర్వమూ నాకే కావాలనుకోవడం దురాశ.* *దురాశకు పోతే తామే ఉండమనే విచక్షణ నశిస్తుంది.* 


*వీటికి ఉదాహరణలు ఎదురుగా కనపడుతున్నా నమ్మలేం.*

*ఏదో ఆశించి జరగకపోతే నిర్వేదం పొంది దిగజారిపోవడమే నిరాశ.* 


*అంతఃశ్శత్రువులు కమ్ముకొచ్చి, జ్ఞానం నశించి ఆయువు క్షీణిస్తోందని గుర్తించలేనితనం కలుగుంది.*


*దురాశ ఆయువును తీస్తుంది. ’దురాశ దుఖానికి చోటు’ అన్నది నానుడి.* 


*ఏ సమయంలో కూడా ఆయువు గడచిపోతోందనే ఆలోచన మాత్రం రాదు. పుట్టినరోజన్న సంబరమేకాని ఆయువు ఒక సంవత్సరం తగ్గిపోయిందన్న విచక్షణ ఉందదు…!*


*సంపదః స్వప్నసంకాశాః*

*యౌవనం కుసుమోపమం*

*విధుః చంచలమాయుషం*

*తస్మాత్ జాగ్రత జాగ్రత*


*సంపదలన్నీ స్వప్న సదృశాలు,                           యౌవనం పువ్వు లాటిది.                                 ఆయువు మెరుపు తీగలాటిది.                      కనుక జాగ్రత్త..!*.    


*కలిగి ఉండడమే సంపదన్నది నేటి మాటే కాదు, నాటి మాట కూడా!              కలిగి ఉండడం సంపదైతే అదేది? అరుదైన వస్తువులా? భూమి వగైరా ఆస్థులా? బుద్ధియా? అందరూ అనుకునే సంపద కలిగి ఉండడం అనేది చిన్నమ్మ కటాక్షమే!*


*ఈ తల్లి కటాక్షం బహు చంచలం. కొబ్బరికాయలోకి నీరు చేరినట్టు                            నేడు చేరుతుంది, రేపు కనపడదు.                     కలలో సంపద ఇలలో కనపడనట్టు, ఇలలో సంపద కూడా స్వప్నం లో లాటిదే!*        


*ఇక యౌవనమా అదెంతకాలం? యౌవనం పువ్వు లాటిదన్నారు,                        అంటే పువ్వు వాడిపోయినట్టు యౌవనమూ వాడిపోతుంది.                           ఆయువు ఎంతకాలమో తెలియదు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



       *జ్ఞానమార్గం చూపించే…*

                 *గురువు..!*

               ➖➖➖✍️


*గురువును భగవంతునికన్నా ఉన్నతంగా భావించే దేశం ప్రపంచంలో ఏదైనా ఉందీ అంటే అది హిందూదేశం మాత్రమే. ప్రపంచ దేశాలలో ఎక్కడా గురువు అనే భావనే ఉండదు.* 


*గురువు మనలోని మాలిన్యాలను తొలగించి వ్యక్తిగా తయారుచేస్తారు.*


*గురువు అంటే చీకటిలో నుండి వెలుతురులోకి తీసుకువచ్చేవాడని నిర్వచిస్తూ ఉంటారు.*


*అజ్ఞానులను జ్ఞానమార్గం వైపు నడిపించి, మార్చగలిగేది గురువు మాత్రమే.* 


*అందుకే గురువును…          “గురుబ్రహ్మః-గురువిష్ణుః-గురుర్దేవో మహేశ్వరః” అంటూ కీర్తిస్తుంటారు.* 


*గురువు కొరకు పరితపిస్తూ అన్వేషిస్తేనే సద్గురువు లభిస్తాడు. గురువును భక్తితో పూజించాలి. మనలో మనకు తెలియకుండా నిద్రాణమై ఉన్న అహాన్ని తొలగించేది గురువు మాత్రమే.*

**************


*జ్ఞానమార్గం చూపించే గురువు..*


*ఒకరోజు ఒక మహారాజు సాయం సంధ్యా సమయంలో నదీ తీరం వెంబడి ప్రయాణిస్తూ అక్కడ తన గురుదేవులు కౌపీనమునకు పడిన చిల్లులను సూదీదారంతో కుట్టుకొనుట చూసాడు.* 


*గురువును సమీపించి, “గురుదేవా… మీరు నా గురువులు, మీరు ఇలా కౌపీనము కుట్టుకొనుట బాగులేదు. కౌపీనము అంతా చిల్లులమయంగా ఉంది” అన్నాడు.* 


*గురువుగారు ”అయితే?” అని ప్రశ్నించారు.*


*దానికి సమాధానంగా ”నేను మహా రాజును, మీకు ఏమి కావాలన్నా ఇస్తాను” అని ఏం కావాలో కోరుకోమన్నాడు.*


*ఆ గురువుగారు     రాజులో ఉన్న అహాన్ని మాటల ద్వారా గ్రహించారు. ఆయన ”రాజా నువ్వు ఏమైనా ఇవ్వ గలవా!” అని ప్రశ్నించారు.* 


* ”ఓ! ఇస్తాను” అని గర్వంగా అన్నాడు రాజు.*


*గురువు తన చేతిలో ఉన్న సూదిని నదిలోకి విసిరి దానిని తీసుకురమ్మన్నాడు.*


*రాజు నివ్వెరపోయాడు. రాజుకు తనలోని అజ్ఞానం అర్థమైంది. గురువు పాదాలకు సవినయంగా నమస్కరించి అక్కడ నుండి నిష్క్రమించాడు.*


*గురువు భగవంతునికన్నా శక్తిమంతుడు. గురువు కోరికలను తీర్చడు. శిష్యునికి ఏది అవసరమో దానిని ఇస్తాడు. ఒక మహానుభావుడు గురువును గూర్చి చెబుతూ ”గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు. కాని వర్షంలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. గురువు గొడుగులాంటి వాడు” అని అన్నాడు.*


*కబీరు తన దోహాలో    ”గురువు, గోవిందుడు ఒకేసారి దర్శనమిస్తే ముందు గురువుకు నమస్కారం చేస్తా” నని వ్రాసాడు. కారణం గోవిందుని వర్ణించి చెప్పినది గురువే కాబట్టి.* 


*అవతార పురుషులైన రాముడు, కృష్ణుడు తదితరులందరూ గురువులవద్ద విద్యనభ్యసించినవారే.*


*మన గురు పరంపర..*


*ఆషాఢ పూర్ణిమను గురుపూజా ఉత్సవంగా నిర్వహిస్తుంటాము. ఆ రోజును వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు. మన సమాజం వ్యాసమహర్షిని గురువుగా స్వీకరించింది. అంతకుముందు నుండి ఎంతోమంది గురుశ్రేష్ఠులుండగా వ్యాసమహర్షినే గురువుగా ఎందుకు స్వీకరించారనే అనుమానం రాక తప్పదు. ఋక్కులు, యజస్సులన్నిటిని కలిపి యజుస్సంహితగా, సామాలన్ని కలిపి సామ సంహితగా, అధర్వం మంత్రాలన్ని కలిపి అధర్వ సంహితగా తయారు చేశారు. వేదరాశిని నాలుగు భాగాలుగా విభజించి వేదాధ్యయనం సులభతరం చేసి వ్యాసమహర్షి వేదవ్యాసుడిగా కీర్తింపబడ్డాడు. సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా 18 పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారత, భాగవతాది గ్రంథాలు తదితరాలు వ్రాసిన వ్యాసభగవానుని గురువుగా స్వీకరించింది ఈ సమాజం.*


*గీతాకారుని ”కృష్ణం వందే జగద్గురుం” అని కీర్తిస్తున్నది మన సమాజం. అనంతరం అనేకమంది గురువులుద్భవించారు. వేదాలకు భాష్యం వ్రాసి, అస్పృశ్యుడిలో భగవద్దర్శనం పొందిన ఆదిశంకరులను, ”న జాతిః కారణంలోకే గుణాః హేతవః (లోకకళ్యాణానికి కులం కారణం కారాదు, గుణమే ప్రధానమని)” అని ప్రవచించి ఆచరించిన                       శ్రీ రామానుజులను గురువుగా స్వీకరించింది.*


*”సదాచార సంపన్న వ్యాస శంకర మధ్యమాం, అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరమ్‌” అని గురువును నిత్యం స్మరిస్తూ ఉంటాము.* 


*గతంలోనే కాదు నేటికి గురువులు మన కళ్ళముందే ఉన్నారు. పూజ్య రమణమహర్షిని సాక్షాత్తు అరుణాచలేశ్వరుని అవతారంగా భావిస్తారు. వారు భౌతికంగా లేకపోయినా నేటికీ జ్ఞానమార్గాన్ని చూపిస్తూనే ఉన్నారు. సద్గురు శివానందమూర్తిగారి ఆశ్రమానికి వెళ్ళి వారి సమక్షంలో కూర్చుంటే చాలట సందేహాలన్ని తీరుతా యంటారు వారి శిష్యులు.*


*తెనాలి గురువుగారు ”నిన్ను ఎవరైన ముట్టుకుంటే నువ్వు మైలపడటం కాదు, నిన్ను ముట్టుకొన్నవారు పునీతులు కావాలని” చెబుతుంటారు.*


*ఈ విధంగా ఎందరో గురువులు, వ్యక్తులకు, సమాజానికి మార్గదర్శకులుగా నేటికీ ఉన్నారు.*


*కాషాయవర్ణం త్యాగానికి, సమర్పణకు ప్రతీక. సమాజహితమే తమ హితంగా భావించిన సన్యాసులు ధరించేది కాషాయాంబరాలే. అగ్ని తనను తాను దహించుకొంటూ లోకానికి కళ్యాణకారకు డవుతున్నాడు. యాగాగ్ని కాషాయవర్ణంలోనే ఉంటుంది. సూర్యభగవానుడు ఉదాయస్తమయాలలో కాషాయవర్ణంలోనే దర్శనమిస్తాడు.*


*మన దేశ చరిత్రకు సాక్షి కాషాయ ధ్వజమే. దీనిని భగవాధ్వజం అని కూడా అంటారు. కోట్లాది మంది ప్రజలు అనేక సందర్భాలలో ప్రాణాలను తృణప్రాయాలుగా భావించి ఆత్మార్పణ చేశారు. భగవాధ్వజాన్ని చూస్తే వారి బలిదానాలు గుర్తుకు వస్తాయి. ఈ దేశాన్ని ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో అహర్నిశలు శ్రమించిన శిల్పులు గుర్తుకు వస్తారు. భగవాధ్వజాన్ని చూడగానే మన ప్రాచీన ఋషిపరంపరతోపాటు చరకుడు, ఆర్యభట్ట, వరాహమిహిరుడు వంటి మహానుభావులు; సమర్థ రామదాసు, చాణుక్యుడు, రామకృష్ణ పరమహంస తదితర గురుపరంపర గుర్తుకు వస్తుంది. భగవాధ్వజాన్ని దర్శిస్తే ఇటువంటి ఎందరో మహానుభావులు గుర్తుకు వస్తారు. అందుకే అన్నారు ”భగవాధ్వజం ఈ దేశపు చరిత్ర, ఇతిహాసాలకు సాక్షి” అని.*


*సంస్కృతి ఆరాధన ద్వారా సమాజం సర్వాంగీణ వికాసం సాధించాలనేది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఆకాంక్ష. మన ధర్మం, సంస్కృతి నలుదిశలా విస్తరించాలి. భారతమాత జగద్గురు స్థానంలో ప్రతిష్టితమవ్వాలి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన శక్తి భగవాధ్వజ ఛాయలలోనే లభిస్తుంది.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


      *గురువాయూర్ కృష్ణుని లీల*

                ➖➖➖✍️


*దేవుడు మనం ఊహించని సంఘటనలు మనకు ఎదురు చేసి ఆ సంఘటనల నుండి మనకు ఆత్మ జ్ఞానం కలిగేలా చేస్తాడు.*


*కేరళ రాష్ట్రంలో గురువాయూర్ ఊరి ప్రక్కన ఉన్న ‘పేరంపాలచ్చోరి’ అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు కృష్ణ భక్తులు జీవిస్తుండేవారు. బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ నలుగురూ పేదరికంలో ఉన్నవారే, పూట గడవడానికి కూడా జరుగుబాటు లేదు. వారికి తెలిసిందల్లా వంట చేయడమే. దొరికితే తినేవారు లేదా కృష్ణ నామస్మరణతోనే కడుపు, మనసు నింపుకునేవారు. అదే ఊరిలో ఒక వేడుక జరుగుతున్నదని, వంట చేయడానికి వంట మనుషులు కావాలనీ వీరికి తెలిసింది. వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీదే భారం వేసి వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరిగే చోటుకు వెళ్ళారు.*


*ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. నడుము వొంగిపోయి, నిలబడడానికే శక్తిలేని ఈ ముసలివాళ్ళు వంట చేయడానికి వచ్చారా !!! అనుకున్నాడు. ఎగతాళిగా నవ్వుతూ ఈ వయస్సులో మీరు వంట చేయటానికి వచ్చారే! ఇదేదో చిన్న వేడుక అనుకున్నారేమో 1000 గుండిగల అన్నం , కూరలు , పప్పు, చారు అన్నిరకాలు చేయాలి , ఈ వయసులో మీరు అంత పని చేయగలరా! ఈ వయస్సులోకూడా మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయటానికి వచ్చారా?” అని ఎగతాళిగా అన్నాడు.*


*కృష్ణుడి భక్తులైన ఆ నలుగురు వృద్దులు అతని మాటలకు బాధపడి, “ఆ కృష్ణుడి దయ ఉండగా సాధ్యం కానిదేముంటుంది చెప్పండి. మా ప్రయత్నం మేము చేస్తాము, అంతా ఆ కృష్ణుడే చూసుకుంటాడు” అని సమాధానం చెప్పారు.* 


“బానే ఉంది మీరు చెప్పేది, మీ భారం ఆ కృష్ణుడి మీదకు నెట్టేసి మీరు చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా ఏమిటి? మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తాడా? ఇది మీ శక్తికి మించిన పని మీరు చేయగలరన్న నమ్మకం నాకు కుదరడం లేదు” అన్నాడు. 


*“అయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి, మేము ప్రయత్నిస్తాము, ఇది వరకు ఎన్నో సంతర్పణలలో లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకున్నది” అన్నారు.* 


*”సరే చూస్తాను, తేడా వచ్చిదంటే ముసలివాళ్ళు అని కూడా చూడను జాగ్రత్త” అన్నాడు.*


*”గురువాయిరుప్పా ! నీ అనుగ్రహం ఉంటే గడ్డిపోచలతో మదగజాలను కట్టేయచ్చు, దేనినైన సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించాగానే కలుగుతుంది ప్రభూ, నీ మీదే భారం వేసాము  మమల్ని కాపాడు” అని అనుకుంటూ వారు వారి స్థలానికి వెళ్లిపోయారు.*


*మరునాడు ఉదయం తెల్లవారుజామున 3 గం.లకు నిద్ర లేచి ప్రక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్లారు. అప్పుడు వాళ్లకి అంతకుముందే పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడు మొఖం కడుకుంటూ కనిపించాడు. వాళ్ళు ఆశ్చర్యంతో “నాగోరి! నువ్వు ఎప్పుడు వచ్చావ్ ఇక్కడికి?” అని అడిగారు.*


*అప్పుడు ఆ బాలుడు “నిన్న రాత్రి మీరు ఇక్కడికి వంట పనికి వచ్చారు అని తెలిసింది, వృద్దులైన మీకు సహాయం చేయటానికి నేను వచ్చాను” అని అన్నాడు.* 


*ఆ నలుగురికి చాలా సంతోషం కలిగింది. అందరూ స్నానాలు ముగించుకొని బయలుదేరారు.*


*వంట పని మొదలు పెట్టారు. ఆ నలుగురు ఏదో కొంచెం కొంచెం సహాయం చేసారు కానీ ఆ బాలుడే వంట మొత్తాన్నీ చక చక పూర్తి చేసాడు. ఉదయం 9 గంటల కల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడి నైవేద్యం కోసం పొంగల్, పులిహోర , అన్నిరకాల వంటలు సిద్ధం చేసి ఉంచారు.*


*అందరూ ఆశ్చర్యపోయారు.*


*వాళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకుడు కూడా  ఆశ్చర్యపోయి వారి శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసి, చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తాప పడి, క్షమాపణలు చెప్పి,  నలుగురు కృష్ణ భక్తులకూ ఘనంగా సత్కారం చేసి, పొగిడి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగానే డబ్బులు ఇచ్చాడు.*


*వారికి వంట చేయడంలో సహాయం చేసిన నాగోరీ గురించి ఆ కార్యనిర్వహకునికి తెలియదు. వారికి సత్కారం జరుగుతుండగా "నేను త్వరగా గురువాయూర్ వెళ్ళాలి, నాకోసం అక్కడ ఎంతో మంది వేచి ఉన్నారు" అన్ని చెప్పి నాగోరీ భోజనం కూడా చేయకుండానే అక్కడినుండి వెళిపోయాడు.*


*ఆ నలుగురు భక్తులూ భోజనం చేసి గురువాయూర్ వెళ్లారు. వాళ్ళు ఆ ఆనందంలో, ఎంతో సహాయం చేసిన నాగోరి గురించి పూర్తిగా మర్చిపోయారు. గురువాయూర్ లో దర్శనం చేసుకొని వాళ్ళ నలుగురు వాళ్ళ సొంత ఉరికి వెళ్లిపోయారు.*


*ఆ రోజు రాత్రి నలుగురికీ ఒకే కల వచ్చింది.*


*ఆ  కలలో గురువాయూరప్పన్ కనిపించి “భక్తులారా! నాగోరి లాగా వచ్చి మీకు వంట పనిలో సహాయం చేసిన నాకు కూలి ఇవ్వకుండా వచ్చేసారే, నా చేత పని చేపించుకొని కూలి ఇవ్వకపోవటం మీకు న్యాయమేనా?" అని అడిగాడు.*


*ఉలిక్కిపడి లేచి ఒకరినొకరు చూసుకున్నారు. ఆశ్చర్యం!   అందరికీ ఒకే కల వచ్చింది,     అది కలా?                కాదు! కాదు!! అందరికీ ఒకే దివ్య దర్శనం, సందేశం లభించాయి. వెంటనే అందరూ ఆనందబాష్పాలు రాలుస్తూ , గురువాయురప్పని కీర్తిస్తూ, జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంలో గురువాయూర్ చేరి స్వామి వారికి కూలీగా తమకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు.*


*ఆ సంఘటన మూలంగా ఇప్పటికి కూడా 1000 గుండిగల నైవేద్యం చేసి గురువాయూరప్పన్ కి పూజలు చేస్తున్నారు. ఆ సమయంలో వంట చేసే కూలీలు వారికి వచ్చిన కూలిడబ్బులో ఒక వంతు దేవుడికి  నేటికీ సమర్పిస్తున్నారు.*✍️


*హరే కృష్ణ  హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.*

*హరే రామ హరే రామ రామ రామ హరే హరే.*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖




                *ఆగని కన్నీరు...!

                 ➖➖➖✍️️


              ....మొదట శృంగేరి వెళ్ళండి!



        చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన! మేము ఒకయాభై మందిమి కలిసి కర్ణాటకలోని   క్షేత్రాలకు వెళ్దామని నిర్ణయించుకొని     ఒక టూరిస్ట్ బస్సులో ప్రయాణం ప్రారంభించాము. 

      

        ముందుగా కంచి వెళ్ళి పరమాచార్య స్వామి వారిని    దర్శించుకుని వెళ్ళడం మాకు అలవాటు.           కనుక మొదట అక్కడికి    వెళ్ళాము.             సుమారు సాయింత్రం నాలుగు గంటల సమయం లో        శ్రీమఠంలో పరమాచార్య స్వామి వారిని దర్శించుకొని   వారికి సాష్టాంగం చేసి నిలబడ్డాము.  చిన్నగా నవ్వి రెండు చేతులు పైకెత్తి  మమ్మల్ని   ఆశీర్వదిస్తూ ఇలా అడిగారు       “అందరూ       పెద్ద గుంపుగా వచ్చారు,    ఏమిటి సంగతి?” 


          తరువాత నేను స్వామివారికి మా కర్ణాటక యాత్ర       గురించి       మొత్తం వివరించాను. 


      స్వామి వారు      చాలా సంతోషపడి కనుబొమ్మలు పైకెత్తి, “మొదట అక్కడికి వెళ్ళాల్సిన  ఉద్దేశం  ఏమిటి?”      అని అడిగారు.    “మా ఉద్దేశం....  పెరియవ మంగుళూరు    చేరగానే         మొదటగా 'తలకావేరి' కి  వెళ్ళి,     అక్కడ సంకల్ప స్నానం చేసి,   శృంగేరికి వెళ్తాము. 


    తరువాత     అక్కడినుండి     'కుక్కె 

సుబ్రహ్మణ్య,     ధర్మస్థళ,     ఉడుపి, 

కొల్లూరు మూకాంబిక,      కటిలు దుర్గా పరమేశ్వరి . . .ఇలా” అని అన్నాను. 


     నేను ముగించకముందే స్వామివారు అడ్డుపడుతూ,        “ఆగాగు. . . నువ్వు చెప్పిన    క్షేత్రాలలో       ఒక ముఖ్యమైన ప్రదేశాన్ని మరచిపోయావు”. 


        ప్రశ్నార్థకంగా  చూస్తున్న   మావైపు 

చూసి నవ్వుతూ,      “ఏమిటి?    అర్థం కాలేదా?    నేనే చెప్తాను. . . హొరనాడు క్షేత్రం!    అమ్మ    అక్కడ   అన్నపూర్ణగా వెలసి అనుగ్రహిస్తున్నది.   చాలా చాలా విశిష్టమైన క్షేత్రం. తప్పకుండా మీరంతా దర్శించండి” అని చెప్పారు. 


   మరలా ఇలా చెప్పారు“మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెయ్యండి.   మొదట మంగళూరు నుండి     శృంగేరి క్షేత్రానికి వెళ్ళండి.అక్కడ తుంగానదిలోసంకల్ప స్నానం చేసి, గురువులను దర్శించుకొని ప్రసాదం తీసుకొని  అమ్మ శారదా దేవిని దర్శించుకొని మీయాత్రమొదలుపెట్టండి 


    ఆ తరువాతే    మీరు    వెళ్లవలసిన ప్రదేశాలకు వెళ్ళండి.      ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు శృంగేరికి ఏ రోజు వెళ్ళినా,             సాధ్యమైనంతవరకు సాయింత్రం లోగా చేరుకోండి”. 


        అందరమూ     అంగీకరిస్తున్నట్టు తలఊపి,       మహాస్వామి       వారికి సాష్టాంగం చేసి,   మాకు ప్రసాదం ఇచ్చి పంపించారు. మాబస్సు యొక్క డ్రైవరు కండక్టరుకు కూడా          ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు.   మేము మా యాత్రను కొనసాగించాము. 


        మరుసటి రోజు     ఉదయం     మా ప్రయాణం      బెంగళూరు        నుండి మంగళూరుకు.    రాత్రికి మంగళూరులో ఒక కళ్యాణమండపంలో బస చేసాము. మరుసటి రోజు ఉదయం లేచి      స్నాన పానాదులు    ముగించుకొని      బయలు దేరుతున్నాము.      రామనాథన్    అని మాతో పాటే వచ్చిన ఒకతను  నావద్దకు వచ్చి,      “మనం ముందు    తలకావేరి వెళ్దాము.  అక్కడ సంకల్ప స్నానం చేసి, తరువాత.   శృంగేరి వెళ్దాము”     అని నన్ను ఒప్పించబోయాడు. 


     నేను ఒప్పుకోక ”పరమాచార్య స్వామి వారు మనకు   ఏమి చెయ్యమని చెప్పారో అలాగే చేద్దాం”   అని  అన్నాను.   కాని వాళ్ళకి అది   నచ్చలేదు.       “ముందు తలకావేరికే    వెళ్ళాలి”    అని    ఒత్తిడి చేసారు.   బహుశా   వారు   ముందే... మాట్లాడు కున్నారేమో     నేను ఎంతగా ప్రాధేయపడ్డా       నా మాట    వారికి చెవికెక్కలేదు.


బస్సు తలకావేరివైపు ప్రయాణించింది. రోజంతా అక్కడ గడిపి నదిలో సంకల్ప స్నానం చేసి,   శృంగేరికి బయల్దేరాము. అప్పుడు రాత్రి 8:00గంటల సమయం.  శృంగేరికి కొండమార్గంలో వెళ్తున్న   మా బస్సు ముందు    రెండు   టైర్లు పంక్చర్ అయ్యి బస్సు ఆగిపోయింది. 


     బయటంతా   కటిక  చీకటి!    కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనబడదు. టార్చి లైటు వెలుతురులో   డ్రైవరు   మరియు కండక్టరు పంక్చర్అయిన టైర్లు తీసివేసి వేరే వాటిని అమర్చుతున్నారు. 


మాకందరికి కడుపులో చాలా ఆకలిగా ఉంది. చివరగా మద్యాహ్నం ఎప్పుడో బాడమండలలో తిన్నాము. 


   దాదాపు 10:00 గంటల సమయంలో బస్సు   బయలుదేరింది.     హఠాత్తుగా చిన్నగా వర్షం మొదలైంది.     అప్పుడు సమయం 11:00 గంటలు,    అయినా శృంగేరి జాడ కనిపించడం లేదు. 


   అప్పుడే మాకు అనుమానం వచ్చింది నిజంగా మేము సరైన దారిలోనే    వెళ్తు న్నామా   లేదా     దారి తప్పామా అని! అప్పుడే   దేవుడు   పంపాడా  అన్నట్టు దూరంగా ఒక మనిషి కనబడ్డాడు. 


       మేము అతని దగ్గరగా బస్సు ఆపి అడిగాము.        అతను తల కొట్టుకుని

“ఇది వేరే మార్గం.       15 కిమీ ముందే మీరు కుడి వైపున తిరగవలసి ఉన్నది” అని మాకు షాకిచ్చాడు. 


   కావున ఇప్పుడు బస్సు మేము వచ్చిన దారివైపు వెనక్కితిరగాలి.  డ్రైవరు దిగి పరిశీలించగా,   ఇరువైపులా లోయలతో కూడుకున్న    చిన్న  రోడ్డుమార్గం  అది. 

తన స్థానంలో కూర్చుని తెచ్చి పెట్టుకున్న ధైర్యంతో,      “మీరేమి  భయపడకండి. నేను     కొద్ది కొద్దిగా బస్సును     వెనకకు తీస్తూ    బస్సును తిప్పుతాను”     అని మొదలెట్టాడు.       ఎలాగో కష్టపడి ఒక తొంబై డిగ్రీలు      తిప్పిన     తరువాత, ఆందోళన పడుతూ గట్టిగా అరిచాడు. 

“సార్ .. సార్ బ్రేకుని నేను ఎంత గట్టిగా తొక్కిపట్టినా     పడటం లేదు      బస్సు వెనక్కు పడిపోతోంది.  దేవుడే మనల్ని కాపాడగలడు గట్టిగా ప్రార్థించండి” అని అన్నాడు. 


        మాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టైంది. 


    బస్సు వెనక్కు పడిపోతొందని మాకు తెలుస్తోంది.   మా అందరి కళ్ళల్లొ నీరు కారుతుండగా     గట్టిగా        అరవడం మొదలెట్టాము.  “అమ్మా.....    శృంగేరి శారదాంబా..... కాపాడు!     శృంగేరి.... మహాసన్నిధానం కాపాడండి!      కంచి పరమాచార్యగళే,   రామచంద్రమూర్తియే కాపాడండి కాపాడండి!!!”


హఠాత్తుగా డ్రైవరు చెప్పాడు“సార్ సార్ నేను బ్రేకుపైన కాలు తీసేసాను,అయినా బస్సు వెనక్కు పడిపోవడం లేదు.  ఒక వంద మంది వెనక నిలబడి   బస్సును పట్టుకున్నట్టుగా    బస్సు ఆగిపోయింది. ఏమి  భయపడకండి.       నేను మెల్లిగా బస్సును       తిప్పుతాను”      అని తన ప్రయత్నం మొదలు పెట్టాడు.    కానీ.... మేము నామఘోష ఆపలేదు!


   హమ్మయ్య చివరగా డ్రైవరు బస్సును తిప్పాడు.      అందరూ ఊపిరి     పీల్చు కున్నారు.   అప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలు.   సరిగ్గా ఒకటిన్నరకు శృంగేరి సంస్థానం ప్రవేశద్వారం చేరుకున్నాము. 


    మాకోసం ఎదురు చూస్తున్న నాగేశ్వర గణపదిగళ్      మమ్మల్ని      చూడగానే నవ్వుతూ,     “రండి రండి మీరందరూ మద్రాసు నుండి     వస్తున్నారు   కదూ? ముందు     కాళ్ళు చేతులు     కడుక్కుని కొద్దిగా తినండి.చాలాఆకలిగా ఉన్నారు. మీ కోసమని    అన్నం   ఉప్మా, వంకాయ గొజ్జు సిద్ధం చేసాము” అని అన్నారు. 


     ”శాస్త్రిగారూ  మేము     వస్తున్నామని మీకు ఎలాతెలుసు? మేము మీకు జాబు కూడా రాయలేదు” అని అడిగాను. 


      అతను నవ్వుతూ, “అవును నిజం. మీరు    వస్తున్నారని     మావంటివారికి తెలియకపోవచ్చు.      కాని లోపల ఉన్న త్రికాలవేదులు        శ్రీ మహాసన్నిధానం వారికి అంతా తెలుసు.   మీకు తెలుసా, దాదాపు    పదకొండు    గంటలప్పుడు స్వామి వారు నన్ను పిలిచి,  ‘శారదాంబ దర్శనం కోసం     54 మంది     భక్తులు వస్తున్నారు.      వారు   చాలా  ఆకలిగొని ఉంటారు.        మీ వాళ్ళకి చెప్పి అన్నం ఉప్మా  వంకాయ గొజ్జు తయారుచేయించి సిద్ధంగా ఉంచు. అలాగే వారి కోసం ఒక పెద్ద  హాలును    సమకూర్చు’.      అన్నీ ముగించుకొని    మిమ్మల్ని    ఆహ్వానించ డానికి నేను ఇక్కడ నిలబడ్డాను” అని మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసారు. 


శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దూరదృష్టి,     వారి అవ్యాజమైన కరుణని   తలచుకొని     నేను     ఆశ్చర్య పోయాను.నా కళ్ళ వేంట   ఆగనికన్నీరు వచ్చింది. అది చూసి శాస్త్రి గారు “దీనికే మీరు ఆశర్యపోతున్నారు.రేపు ఉదయం మీకు మరొక    విషయం కూడా చెప్తాను. మీరు అది విని ఇంకా ఆశ్చర్యపోతారు” అని అన్నారు. 


  అరిటాకులపై వేడి వేడిగా అన్నం ఉప్మా, వంకాయ గొజ్జు వడ్డించారు.   మా కడుపుల  నిండుగా   తిని     ఆ రాత్రికి విశ్రమించాము. 


          మరుసటి రోజు ఉదయం తుంగా నదిలో      మా స్నానాలు ముగించుకొని దక్షిణామ్నాయ   శృంగేరి పీఠాధీశ్వరులు మహాసన్నిధానం          శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దర్శనానికి బయలుదేరాము.   రాత్రి మేము కలిసిన శాస్త్రి గారు కూడా మాతోనే ఉన్నారు. 


     నేను వారికి రెండుచేతులు జోడించి నమస్కరించి“నిన్న మీరు మాకు ఇంకొక విషయం చెబుతానన్నారు.    దయచేసి చెప్పవలసిందిగా వేడుకుంటున్నాను” అని వారిని ప్రార్థించాను. 


   వారు చెప్పడం ప్రారంభించారు “రాత్రి దాదాపు 12:00 గంటల    సమయంలో మహాసన్నిధానం వారు    వారి ఏకాంత మందిరంలో కూర్చుని శాస్త్రసంబధమైన పుస్తకాలు చూస్తున్నారు.   నేను బయటి గదిలో కూర్చున్నాను.      హఠాత్తుగా ... బయటకు వచ్చి     స్వామి వారు    తమ రెండు చేతులని   గోడకి ఆనించి గట్టిగా అదుముతూ,      ఏదో మంత్రం చదవ నారంభించారు. నేను లేచినిలబడ్డాను. వారిని చూస్తే ఆ గోడ పడకుండా   ఆపు తున్నట్టు ఉంది.        నాకు ఏమి అర్థం కాలేదు. 


          ఒక ఐదు నిముషాల తరువాత గోడ   పైనుండి     చేతులు తీసి......, మహాసన్నిధానం వారు       నా దగ్గరకు వచ్చి      ‘నేను  ఇలా గోడకు     చేతులు అడ్డుపెట్టి జపంచెయ్యడం చూసిననీకు వింతగా అగుపిస్తోది కదూ. ఏమీలేదు! మద్రాసు నుండి శారదాదేవి దర్శనానికి వస్తున్న బస్సు దారి తప్పింది.     వారు తప్పు  మార్గంలో   ప్రయాణిస్తున్నామని తెలుసుకుని      బస్సును      వెనక్కు తిప్పుతుండగా,   బ్రేకులు పడక బస్సు లోయలోకి పడిపోతోంది.....


   అందులోఉన్నభక్తులు గట్టిగా "అమ్మా శారదా!    కాపాడు    కాపాడు"     అని అరిచారు.      అందుకనే    గోడకి    నా చేతులను అడ్డుపెట్టి        ఆ బస్సు.... పడిపోకుండా     ఆపాను.      ఇప్పుడు అంతా సవ్యంగా ఉంది. బస్సు శృంగేరి వైపు వస్తోంది.     నీవు వెళ్ళి....    నేను ఆనతిచ్చినట్టుగా     వారికి  అన్నీ సిద్ధం చెయ్యి’   అని చెప్పి     వారు      గదిలోకి వెళ్ళిపోయారు.    నేను ఇదంతా విని స్థాణువైపోయాను.”          ఇది విని మేమందరమూ ఉండబట్టలేక   కన్నీరు కారుస్తూ,   ఆ నడయాడే శారదా దేవిని చూడటానికి బయలుదేరాము. 


       శ్రీవారికి సాష్టాంగం చేసి నిలుచున్న నావైపు చూసి, శ్రీ శ్రీ శ్రీ మహాసన్నిధానం వారు నవ్వుతూ,     మాకు       హెచ్చరిక చేస్తున్నట్టు  “మహాత్ములు చెప్పినదాన్ని ఎప్పుడూ వినాలి.     దాన్ని తప్పకుండా పాటించాలి.      అలాకాకుండా ప్రవర్తిస్తే జరగవలసినవి   ఏవి   సరిగ్గా జరగవు. ఏమిటి అర్థమైందా?”     అని అన్నారు. 


     మహాసన్నిధానం వారు చెప్తున్నది .. 

కంచి పరమాచార్యులు వారు      మాకు ఆజ్ఞాపించినదాని గురించే    అని నాకు అర్థమైంది.....✍️️



--- శ్రీ రమణి అన్న, శక్తి వికటన్ ప్రచురణ


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

[22/04, 9:23 am] +91 94939 06277: 150423h1841    220423-4.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


 *భగవంతుడి నోట “తాతా” అని పిలిపించుకున్న భక్తుడు.*

              ➖➖➖✍️



 *భగవంతుణ్ణి భక్తుడు ఆర్తితో పలురకాలుగా పిలుస్తాడు. తన మనసుకి తోచిన బంధంతో పరమేశ్వరుని కొలుచుకుంటాడు. కానీ భగవంతుడే భక్తుణ్ణి “తాతా” అని పిలుచుకున్న ఓ అరుదైన సందర్భం ఉంది. ఆ భగవంతుడు శ్రీనివాసుడైతే, భక్తుడు తిరుమలనంబి.*


 *ఈ “తిరుమలనంబి” ఎవరో కాదు. రామానుజాచార్యులకి మేనమామ. రామానుజాచార్యులు జన్మించగానే, వారిని చూసి ఇతడు సాక్షాత్తూ లక్ష్మణుని అవతారమనీ, కలియుగంలో అద్భుతాలు సాధిస్తాడనీ ఊహించాడు తిరుమలనంబి.*


*తిరుమలనంబి అసలు పేరు శ్రీశైలపూర్ణుడు. ఆయనగారు తన మేనల్లుడైన రామానుజాచార్యుల భవిష్యత్తుకి తగు సూచనలు అందిస్తూనే శ్రీరంగంలో ఉన్న యమునాచార్యులు అనే గురువుగారి వద్ద ఆధ్మాత్మిక జ్ఞానాన్ని అభ్యసించసాగారు.*


*గురువుగారు తరచూ తిరుమల శ్రీనివాసుని తల్చుకోవడం గమనించారు తిరుమలనంబి. దాంతో కొన్నాళ్లపాటు తిరుమలలో గడిపి రావాలన్న కోరిక కలిగింది.*


*అలా తిరుమలకు చేరుకున్న తిరుమలనంబి ఏడుకొండల మధ్య కొలువైన శ్రీనివాసుని వైభవం చూసి ఇక వెనక్కి వెళ్లలేదు. ఆయన జీవితాంతమూ శ్రీవారి ఆలయంలో జరిగే సేవలకు తన వంతు సాయాన్ని అందిస్తూ గడిపేశారు.*


*తిరుమలనంబి ప్రతిరోజూ శ్రీవారి అభిషేకం కోసమని ఎంతో దూరంలో ఉన్న పాపవినాశనం అనే తీర్థం నుంచి జలాలను తీసుకువచ్చేవారు. ఏళ్లు గడుస్తున్నా, ఒంట్లో సత్తువ తగ్గిపోతున్నా తిరుమలనంబి తన దినచర్యను మార్చుకోలేదు. జోరున వర్షాలలో, జారిపోయే రాతిగుట్టల మీద నడుస్తూ జలాన్ని తెచ్చేవారు. రాళ్లు ముళ్లల్లా గుచ్చుకుంటున్నా మనసులో శ్రీనివాసుని తలచుకుని నడకని సాగించేవారు. పాపవినాశనం నుంచి తీర్థాన్ని తెచ్చి శ్రీవారి పాదాలను కడిగితే కానీ ఆయనకు రోజు గడిచినట్లు ఉండేది కాదు.*


*అలాంటి తిరుమలనంబిని ఆటపట్టిద్దామనుకున్నారట ఒకసారి శ్రీవారు. ఆయనకి ఆటలంటే మహా ఇష్టం కదా! ఒకరోజు యథావిధిగా తిరుమలనంబి ఒక మట్టికుండలో పాపవినాశనం నుంచి జలాన్ని నింపుకొని వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆ సమయంలో ఆయనకు వేటగాని రూపంలో ఎదురుపడ్డాడు శ్రీనివాసుడు.*


 *~”తాతా! కుండ నిండా నీళ్లు మోసుకుపోతున్నావు కదా! నాకు కాసిని నీళ్లివ్వవా!” అని అడిగాడట వేటగాడి రూపంలో అక్కడికి వచ్చిన శ్రీనివాసుడు*


 *’కాస్త నడిస్తే నీకే ఎక్కడో ఓ చోట నీళ్లు దక్కుతాయి. పోయి తాగు! నాకు అభిషేకానికి వేళ మించిపోతోంది’ అని బదులిచ్చాడట తిరుమలనంబి. ఒకటికి రెండుసార్లు ఈ సంభాషణ ఇలాగే గడిచిన తరువాత తిరుమలనంబి ఆ వేటగాడిని దాటుకుని ముందుకు సాగాడు.*


 *వేటగానిలా ఉన్న వేంకటేశుడు అక్కడితో ఊరుకోలేదు. తిరుమలనంబి వెనకే చేరి అతని కుండకి తన బాణంతో బెజ్జం చేసి హాయిగా అందులో నీటిని తాగేశాడు.*


 *జరిగింది తెలుసుకున్న తిరుమలనంబి కుప్ప కూలిపోయాడు. ‘ఏళ్లకు ఏళ్లుగా జరుగుతున్న అభిషేకానికి విఘ్నం వాటిల్లిందే’ అని బాధపడుతూ తీర్థాన్ని తీసుకువచ్చేందుకు మళ్లీ పాపవినాశనానికి పయనమయ్యాడు.*


 *’తాతా! తీర్థజలం కోసం అంత దూరం మళ్లీ ఏం పోతావు. ఇక్కడికి దగ్గరలోనే మరో తీర్థం ఉంది. చూపిస్తాను రా!’ అంటూ తన వెంట తీసుకుపోయాడు వేటగాడు. అటూఇటూ ఎంత తిరిగినా తీర్థం కనిపించలేదు. అభిషేకానికి ఓ పక్క వేళ మించిపోతోంది. అలా కాసేపు తిరుమలనంబిని అడవిలోనే తిప్పించిన శ్రీవారు… “ఇక్కడ ఏ తీర్థమూ ఉన్నట్లు లేదు. ఉండు నేనే ఏదో ఒక ఏర్పాటు చేస్తాను” అని తన బాణాన్ని ఒక కొండ మీదకు సంధించారు.* 


 *~అప్పుడు ఏర్పడిన తీర్థమే ఆకాశగంగ! ఆ సంఘటనకు గుర్తుగా ఇప్పటికీ తిరుమలనంబి వారసులు ఆకాశగంగ జలాలతో శ్రీవారి పాదాలను అభిషేకిస్తుంటారు.*


*తిరుమలనంబికీ, శ్రీవారికీ ఉన్న అనుబంధానికి గుర్తుగా శ్రీవారి ఆలయానికి చేరువలోనే ఆయనకు కూడా ఒక చిన్న గుడిని నిర్మించారు.*✍️

        *ॐశ్రీవేంకటేశాయ నమః*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*ఆధ్యాత్మిక విషయాలు దైవ కార్యక్రమాలు దేవుళ్ల వివరాలు తెలుసు కొనుటకు జాయిన్ బటన్ నొక్కండి https://chat.whatsapp.com/Emm3knQIrJA2rlMnRRXFjF

                     ➖▪️➖


కామెంట్‌లు లేవు: