23, ఆగస్టు 2023, బుధవారం

సాంగత్యం ఎలా ఉండాలి?

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*సాంగత్యం ఎలా ఉండాలి?*_

🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


✳️ _*భగవంతుని సృష్టిలో ప్రతిదీ ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది.*_


✅ _*బియ్యపుగింజకూ, వరిగింజకూ మధ్య ఉన్న సంబంధంలో  ఎంతో గొప్పఆధ్యాత్మిక విజ్ఞానమున్నది.*_


✅ _*పొట్టు ఉంటే వరి గింజ. పొట్టును తొలగిస్తే బియ్యపు గింజ. పొట్టు ఉంటేనే గింజ తిరిగి మొలకెత్తుతుంది. పొట్టును తొలగించినట్లయితే గింజ తిరిగి మొలకెత్తదు. పొట్టు అనేది  అజ్ఞానం లాంటిది. అజ్ఞానం ఉంటే జీవుడు. అజ్ఞానం తొలిగిపోతే దేవుడు. అజ్ఞానం కలవాడికి పునర్జన్మ ఉన్నది. అజ్ఞానం తొలగినవాడికి పునర్జన్మ  లేదు.*_


✳️ కనుక, మనమందరమూ సద్గ్రంథ పఠనం చేసి, సజ్జన సహవాసం చేసి, సత్సేవ చేసి, ఇలాంటి సత్సంగంలో చేరి అజ్ఞానాన్ని తొలగించుకొనే ప్రయత్నంచేయాలి.


🪷 _*సాంగత్యం ఎలా ఉండాలి?*_ -  


కధ: 💐


✳️ ఒకసారి ఒక వేటగాడు వేటకు వెళ్ళాడు, ఏమి దొరకలేదు, అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. గాలి వేగం ఎక్కువగా ఉండి కొమ్మల కదలిక కారణంగా చెట్టు నీడ తక్కువ అవుతోంది. అప్పుడే అక్కడ నుండి ఒక అందమైన హంస ఎగురుతూ అక్కడకు వచ్చింది, ఎవరో పడుకున్నాడు, అతనిపై నీడ రావడం లేదు, కలత చెందుతున్నాడని, అతనిపై ఎండవస్తోంది అని గమనించి, ఆ చెట్టు యొక్క కొమ్మపై రెక్కలు తెరచి కూర్చుంది. వేటగాడు ఆ హంస యొక్క నీడలో హాయిగా నిద్రపోయేలా చేసింది.


✳️ కొంత సమయం తరువాత వేటగాడు నిద్రిస్తున్నప్పుడు, ఒక కాకి వచ్చి అదే కొమ్మపై కూర్చుని, హంసతో మాటలు కలిపింది. ఇటు అటు చూసి ఎటువంటి ఆలోచన లేకుండా, అతని మీద రెట్ట వేసి ఎగిరిపోయింది. అప్పుడు ఆ వేటగాడు లేచి ఇటు అటు కోపంగా చూసి వెంటనే విల్లు తీసి ఎదురుగా కనిపించిన హంసను కొట్టాడు. హంస కింద పడి చనిపోతూ, నేను నీకు నీడ ఇచ్చి సేవ చేసాను. నీవు నన్ను చంపావు. ఇందులో నా తప్పు ఏమిటి అని అడిగింది.


🪷 అప్పుడు వేటగాడు విషయం గ్రహించి ఇలా అన్నాడు. నీవు ఉన్నత కుటుంబంలో జన్మించావు. నీ ఆలోచనలు నీ శరీరంలాగే అందంగా ఉన్నాయి.

నీ ఆచారాలు స్వచ్ఛమైనవి. నాకు సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతోనే ఉన్నావు. కానీ నీవు ఒక్క పొరపాటు చేసావు,  కాకి వచ్చి నీతో కూర్చున్నప్పుడు, వెంటనే నీవు ఎగిరిపోయి ఉండాల్సింది. ఆ దుష్ట కాకి సాంగత్యం క్షణకాలమే అయినా నిన్ను మరణ ద్వారం వద్దకు తీసుకువెళ్ళింది.


✳️ అందుకే,  మన పెద్దలు ఎల్లప్పుడూ చెపుతుంటారు మంచి సత్సాంగత్యం లోనే వుండమని.


✅ _*సత్సంగము ద్వారా జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి.*_


_*సత్సంగత్వే - నిస్సంగత్వం*_

_*నిస్సంగత్వే- నిర్మోహత్వం,*_

_*నిర్మొహత్వే - నిశ్చల తత్వం,*_

_*నిశ్చల తత్వే - జీవన్ముక్తిః*_


❀┉┅━❀🕉️❀┉┅━❀

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 

🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*

🚩 *హిందువునని గర్వించు*

🚩 *హిందువుగా జీవించు*


*సేకరణ:* వాట్సాప్ పోస్ట్ 

🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

కామెంట్‌లు లేవు: