23, ఆగస్టు 2023, బుధవారం

ప్రజాదరణ ఉన్న పాలకుణ్ణి

 తస్కరస్య వధో దండో.          దాస దండస్తు ముండనమ్!    భార్యాదండం పృథక్ శయ్యా.                                మిత్రదండమ్ అభాషణమ్!!                       దొంగకు హింసించడం శిక్ష. సేవకునికి తలగొరిగించడం శిక్ష. భార్యను పడకగదిలో దూరంగా ఉంచడం శిక్ష. స్నేహితునితో మాట్లాడకుండా దూరంగా ఉంచడమే సరియగు శిక్ష.       చమత్కార శ్లోకం;----             ప్రజాగుప్త శరీరస్య-- కిం కరిష్యంతి సంహతాః?           హస్త న్య స్తాత పత్రస్య-- వారి ధారా ఇవారయః!!         ప్రజాభిమానం ఉన్నదే అది గొడుగు వంటిది. చేతిలో గొడుగు ఉన్నవాణ్ణి వర్షం ఏమీ చేయలేనట్లు , ప్రజాదరణ ఉన్న పాలకుణ్ణి, ఏ శత్రువులు ఏమీ చేయలేరని కవి భావం. ( భోజ చరితం నుండి గ్రహీతము)                           తేది 13--8--2023, ఆదివారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: